ప్రదీప్ సింగ్ రావత్ ముంబైలోని తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 74 సంవత్సరాలు.
Pradeep Rawat Passes Away: ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూత.. తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో గుర్తింపు
Pradeep Rawat Death News | టాలీవుడ్ ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ గుండెపోటుతో మరణించారు. ముంబైలోని తన నివాసంలో ఛాతీలో నొప్పి రావడంతో నటుడు తుదిశ్వాస విడిచారు.

- ప్రదీప్ రావత్ (74) ముంబైలో గుండెపోటుతో కన్నుమూశారు.
- మహాభారతం, సై చిత్రాలతో ప్రదీప్ రావత్ మంచి గుర్తింపు పొందారు.
- భిక్షు యాదవ్, ఛత్రపతి వంటి పాత్రలతో విలన్‌గా మెప్పించారు.
- క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించి, పలు అవార్డులు గెలుచుకున్నారు.
Actor Pradeep Rawat Is No More | టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు ప్రదీప్ సింగ్ రావత్ (74) ముంబయిలోని తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు. ఈ విషయాన్ని నటుడు యష్‌పాల్ శర్మ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘ప్రదీప్ రావత్, గజిని, లగాన్ చిత్రంలో దేవా ఇక లేరు. రెస్ట్ ఇన్ పీస్’ అని పోస్ట్ చేశారు.
బాలీవుడ్‌లో 1985లో వెండితెరకు పరిచమయం అయి బిజీగా ఉన్న ప్రదీప్ రావత్‌కు టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి నుంచి వచ్చిన పిలుపు ఆయన కెరీర్ మలుపుతిప్పింది. 2004లో వచ్చిన సై సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన ప్రదీప్ రావత్.. వరుసగా విలన్ వేషాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించారు. భిక్షూ యాదవ్ పాత్రతో ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఛత్రపతి, గజినీ సినిమాల్లో తన విలనిజంతో ఆకట్టుకున్నారు. ఆపై క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ రాణించారు. ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ విలన్, సంతోషం బెస్ట్ విలన్ అవార్డులు అందుకున్నారు.
View this post on Instagram
టాలీవుడ్ సినిమాలు..
సై, భద్ర, ఛత్రపతి, అందరివాడు, లక్ష్మీ, స్టాలిన్, దేశముదురు, యోగి, జగడం,మస్కా, గజిని, ఓయ్, రెబల్, నాయక్, బాద్షా, వన్ నేనొక్కడినే, అల్లుడు శీను, సరైనోడు, నేను శైలజ, నేనే రాజు నేనే మంత్రి, జై లవ కుశ, వాల్తేరు వీరయ్య సినిమాల్లో నటించిన ప్రదీప్ రావత్ మొదట్లో విలన్‌గా మెప్పించగా.. తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశారు. 2026లో ఆయన గాయపడ్డ సింహం చిత్రంలో కనిపించారు.

ప్రదీప్ రావత్ 21 జనవరి 1952లో ఢిల్లీలో జన్మించారు. ఆయనకు కళ్యాణి రావత్‌తో వివాహం జరిగింది. వారికి సంతానం ఇద్దరు పిల్లలు ఉన్నారు. టీవీ నుంచి వెండితెరకు పరిచయమై సిల్వర్ స్క్రీన్ మీద సైతం తన విలనిజం, మేనరిజంతో చప్పట్లు కొట్టించుకున్నారు. ఆయన తెలుగు, హిందీ, తమిళ సినిమాల్లో నటించారు. ఇంగ్లీష్, ఒడియా, బెంగాలీ, మరాఠీ, నేపాలి సినిమాల్లో కూడా నటించారు.
బుల్లితెర నుంచి వెండితెరకు..
స్టేజీ నాటకాలు, డ్రామాలు వేసే ఆయన కెరీర్ తొలి రోజుల్లో నటుడికి టీవీ ద్వారా పరిచయం అయ్యారు. ప్రదీప్ రావత్‌కు మొదటగా బి.ఆర్. చోప్రా తెరకెక్కించిన హిందీ 'మహాభారత్' ద్వారా గుర్తింపు లభించింది. ఇందులో ఆయన అశ్వత్థామ పాత్రలో నటించారు. తహ్కీకాత్, యుగ్, చంద్రకాంత, గుల్ సనోబర్, మిషన్ ఫతే వంటి సీరియల్స్‌లో నటించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఆపై బాలీవుడ్ ద్వారా వెండితెరకు పరిచయమై కాల్ షీట్లు అడ్జస్ట్ చేయలేని రేంజ్ చూశారు.
Before You Go
Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Frequently Asked Questions
ప్రదీప్ సింగ్ రావత్ ఎలా మరణించారు?
ప్రదీప్ రావత్ తెలుగు సినిమా రంగంలోకి ఎలా ప్రవేశించారు?
బాలీవుడ్‌లో బిజీగా ఉన్న ఆయనకు ఎస్.ఎస్. రాజమౌళి పిలుపునిచ్చారు. 2004లో వచ్చిన 'సై' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు.
ప్రదీప్ రావత్ ఏ పాత్రలతో ప్రసిద్ధి చెందారు?
ఆయన 'సై' సినిమాలో భిక్షూ యాదవ్ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయారు. 'ఛత్రపతి', 'గజిని' వంటి సినిమాల్లో విలన్‌గా మెప్పించారు.
ప్రదీప్ రావత్ సినీ కెరీర్‌కు ముందు ఎలా గుర్తింపు పొందారు?
ఆయన బి.ఆర్. చోప్రా తెరకెక్కించిన హిందీ 'మహాభారత్' సీరియల్‌లో అశ్వత్థామ పాత్ర ద్వారా మొదట గుర్తింపు పొందారు.
ట్రెండింగ్ వార్తలు























