Prashant Kishor Wins: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
Jan Suraaj Defeats BJP: బీహార్ ఉపఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ గెలవడం సంచలనంగా మారింది. ఇక బీజేపీకి ఆయనే ప్రత్యామ్నాయంగా మారుతారా?

Bihar Politics: బీహార్ రాజకీయ చరిత్రలోనే అత్యంత అరుదైన, సంచలనాత్మక ఘట్టం నమోదైంది. రాజధాని పాట్నాలోని అత్యంత సంప్రదాయక నగర ప్రాంతమైన బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ నుంచి క్రియాశీల నాయకుడిగా మారిన ప్రశాంత్ కిషోర్ సాధించిన గెలుపు జాతీయ రాజకీయ వర్గాలను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. గడిచిన మూడు దశాబ్దాలుగా బీజేపీకి పటిష్టమైన కోటగా, ఓటమి ఎరుగని సీటుగా ఉన్న బంకీపూర్‌లో బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్‌పై 19,324 ఓట్ల భారీ మెజారిటీతో పీకే విజయం సాధించి, తన పొలిటికల్ కెరీర్‌లోనే తొలి శాసనసభ ఘనతను సొంతం చేసుకున్నారు.
బీజేపీ పాలనపై రెఫరెండంగా ప్రచారం చేసిన పీకే
ఈ ఉపఎన్నికను ప్రస్తుత బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంపై నిర్వహించిన రిఫరెండం గా ప్రశాంత్ కిషోర్ అభివర్ణించి ప్రచారం నిర్వహించడం రాజకీయంగా మాస్టర్ స్ట్రోక్‌గా మారింది. బిజెపి మంత్రుల పాలనా వైఫల్యాలు, నిరుద్యోగం, నగర మౌలిక వసతుల లేమి, ఇంకా విద్యారంగంలో పేరుకుపోయిన సమస్యలను పీకే నేరుగా వేలెత్తి చూపారు. దశాబ్దాలుగా గెలుస్తున్నా నియోజకవర్గంలో గణనీయమైన మార్పు తీసుకురావడంలో అధికార పార్టీ విఫలమైందనే భావనను పట్టణ ఓటర్లు, ముఖ్యంగా విద్యావంతులు, యువత మనస్సుల్లోకి బలంగా తీసుకెళ్లడంలో ఆయన విజయం సాధించారు.
జెన్ జీని ఆకట్టుకున్న ప్రశాంత్ కిషోర్
ఈ ఎన్నికల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ప్రశాంత్ కిషోర్ ఎంచుకున్న ప్రచార శైలి, జెన్ జీ ,ఫస్ట్ టైమ్ ఓటర్లు పై చూపించిన దృష్టి. సంప్రదాయ కుల రాజకీయాలు, పాతకాలపు హామీలకు భిన్నంగా డిజిటల్ క్యాంపెయినింగ్, ఫ్యాక్ట్-బేస్డ్ డేటా, జాబ్ క్రియేషన్ రోడ్‌మ్యాప్ మరియు విద్యా సంస్కరణలపై ఆయన చేసిన ప్రసంగాలు నవతరం ఆలోచనలకు అనుగుణంగా నిలిచాయి. కిషోర్ ప్రారంభించిన సుదీర్ఘ పాదయాత్ర, లోకల్ బూత్ లెవల్ నెట్‌వర్క్, డోర్-టు-డోర్ ప్రచారం బీజేపీ సంప్రదాయ స్టార్ క్యాంపెయినర్ల హంగామా కంటే ప్రభావవంతంగా పనిచేసింది.
పూర్తిగా పట్టు కోల్పోతున్న ఆర్జేడీ
మరోవైపు బీహార్‌లోని ప్రధాన ప్రతిపక్షమైన రాష్ట్రీయ జనతా దళ్ ప్రాభవం ఈ నియోజకవర్గంలో పూర్తిగా శూన్యమైపోవడం ప్రశాంత్ కిషోర్‌కు అతిపెద్ద అడ్వాంటేజ్‌గా మారింది. ఆర్జేడీ అభ్యర్థి రేఖా కుమారి కేవలం 14,273 ఓట్లకు పరిమితమై, ఘోరంగా మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోవడంతో, ఆప్షన్ లేక ఇన్నాళ్లూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఓటర్లు థర్డ్ ఫోర్స్ గా నిలిచిన జన్ సూరాజ్‌కే ఒకే మాటగా ఓటేశారు. ఈ తీర్పుతో బీహార్ రాజకీయాల్లో ఒక స్పష్టమైన సందేశం వెళ్లింది. బీజేపీని ఎదుర్కొనే ఏకైక ప్రత్యామ్నాయ శక్తి పాత తరం ఆర్జేడీ కాదని, అభివృద్ధి, ఉపాధి, విద్యారంగ సంస్కరణల ఎజెండాతో వచ్చే నవతరం జన్ సూరాజ్ అని ఓటర్లు విశ్వసించారు.
ఇక బీజేపీ వర్సెస్ పీకే అన్నట్లుగా రాజకీయం నడుస్తుందా?
పాత నినాదాలు, కుల సమీకరణలపై ఆధారపడే ఆర్జేడీ మార్కెట్ క్రమంగా పడిపోతోందని, మార్పు కోరుకునే ప్రగతిశీల ఓటర్లకు పీకే ఒక నమ్మకమైన ఆశాకిరణంగా మారారనేది ఈ ఫలితం రుజువు చేసింది. పాట్నాలోని సేఫ్ సెంటర్‌ను కోల్పోవడం బీజేపీ అధిష్టానానికి, సీఎం సామ్రాట్ చౌదరి ప్రభుత్వానికి తీవ్ర షాకింగ్ పరిణామం. రాజ్యసభకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే నితిన్ నబీన్ స్థానంలో కొత్త అభ్యర్థిని తెచ్చినా ఓటర్లు ఆదరించలేదు. ప్రశాంత్ కిషోర్ సాధించిన ఈ బోణీ గెలుపు.. బీహార్ రాజకీయాలను బీజేపీ వర్సెస్ పీకే అన్నట్లుగా మారుస్తుందని భావిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















