అన్వేషించండి

NEET UG 2026 Counselling: ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!

NEET UG 2026 Counselling: దేశవ్యాప్తంగా వైద్య విద్య కలలు కంటున్న విద్యార్థులకు కీలక సమయం ఆసన్నమైంది. నీట్ యూజీ 2026 ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నీట్ యూజీ 2026 కౌన్సెలింగ్ ప్రక్రియ దేశవ్యాప్తంగా మొదలైంది.
  • ఆల్ ఇండియా, రాష్ట్ర కోటా కౌన్సెలింగ్ షెడ్యూల్స్ ప్రకటించబడ్డాయి.
  • కొత్త నిబంధనలతో పాటు వైద్య సీట్లు కూడా పెరిగాయి.

NEET UG 2026 Counselling: దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ ఫలితాల తర్వాత, విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలైంది. ఈ ఏడాది సుమారు 20 లక్షల  మంది అర్హత సాధించారు. మెడికల్ కౌన్సెలింగ్‌ కమిటీ నేటి నుంచి ఆల్‌ ఇండియా కోటా సీట్ల భర్తీకి రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది. 

ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్ షెడ్యూల్‌ ఇదే 

కేంద్ర పరిధిలోని సీట్ల భర్తీకి సంబంధించి ఎంసీసీ స్పష్టమైన క్యాలెండర్‌ను విడుదల చేసింది. విద్యార్థులు తమ ప్రాధాన్యతలను బట్టి ఈ షెడ్యూల్ ప్రకారం ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. 

ఆగస్టు ఐదు నుంచి 17 వరకు రిజిస్ట్రేషన్ నిర్వహిస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 22 లోపు సంబంధిత కాలేజీలకు వెళ్లి రిపోర్ట్ చేయాలి. రెండో విడత కౌన్సెలింగ్‌ ఆగస్టు 24 న ప్రారంభమై సెప్టెంబర్‌ 2న ముగుస్తుంది. మూడో విడత కౌన్సెలింగ్‌ సెప్టెంబర్‌ 10 నుంచి సెప్టెంబర్‌ 18 వరకు నిర్వహిస్తారు. మిగిలిపోయిన సీట్ల కోసం సెప్టెంబర్‌  28 నుంచి అక్టోబర్‌ 3 వరకు స్ట్రే వేకెన్సీ రౌండ్‌ ప్రక్రియ ఉంటుంది. ఇందులో సీటు పొందిన వారు అక్టోబర్‌ పది నాటికి అడ్మిషన్ పూర్తి చేయాలి. 

ఆంధ్రప్రదేశ్‌ సేట్‌ కోటా కౌన్సెలింగ్ వివరాలు 

విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని స్టేట్ కోటా సీట్ల కౌన్సెలింగ్‌పై వైస్‌ ఛాన్స్‌లర్‌ డాక్టర్ పి. చంద్రశేఖర్‌ కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర కోటా కౌన్సెలింగ్‌ ఈ నెల 13న ప్రారంభం కానుంది. మొదటి రౌండ్‌ ఆగస్టు 13 నుంచి 22 వరకు, రెండో రౌండ్‌ ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్‌ 8వరకు మూడో రౌండ్‌ సెప్టెంబర్‌ 16 నుంచి సెప్టెంబర్‌ 26వరకు మిగిలిన సీట్ల కోసం నిర్వహించే కౌన్సెలింగ్‌ అక్టోబర్‌ 3 నుంచి అక్టోబర్ 5 వరకు ఉంటుంది. 

నేషనల్‌ మెడికల్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబర్‌ 8 నుంచి అన్ని ప్రభుత్వ ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో మొదటి ఏడాది తరగతులు ప్రారంభకానున్నాయి. 

కొత్త రూల్స్ తెలియకపోతే ఇబ్బందే 

గతంలో ఉన్న కొన్ని క్లిష్టమైన రూల్స్‌ను ప్రభుత్వం మార్చింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో వెబ్‌ ఆప్షన్‌ల నమోదుపై ఉన్న అనుమానాలకు తెరదించారు. 2020లో విడుదలైన జీవో 151 ప్రకారం విద్యార్థులు ఒకేసారి ఆప్షన్లు నమోదు చేసుకోవాలనే రూల్ ఉండేది. దీనిపై అభ్యంతరాలు రావడంతో కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం జీవో 102 తీసుకొచ్చి దాన్ని మార్చింది. కొత్త జీవో ప్రకారం మొదటి విడతలో సీటు రాని అభ్యర్థులు 2వ, మూడో కౌన్సెలింగ్‌లో కూడా తమ ఆప్షన్లను మార్చుకునే లేదా కొత్తగా పెట్టుకునే ఛాన్స్ ఇచ్చారు. రిజర్వేషన్ అభ్యర్థి ఓపెన్ కేటగిరీలో సీటు సాధించి తర్వాత మంచి కాలేజీ తన రిజర్వేషన్ కోటాలో వస్తే అక్కడికి మారవచ్చు. అప్పుడు ఖాళీ అయిన సీటును అదే కేటగిరీ అభ్యర్థికి ఇస్తారు. 

