అన్వేషించండి

The Story of Vizag Old Airport : విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ - "INS డేగ" ఇక జ్ఞాపకమేనా !!

విశాఖ ఎయిర్పోర్ట్, ఐఎన్‌ఎస్ డేగా రెండో ప్రపంచ యుద్ధం నుంచి నేటి వరకు ఐఎన్‌ఎస్ డేగా చరిత్ర, విశాఖ అభివృద్ధిలో దాని పాత్ర, ఇకపై దాని భవిష్యత్తు ఎలా ఉండబోతోందో ఈ ప్రత్యేక కథనం వివరిస్తుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • విశాఖ ఐఎన్ఎస్ డేగా ఆరు దశాబ్దాల పౌర సేవలు ముగిశాయి.
  • భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 17న వాణిజ్య సేవలు ప్రారంభిస్తుంది.
  • ఐఎన్ఎస్ డేగా ఇక పూర్తిగా నౌకాదళ వైమానిక స్థావరంగా కొనసాగనుంది.
  • నౌకాదళానికి గగనతలంపై పూర్తి నియంత్రణ, కార్యకలాపాలు విస్తరిస్తాయి.

విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ - "INS డేగ" ఇక జ్ఞాపకమేనా !!
 
ఆరు దశాబ్దాలకు పైగా విశాఖపట్నానికి విమానంలో వచ్చిన ప్రతి ప్రయాణికుడూ సాధారణ విమానాశ్రయంలో దిగలేదు... భారత నౌకాదళ వైమానిక స్థావరంలోనే అడుగుపెట్టాడు. 

మీ విమానం ల్యాండ్ అయిన అదే రన్‌వేపై ప్రతి ఉదయం హాక్ జెట్ శిక్షణ విమానాలు గర్జిస్తూ ఆకాశంలోకి దూసుకెళ్లేవి. టెర్మినల్ పక్కనే జలాంతర్గాములను వేటాడే హెలికాప్టర్లు నిలిపిన హ్యాంగర్లు కనిపించేవి. పౌర విమానాలు, యుద్ధ విమానాలు... రెండూ ఒకే రన్‌వేను పంచుకోవడం విశాఖకు మాత్రమే ప్రత్యేకమైన దృశ్యం. "విశాఖ అంటే అంతే" అన్నట్టే వైజాగ్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ సాగాయి.

ఇప్పుడు ఆ దృశ్యం చరిత్రలోకి వెళ్లిపోతోంది.

ఆగస్టు 1, 2026న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భోగాపురంలోని "అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని" ప్రారంభించారు. ఆగస్టు 17నుంచి అన్ని కమర్షియల్ విమాన సర్వీసులు అక్కడికి మారనున్నాయి. దీంతో ఆరు దశాబ్దాలుగా ప్రయాణికులను ఆహ్వానించిన ఐఎన్‌ఎస్ డేగా ఇకపై పూర్తిగా నావికాదళ విమాన స్థావరంగానే కొనసాగనుంది.

ఈ సందర్భంగా ఒక ప్రశ్న సహజంగానే వస్తుంది. ఐఎన్‌ఎస్ డేగా కథ ఎక్కడ మొదలైంది? ఇప్పుడు దాని భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?

యుద్ధ అవసరాల కోసం నిర్మించిన రన్‌వే... తర్వాత నౌకాదళ గూటిగా మారింది

INS డేగా చరిత్ర భారత నౌకాదళంతో కాదు... రెండో ప్రపంచ యుద్ధంతో ప్రారంభమవుతుంది. ఆ సమయంలో భారత తూర్పు తీరంలో సైనిక కార్యకలాపాలకు మద్దతుగా రాయల్ ఎయిర్ ఫోర్స్ నావల్ ఆర్మమెంట్ డిపో సమీపంలో ఒక ఎయిర్‌స్ట్రిప్ నిర్మించింది. యుద్ధం ముగిసిన తర్వాత ఆ రన్‌వే దాదాపు నిరుపయోగంగా మారిపోయింది. 1962లో పౌర విమానాల కోసం మళ్లీ తెరిచినా ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండటంతో సేవలు పలుమార్లు నిలిచిపోయాయి.

  1970లలో అసలు మలుపు.

భారత నౌకాదళం తన వైమానిక విభాగాన్ని విస్తరించే క్రమంలో 1972 డిసెంబరులో విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించింది. తొలుత INS సర్కార్స్ నుంచి హెలికాప్టర్ యూనిట్‌ను నడిపింది. నాలుగేళ్లలో పౌర విమానాశ్రయం పక్కనే హెలిప్యాడ్లు, హ్యాంగర్లు ఏర్పడ్డాయి. 1986లో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా విశాఖ విమానాశ్రయాన్ని అధికారికంగా భారత నౌకాదళానికి అప్పగించింది.

