Meta గ్లోబల్ టీమ్‌కు మోదీ ప్రభుత్వం సమన్లు.. ఆగస్టు 5, 6 తేదీల్లో విచారించనున్న కేంద్రం
Narendra Modi | కేంద్ర ప్రభుత్వం మెటా గ్లోబల్ టీమ్‌కు నోటీసులు జారీ చేసింది. ఇటీవల మెటా, ప్రధాని మోదీకి చెందిన ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను తొలగించడం హాట్ టాపిక్ అయింది.

కేంద్ర ప్రభుత్వం మెటా (Meta) పట్ల సీరియస్‌గా ఉంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ చేసిన పోస్టును పేజీలో కనిపించకుండా చేయడాన్ని కేంద్రం తప్పుపట్టింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం మెటా గ్లోబల్ టీమ్‌కు సమన్లు జారీ చేసింది. ఐటీ కార్యదర్శి ఎస్. కృష్ణన్ మంగళవారం (ఆగస్టు 4) మాట్లాడుతూ.. ఆగస్టు 5-6 తేదీలలో ప్రభుత్వం మెటా గ్లోబల్ టీమ్‌ను విచారించనుంది. కంటెంట్ కంట్రోల్, బాలలపై లైంగిక వేధింపులు, దుర్వినియోగ సమాచారం కేసులలో తీసుకున్న చర్యలపై మెటా బృందాన్ని కేంద్రం ప్రశ్నించనుంది.
ఇటీవల మెటా, జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (NEET)కు సంబంధించిన ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక ఫేస్‌బుక్ పోస్ట్‌ను కొంత సమయం పాటు తొలగించడం వివాదాస్పదమైంది. దీని తర్వాత కేంద్రం మెటా ఇండియా అధికారిని పిలిపించి వివరణ కోరింది. కానీ ఈసారి నేరుగా మెటా గ్లోబల్ టీమ్‌ను పిలిపించింది.
వార్తా సంస్థ పిటిఐ (PTI) ప్రకారం, CSAM అంశంపై ఐటీ కార్యదర్శి మాట్లాడుతూ.. మెటా వంటి ప్రధాన సాంకేతిక సంస్థలు తమ వ్యవస్థలు సరిగ్గా పనిచేసేలా చూసుకోవడంలో సమర్థవంతంగా ఉండాలన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటనల ద్వారా బాలలపై లైంగిక వేధింపులు, దుర్వినియోగ పదార్థాలు ప్రసారమైన కేసులకు సంబంధించి మెటా దర్యాప్తు పరిధిలో ఉంది. దాంతో పలు కీలక కేసుల్లో మెటా తీసుకున్న చర్యలు, వాటిని అరికట్టేందుకు చేపట్టిన కార్యక్రమాలను ప్రశ్నించనుంది.
Also Read: EPFO 15000 పరిమితిని పెంచుతున్న కేంద్రం.. PF, పెన్షన్‌లో మరింత పొదుపు చేయవచ్చు
పార్లమెంటరీ కమిటీ కఠిన వైఖరి
అంతకుముందు సోమవారం (ఆగస్టు 3) సమాచార, సమాచార సాంకేతికతపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రధాని మోదీ ఫేస్‌బుక్ పోస్ట్‌ను కొంతసేపు తొలగించడంపై తీవ్ర అభ్యంతర వ్యక్తం చేసింది. బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే అధ్యక్షతన ఉన్న ఈ కమిటీ మెటా, గూగుల్, యూట్యూబ్, స్నాప్‌చాట్, ఎక్స్ (X) ప్రతినిధులతో పాటు హోం మంత్రిత్వ శాఖ, ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అధికారుల వద్ద నుంచి వివరాలతో కూడిన వివరణ కోరింది.
सभी सोशल मीडिया प्लेटफॉर्म्स भारत से 3 लाख करोड़ कमाते हैं,टैक्स का केवल 8 हजार करोड़ जमा करते हैं ।हमारे ही पैसे का इस्तेमाल संविधान मिटाने,देश को टुकड़े टुकड़े करने तथा देश विरोधी ताक़तों को समर्थन देकर करते हैं https://t.co/WLZdxnwAs6
— Dr Nishikant Dubey (@nishikant_dubey) August 4, 2026
నిశికాంత్ దూబే తన ఎక్స్ (X) పోస్ట్‌లో ఇలా పోస్ట్ చేశారు. ‘అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు భారత్ నుంచి 3 లక్షల కోట్లు సంపాదిస్తున్నాయి. కానీ కేవలం 8 వేల కోట్ల పన్ను మాత్రమే కడుతున్నాయి. మన డబ్బునే వాడి రాజ్యాంగాన్ని ధిక్కరించేలా, దేశాన్ని ముక్కలు చేయడానికి, దేశ వ్యతిరేక శక్తులకు మద్దతు ఇవ్వడానికి ఉపయోగిస్తున్నారు’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ట్రెండింగ్ వార్తలు