పెరిగిన మెడికల్ సీట్లు

ఈ విద్యా సంవత్సరం వైద్య విద్యార్థులకు మరో శుభవార్త ఏంటంటే గత ఏడాది కంటే సీట్లు పెంచారు. గతంలో ఉన్న 6940 సీట్లకు అదనంగా మరో 325 సీట్లకు పెంపునకు ఎన్‌ఎంసీ అనుమతి ఇచ్చింది. 

దరఖాస్తు ప్రక్రియలో విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

విద్యార్థులు ఎంసీసీ అధికారిక వెబ్‌సైట్‌ mcc.nic.in సందర్శించి దరఖాస్తు చేయాలి. వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ లింక్ క్లిక్ చేసి ప్రాథమిక వివరాలు నమోదు చేయాలి. నిర్ణీత కౌన్సెలింగ్ ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలి. మీకు నచ్చిన కాలేజీ, కోర్సులను ప్రాధాన్య క్రమంలో ఎంచుకొని గడువు లోపు లాక్ చేయాలి. ర్యాంక్, కేటగిరీ, సీట్ల లభ్యత ఆధారంగా సీటు కేటాయిస్తారు. 

దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన పత్రాలు

కౌన్సెలింగ్‌కు హాజరైన సమయంలో విద్యార్థుల వద్ద కీలకమైన సర్టిఫికెట్స్‌ సిద్ధంగా ఉంచుకోవాలి. నీట్‌ యూజీ 2026 స్కోర్ కార్డు, అడ్మిట్‌ కార్డు, పదో తరగతి, ఇంటర్‌ మార్కుల జాబితా, గుర్తింపు కార్డు అంటే ఆధార్, పాన్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, రెసిడెన్సీ సర్టిఫికెట్‌, క్యాస్ట్‌ సర్టిఫికెట్‌, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులైతే దానికి సంబంధించిన సర్టిఫికెట్‌ దగ్గర ప పెట్టుకోవాలి. 

మెడికల్ కౌన్సెలింగ్ అనేది అత్యంత జాగ్రత్తగా నిర్వహించాల్సిన ప్రక్రియ. కేవలం అధికారిక వెబ్‌సైట్‌పైనే ఆధారపడాలని, సామాజిక మాధ్యమాల్లో వచ్చే అపోహలను నమ్మవద్దని అధికారులు సూచిస్తున్నారు. 

Frequently Asked Questions

ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?

మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) ఆగస్టు 5 నుండి 17 వరకు ఆల్ ఇండియా కోటా సీట్ల భర్తీకి రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తుంది.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోటా కౌన్సెలింగ్ ఎప్పుడు మొదలవుతుంది?

డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని స్టేట్ కోటా కౌన్సెలింగ్ ఈ నెల 13న ప్రారంభం కానుంది. మొదటి రౌండ్ ఆగస్టు 13 నుంచి 22 వరకు జరుగుతుంది.

ఆంధ్రప్రదేశ్ కౌన్సెలింగ్‌లో వెబ్ ఆప్షన్ల కొత్త నిబంధనలు ఏమిటి?

కొత్త జీవో 102 ప్రకారం, మొదటి విడతలో సీటు రాని అభ్యర్థులు 2వ, 3వ కౌన్సెలింగ్‌లో తమ ఆప్షన్లను మార్చుకోవచ్చు లేదా కొత్తగా పెట్టుకోవచ్చు.

ఈ విద్యా సంవత్సరంలో వైద్య సీట్ల సంఖ్య పెరిగిందా?

అవును, ఈ విద్యా సంవత్సరం వైద్య విద్యార్థులకు గత ఏడాది కంటే 325 అదనపు సీట్లకు NMC అనుమతి ఇచ్చింది. మొత్తం 6940 సీట్లకు ఇవి అదనంగా ఉంటాయి.

కౌన్సెలింగ్‌కు అవసరమైన ముఖ్యమైన పత్రాలు ఏమిటి?

నీట్‌ యూజీ స్కోర్ కార్డు, అడ్మిట్‌ కార్డు, పదో తరగతి, ఇంటర్‌ మార్కుల జాబితా, గుర్తింపు కార్డు, రెసిడెన్సీ, క్యాస్ట్‌ సర్టిఫికెట్స్ అవసరం.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

NEET UG 2026 Counselling: ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
Career Options After MBBS in Telugu: ఎంబిబిఎస్ తర్వాత  ఏ కోర్స్‌ చేయాలి? ఎంత ఖర్చు అవుతుంది?
ఎంబిబిఎస్ తర్వాత  ఏ కోర్స్‌ చేయాలి? ఎంత ఖర్చు అవుతుంది?
MBBS Fees in India: MBBS చదువుకు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు చదవాలి? 
MBBS చదువుకు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు చదవాలి? 
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Advertisement

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
NEET UG 2026 Counselling: ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
The Story of Vizag Old Airport : విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ -
విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ - "INS డేగ" ఇక జ్ఞాపకమేనా !!
Supreme Court On Vehicle Insurance:బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
Embed widget