భారత పౌర విమానయాన చరిత్రలో ఇది అత్యంత అరుదైన నమూనా. సాధారణంగా సైనిక స్థావరాల్లో పౌర విమానాల కోసం చిన్న ఎన్‌క్లేవ్ ఉంటుంది. విశాఖలో మాత్రం పూర్తిస్థాయి పౌర విమానాశ్రయం నావికాదళ స్థావరం లోపలే నడిచింది. 1991 అక్టోబర్ 21న వైస్ అడ్మిరల్ లక్ష్మీనారాయణ రామ్‌దాస్ దీనిని అధికారికంగా "ఐఎన్‌ఎస్ డేగా" గా ప్రారంభించారు.

"డేగా" అంటే మనకు తెలిసిన గద్ద జాతి పక్షే. శక్తి, వేగానికి ప్రతీకగా నిలిచే ఆ పేరు... తర్వాతి కాలంలో హాక్ జెట్లు, కామోవ్ హెలికాప్టర్లు, నిఘా విమానాలకు కేంద్రంగా ఎదిగి ఈ స్థావరానికి సరిగ్గా సరిపోయింది.

తూర్పు తీరంలో అత్యంత రద్దీ విమాన స్థావరంగా ఎదిగిన డేగా

2000ల దశకం ఐఎన్‌ఎస్ డేగా రూపురేఖలనే మార్చేసింది. 2007లో 10 వేల అడుగుల కొత్త రన్‌వే అందుబాటులోకి వచ్చింది. వెంటనే రాత్రి వేళల్లో కూడా విమాన కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. గోవా నుంచి కామోవ్ హెలికాప్టర్లతో కూడిన ఐఎన్‌ఏఎస్-333 "ఈగిల్స్", తర్వాత హాక్ జెట్ శిక్షణ విమానాలతో INAS-551 "ది ఫాంటమ్స్" ఇక్కడికి వచ్చాయి. 2009 నాటికి ఐదు నౌకాదళ స్క్వాడ్రన్లు, యుద్ధ నౌకల విమాన యూనిట్లు, నెలకు 550కుపైగా కమర్షియల్ విమానాలు... అన్నీ ఒకే రన్‌వేను పంచుకునే స్థాయికి ఐఎన్‌ఎస్ డేగా చేరుకుంది.

విశాఖ ప్రజలకు ఇది రోజువారీ జీవితంలో భాగమైపోయింది. పైన హాక్ జెట్ గర్జిస్తే అది సాధారణ దృశ్యమే. కానీ INS డేగా కేవలం విమానాశ్రయం మాత్రమే కాదు. ప్రతి ఏడాది బంగాళాఖాతంలో విరుచుకుపడే తుపాన్లు, వరదల సమయంలో సహాయక చర్యల్లో ముందుండేది. తూర్పు నౌకాదళ కమాండ్ అడ్వెంచర్, స్కైడైవింగ్ కార్యక్రమాలకు కూడా ఇదే కేంద్రంగా నిలిచింది.

ప్రత్యేకతే... పరిమితిగా మారింది

ఈ ద్వంద్వ వినియోగ వ్యవస్థ విశాఖకు ప్రత్యేక గుర్తింపునిచ్చింది. అయితే అదే కాలక్రమంలో దాని బలహీనతగా కూడా మారింది. మూడు వైపులా కొండలు ఉండటంతో విమానాలు ఒకే దిశలో టేకాఫ్, ల్యాండింగ్ చేయాల్సి వచ్చేది. గంటకు దాదాపు పది విమానాలకే పరిమితి. అదీ కాక పౌర విమానాల షెడ్యూల్ మొత్తం నౌకాదళ శిక్షణ సమయాలకు అనుగుణంగానే ఉండేది. ఇంతలో విశాఖ నగరం విస్తరించింది. ఉక్కు పరిశ్రమలు, ఫార్మా కంపెనీలు, పోర్టు ఆధారిత పెట్టుబడులతో దేశంలో వేగంగా ఎదుగుతున్న నగరంగా మారింది. 1990ల అవసరాలకు సరిపోయే విమానాశ్రయం... 2020ల విశాఖ అవసరాలకు సరిపోలేని పరిస్థితి ఏర్పడింది.

