Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
ISI Backed Terror Module Planned Attack At Jantar:నీట్ పేపర్ లీకేజీపై విద్యార్థులు చేపట్టిన ధర్నాలో ఐఎస్ఐ ముఠాలు రెక్కీ నిర్వహించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే 9 మందిని గుర్తించి అరెస్టు చేశారు.

ISI Backed Terror Module Planned Attack At Jantar: ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగిన ధర్నాలను ఆసరాగా చేసుకొని భారత్‌లో దాడులు చేయాలని పాకిస్తాన్ కుట్ర పన్నినట్టు భద్రతాదళాలు అనుమానిస్తున్నాయి. దీనికి సంబంధించి కీలక ముందడుగు పడింది. ఐఎస్‌ఐ మాడ్యుల్స్‌కు చెందిన సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నలుగురు మైనర్‌లు. వీరి వద్ద భారీ సంఖ్యలో కుట్రకు సంబంధించిన ఆధారాలు లభించినట్టు వివరించారు.
అమృత్‌సర్ కమిషనరేట్ పోలీసులు ఐఎస్ఐ మద్దతు గల రెండు ఉగ్రవాద ముఠాలను పోలీసులు పట్టుకున్నారు. ఇందులో నలుగురు మైనర్లు సహా మొత్తం తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేశారు. జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆందోళనలను ఆసరాగా చేసుకొని పెట్రోల్ బాంబులతో దాడులు చేసేందుకు ఈ ముఠా యత్నించింది. ముఠాలోని సభ్యుల్లో ఎక్కువ మంది మైనర్లే.
Amritsar, Punjab: On busting ISI-backed terror modules, Police Commissioner Gurpreet Singh Bhullar says, "The Amritsar Commissionerate Police, acting under the Punjab Chief Minister's zero-tolerance policy towards terrorism, has busted and completely dismantled two ISI-backed… pic.twitter.com/byhfAc9LK4
— IANS (@ians_india) August 5, 2026
ఇప్పుడు పోలీసుకు చిక్కిన బృందంలోని ఎనిమిది మంది సభ్యులు జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదేశాన్ని సందర్శించారు. అక్కడ వారు పెట్రోల్ బాంబుల తయారీకి కావలసిన సామాగ్రితో సహా స్థానిక లాజిస్టికల్ మద్దతును పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మద్దతును పాకిస్థాన్‌లో ఉన్న ఐఎస్ఐ హ్యాండ్లర్లు అందించారని పోలీసులు భావిస్తున్నారు. ఇందులో ఇంకా లోతుగా దర్యాప్తు సాగుతోంది. త్వరలోనే మరికొందరు కీలకమైన వ్యక్తులను అరెస్టు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.
పాకిస్తాన్ కుట్ర పన్నింది
పాకిస్థాన్‌లో ఉన్న ఐఎస్ఐ హ్యాండ్లర్లు ఇక్కడి వాళ్లకు మద్దతు అందించారని పోలీసులు అనుమానిస్తున్నారు. అమృత్‌సర్ పోలీస్ కమిషనర్ గుర్ప్రీత్ సింగ్ భుల్లర్ మాట్లాడుతూ, "ఐఎస్ఐ మద్దతు ఉన్న రెండు ఉగ్రవాద ముఠాల కుట్రను ఛేదించి, వాటి మొత్తం నెట్‌వర్క్‌ను నిర్మూలించాం. నలుగురు మైనర్లు, ఐదుగురు యువకులతో మొత్తం తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేశాం. ఒక ముఠా రైల్వే ట్రాక్‌ల పైన కెమెరాలను అమర్చుతోంది. ఆ కెమెరా ఫీడ్‌ను సరిహద్దు దాటించి పంపాల్సి ఉంది. పోలీసులు సకాలంలో సమాచారం అందుకుని, కెమెరాలతోపాటు నిందితులను అరెస్టు చేశారు. కెమెరాలు, ఇతర ఖర్చులను హవాలా ద్వారా సమకూర్చారు."
పెట్రోల్ బాంబులు విసరడానికి శిక్షణ పొందాడు
రెండో బృందానికి పెట్రోల్ బాంబులు తయారు చేసి విసరడంలో ఐఎస్ఐ హ్యాండ్లర్లు శిక్షణ ఇచ్చారు. శిక్షణ సమయంలో, పోలీసు, ఇతర భద్రతా సంస్థలపై దాడుల కోసం రెక్కీ నిర్వహించమని కూడా వారికి సూచించారు. ఈ ఎనిమిది మంది వ్యక్తులు జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనలో కూడా పాల్గొన్నారు. వారికి స్థానికుల నుంచి మద్దతు లభించింది. వారికి పెట్రోల్ బాంబులు, ఇతర సామగ్రిని కూడా అందించారు, కానీ కొన్ని కారణాల వల్ల, వారు తమ ప్రణాళికలను అమలు చేయలేకపోయారు. ఇది ఒక పెద్ద విజయం.
ట్రెండింగ్ వార్తలు






















