ప్రశాంత్ కిశోర్ బంకీపూర్ నియోజకవర్గంలో విజయం సాధించారు. ఇది BJP కంచుకోటను బద్దలుకొట్టింది. ఆయన 19,324 ఓట్ల తేడాతో గెలిచారు.
Reasons For Prashant Kishor Win: బంకీపూర్ ఉప ఎన్నికల్లో BJP ఓటమి.. ప్రశాంత్ కిశోర్ విజయానికి 5 అతిపెద్ద కారణాలు
Bankipur By-Election Result 2026 : బిహార్‌లో బీజేపీ కంచుకోట అయిన బంకీపూర్ ఉపఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ విజయం సాధించారు. ప్రతి రౌండ్‌లో పీకే స్పష్టమైన మెజారిటీ తెచ్చుకున్నారు.

- ప్రశాంత్ కిశోర్ బంకీపూర్‌లో బీజేపీ కంచుకోటను బద్దలుకొట్టి గెలిచారు.
- 19,324 ఓట్ల తేడాతో గెలిచి, దేశవ్యాప్తంగా ప్రత్యేక సందేశమిచ్చారు.
- యువ ఓటర్లు, ముఖ్యమంత్రిపై అసంతృప్తి పీకే విజయానికి దోహదపడ్డాయి.
- ముస్లిం, యాదవ్ యువతతో సహా అన్ని వర్గాల మద్దతు లభించింది.
పాట్నా: జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. వ్యూహకర్తగా ఎందరినో ముఖ్యమంత్రులుగా చేసిన పీకే బంకీపూర్‌లో కేవలం విజయం నమోదు చేయడమే కాదు, BJP కంచుకోటను బద్ధలుకొట్టారు. ఇది దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేక సందేశం ఇచ్చింది. బంకీపూర్‌లో 32 రౌండ్లలో లెక్కింపు జరిగింది. మొదటి నుంచే ముందంజలో ఉన్న ప్రశాంత్ కిశోర్ 32 రౌండ్ల తర్వాత 19,324 ఓట్ల తేడాతో BJP అభ్యర్థి నీరజ్ సిన్హాను ఓడించారు. RJDకి చెందిన రేఖా గుప్తా మూడో స్థానంలో నిలిచారు. BJP కంచుకోట, పార్టీ జాతీయ అధ్యక్షుడు నితీన్ నవీన్ పాత నియోజకవర్గంలో ప్రశాంత్ కిశోర్ కొత్త జెండా ఎగరేశారు.
- ప్రశాంత్ కిశోర్ (జన్ సూరజ్ పార్టీ)- 64,151.. 19 వేల పైచిలుకు ఓట్లతో విజయం
- నీరజ్ సిన్హా (భారతీయ జనతా పార్టీ)- 44,827
- రేఖా గుప్తా (రాష్ట్రీయ జనతా దళ్)- 14,273
ప్రశాంత్ కిశోర్ విజయానికి కారణాలు ఇవే
1) BJP జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ 5 సార్లు విజయం సాధించిన సీటు బంకీపూర్. రాజ్యసభకు వెళ్లేందుకు ఆయన రాజీనామా చేసినప్పటి నుంచే ప్రశాంత్ కిశోర్ ఈ ప్రాంతంలో జనాలను కలవడంలో నిమగ్నమయ్యారు. ప్రజల మధ్య ఉండటం, ఓటర్లను పదే పదే కలవడం, ప్రజలకు వారి హక్కుల పట్ల అవగాహన కల్పించడం లాంటివి చేశారు. ముఖ్యంగా యువతను ప్రస్తుత అంశాలపై అవగాహన కల్పించడంపై ఎక్కువ ఫోకస్ చేశారు పీకే. ఇది ఈ విజయానికి పెద్ద కారణంగా నిలిచింది.
2) ప్రశాంత్ కిశోర్ యువ ఓటర్లను తన వైపునకు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా నీట్ అంశంపై జరిగిన ఉద్యమం కూడా ప్రశాంత్ కిశోర్‌కు లాభం చేకూర్చింది. BJP ఓటర్లలో 40 ఏళ్లకు పైబడిన వారు కాషాయం మద్దతు ఇచ్చారు, కానీ యువత ప్రశాంత్ కిశోర్ కు జై కొట్టారు. ఇళ్లలో ఒకే కుటుంబంలో యువత ప్రశాంత్ కిశోర్ నెగ్గాలని కోరుకోగా, పెద్దలు, ఇతర వర్గాల వారు BJPకి ఓట్లు వేశారు.
3) బిహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరీ కూడా ఒక పెద్ద కారణం. నితీశ్ కుమార్ తర్వాత BJP సమ్రాట్‌ను సీఎం చేసింది కానీ చాలా మంది ఈ విషయంలో సంతోషంగా లేరు. యువత సమ్రాట్ చౌధరీపై అసంతృప్తిగా ఉంది. కుల సమీకరణాల ప్రకారం భూమిహార్, కుర్మీ లేదా ఇతర కులాల వారు సమ్రాట్ చౌధరీ ముఖ్యమంత్రి కావడానికి ముందే అసంతృప్తిగా ఉన్నారు. తాజా ఉపఎన్నికలో ప్రభావం చూపిన కారణాల్లో ఇది ఒకటి. నితీశ్ కుమార్ తప్పుకోవడంతో కుర్మీ ఓటర్లలో అసంతృప్తి కనిపించింది. దాదాపు 50 శాతం కుర్మీ ఓట్లు ప్రశాంత్ కిశోర్‌కు పడ్డట్లు సమాచారం.
4) 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈ ఉపఎన్నికలో దాదాపు 7 శాతం తక్కువ ఓటింగ్ నమోదైంది. అయితే యువత ఓటింగ్ శాతం ఎక్కువగా ఉండగా, మధ్య వయసు, వృద్ధుల ఓటింగ్ శాతం తక్కువగా ఉంది. దీని వల్ల కూడా ప్రశాంత్ కిశోర్‌కు లాభం కలిగింది.
5) ప్రశాంత్ కిశోర్‌కు అన్ని వర్గాల ప్రజలు ఓట్లు వేశారు. ఆయన NDA ఓటర్లను ప్రభావితం చేశారు. మరోవైపు RJD కోర్ ముస్లిం ఓటర్లలో చీలిక కనిపించింది. ముస్లిం వర్గం నుంచి 65 నుంచి 70% ఓట్లు పీకే జన్ సూరజ్ ఖాతాలోకి వెళ్లినట్లు చర్చ జరుగుతోంది. ప్రశాంత్ కిశోర్‌కు యాదవుల మద్దతు లభించింది. యాదవుల్లో దాదాపు 30 శాతం యువత ప్రశాంత్ కిశోర్‌కు మద్దతు ఇచ్చారు.
Frequently Asked Questions
ప్రశాంత్ కిశోర్ ఏ నియోజకవర్గంలో విజయం సాధించారు?
ప్రశాంత్ కిశోర్ గెలుపుకు ముఖ్య కారణాలు ఏమిటి?
ఆయన ప్రజలతో నిరంతరం మమేకమయ్యారు, యువతను ప్రస్తుత అంశాలపై అవగాహన కల్పించారు. యువ ఓటర్లను ఆకట్టుకోవడం, నీట్ వంటి అంశాలు ఆయనకు లాభం చేకూర్చాయి.
ప్రశాంత్ కిశోర్ గెలుపులో బిహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరీ పాత్ర ఏమిటి?
ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరీపై ప్రజలలో, ముఖ్యంగా యువతలో, అసంతృప్తి ఉంది. నితీష్ కుమార్ తప్పుకోవడంతో కుర్మీ ఓటర్లలో అసంతృప్తి ప్రశాంత్ కిశోర్ కు లాభించింది.
ప్రశాంత్ కిశోర్ BJP కంచుకోటను ఎలా బద్దలుకొట్టారు?
నితిన్ నవీన్ రాజీనామా తర్వాత ప్రశాంత్ కిశోర్ ఆ ప్రాంత ప్రజలతో మమేకమయ్యారు. యువతను సమీకరించడం, విభిన్న వర్గాల మద్దతుతో ఆయన BJP కంచుకోటలో విజయం సాధించారు.
ట్రెండింగ్ వార్తలు