అక్కడే భోగాపురం అవసరమైంది

ఎన్నో సంవత్సరాలుగా ప్రతిపాదనలకే పరిమితమైన భోగాపురం విమానాశ్రయం చివరకు సాకారమైంది. సుమారు ₹4,700 నుంచి ₹5,600 కోట్ల వ్యయంతో పీపీపీ విధానంలో జీఎంఆర్ నిర్మించిన "అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం", విశాఖకు ఈశాన్యంగా విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలో సిద్ధమైంది. 3,800 మీటర్ల రన్‌వేతో భారీ వైడ్‌బాడీ విమానాలు దిగే సామర్థ్యం దీనికి ఉంది. మొదటి దశలో ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించేలా, భవిష్యత్తులో నాలుగు కోట్ల వరకు విస్తరించేలా దీన్ని రూపకల్పన చేశారు. డీజీసీఏ లైసెన్స్, బీసీఏఎస్ భద్రతా అనుమతులు, అంతర్జాతీయ ఇమ్మిగ్రేషన్ హోదా... అన్నీ పూర్తయ్యాయి. ఆగస్టు 17 నుంచి దేశీయ, అంతర్జాతీయ కమర్షియల్ విమానాలన్నీ భోగాపురం నుంచే నడవనున్నాయి. విశాఖకు చిరునామాగా ఉన్న"VTZ" ఐఏటీఏ కోడ్ కూడా అక్కడికే మారుతుంది.

ఐఎన్‌ఎస్ డేగా ఇక ఏం చేస్తుంది?

ఈ మార్పుతో మూతపడేది పౌర ప్రయాణికుల టెర్మినల్ మాత్రమే. నావికాదళ స్థావరం మాత్రం యథావిధిగా కొనసాగుతుంది. సైనిక విమానాలు, నౌకాదళ కార్యకలాపాలు, విపత్తు సహాయక చర్యలు, ప్రభుత్వ ప్రత్యేక విమానాలు, వీఐపీ రాకపోకలు... అన్నింటికీ ఐఎన్‌ఎస్ డేగా సేవలందిస్తూనే ఉంటుంది. అంతేకాదు, కమర్షియల్ విమానాల ఒత్తిడి తొలగిపోవడంతో విశాఖ గగనతలంపై భారత నౌకాదళానికి పూర్తి నియంత్రణ లభిస్తుంది. ఇప్పటి వరకు పౌర విమానాల షెడ్యూల్‌ను దృష్టిలో పెట్టుకుని చేయాల్సి వచ్చిన అడ్జస్ట్మెంట్లు ఇక అవసరం ఉండవు.  శిక్షణ విమానాలు పెంచడం, నౌకాదళ కార్యకలాపాలను విస్తరించడం, అత్యవసర పరిస్థితుల్లో మరింత వేగంగా స్పందించడం... ఇవన్నీ మరింత సులభమవుతాయి.

ఓ ముగింపు మరో కొత్త అధ్యాయానికి ఆరంభం.

ఐఎన్‌ఎస్ డేగా ఎప్పుడూ శాశ్వత పౌర విమానాశ్రయంగా లేదు. భౌగోళిక పరిస్థితులు, కాలానుగుణ అవసరాలు కలిసి తాత్కాలిక ఏర్పాటుగా మొదలైన వ్యవస్థ... మూడు దశాబ్దాలకు పైగా విశాఖ నగరానికి సేవలందించింది. దాని వల్ల విశాఖ దేశవ్యాప్తంగా మెరుగైన వైమానిక అనుసంధానం పొందింది. అదే సమయంలో పరిమిత సామర్థ్యం, యుద్ధ విమానాలతో రన్‌వే పంచుకోవాల్సిన పరిస్థితిని కూడా భరించింది. ఇప్పుడు ఆ రెండు పాత్రలు విడిపోతున్నాయి. విశాఖకు ప్రపంచస్థాయి అంతర్జాతీయ విమానాశ్రయం లభిస్తోంది. ఐఎన్‌ఎస్ డేగా మాత్రం తన అసలు స్వరూపానికి తిరిగి వెళ్తోంది... తూర్పు నౌకాదళానికి పూర్తిస్థాయి వైమానిక కేంద్రంగా. ఇకపై ఆ పాత రన్‌వేపై హాక్ జెట్ గర్జిస్తూ ఆకాశంలోకి ఎగిరినప్పుడు... దాని వెనుక టేకాఫ్ కోసం బోయింగ్-737 విమానాల వరుస కనిపించదు అంతే.

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

The Story of Vizag Old Airport : విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ -
విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ - "INS డేగ" ఇక జ్ఞాపకమేనా !!
YS Jagan Political Strategy: బాధితుల కంటే నిందితులకు అభయం - వైఎస్ జగన్ లాయల్టీ కార్డ్ రాజకీయాల వెనుక అసలు లెక్కలు ఇవే!
బాధితుల కంటే నిందితులకు అభయం - వైఎస్ జగన్ లాయల్టీ కార్డ్ రాజకీయాల వెనుక అసలు లెక్కలు ఇవే!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
AP Governance Progress Report: విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు ఏపీ - రెండేళ్ల పాలనపై ఆర్థిక ప్రగతి నివేదిక విడుదల చేసిన సీఎం చంద్రబాబు!
విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు ఏపీ - రెండేళ్ల పాలనపై ఆర్థిక ప్రగతి నివేదిక విడుదల చేసిన సీఎం చంద్రబాబు!
Advertisement

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Embed widget