అన్వేషించండి

Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?

Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాంకాళీ బోనాల జాతరలో అత్యంత కీలకమైన రంగం కార్యక్రమం భక్తుల కోలాహలం మధ్య ముగిసింది. ఈ సందర్భంగా మాతంగి స్వర్ణలతో వినిపించిన భవిష్యవాణి భక్తులను కలవరానికి గురి చేసింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఉజ్జయిని బోనాల్లో అమ్మవారు ఆగ్రహంగా ఉన్నారని మాతంగి తెలిపారు.
  • భారీ వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలతో ప్రాణనష్టం తప్పదని హెచ్చరించారు.
  • ఆరు నెలల్లో విగ్రహ ప్రతిష్ఠ చేయకుంటే ప్రాణనష్టం తప్పదని హెచ్చరిక.

Rangam 2026: తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ బోనాల ఉత్సవాలు నేత్రపర్వంగా ముగిశాయి. ఉత్సవాల్లో సోమవారం ఉదయం నిర్వహించిన రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. సరిగ్గా ఉదయం 9.55 గంటలకు పచ్చికుండపై నిలబడిన అమ్మవారు పూనిన మాతంగి స్వర్ణలతో భక్తులకు, రాష్ట్ర ప్రజలకు రాబోయే కాలం గురించి హెచ్చరికలు జారీ చేశారు. 

ఈ ఏడాది అమ్మావారు సంతోషంగా లేరని తాను క్రోధంతో వచ్చానని స్వర్ణలత స్పష్టం చేశారు. ఎందుకు నన్ను ప్రశ్నిస్తున్నారు? నేను ఎందుకు ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాలి? అంటూ ఆమె ప్రధానార్చకులను నిలదీశారు. భక్తులు తన మాటను ఆచరించడం లేదని కేవలం ప్రశ్నలు అడగడానికే పరిమితం అవుతున్నారని అమ్మవారి తరఫున ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. 

ప్రకృతి వైపరీత్యాలు, ప్రాణనష్టంపై హెచ్చరిక 

రాబోయే కాలంలో ప్రకృతి విపత్తులు తీవ్రంగా ఉంటాయని భవిష్యవాణిలో వెల్లడైంది. ముఖ్యంగా ఈ సంవత్సరం కుంభవర్షాలు కురుస్తాయని, వరదల ధాటికి ప్రజలు కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడుతుందని స్వర్ణలత హెచ్చరించారు. వర్షాలతోపాటు అగ్ని ప్రమాదాలు కూడా సంభవిస్తాయని, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిర్లక్ష్యం చేస్తే భారీ ప్రాణ నష్టం తప్పదని ఆమె నొక్కి చెప్పారు. 

విగ్రహ ప్రతిష్ఠకు ఆరు నెలల గడువు 

ఈ ఏడాది భవిష్యవాణిలో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశం అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ. గతంలో ఇచ్చిన మాట ప్రకారం విగ్రహ ప్రతిష్ఠ చేయకపోవడంపై అమ్మవారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహ ప్రతిష్ఠ చేస్తామని చెప్పి ఇప్పిటికీ చేయలేదు, నా పట్ల అహంకారం ఎక్కువైంది. అని మాతాంగి స్వర్ణలత వ్యాఖ్యానించారు. 

వచ్చే ఆరు నెలల్లోగా విగ్రహ ప్రతిష్ఠ పూర్తి చేయాలని, లేని పక్షంలో వాడవాడలా ప్రాణనష్టం జరుగుతుందని హెచ్చరించారు. విగ్రహ ప్రతిష్ఠకు ఎవరు అడ్డు వచ్చినా ఊరుకోనని, వారిని తన పాదాల కింద నలిపేస్తానని ఉగ్రరూపంతో పలికారు. అయితే విగ్రహ ప్రతిష్ఠ పూర్తి చేస్తే భక్తులు కోరిన కోరికలు నెరవేరుస్తానని, వారు కోరింది బంగారం అవుతుందని అభయమిచ్చారు. 

Also Read: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!

సమాజంలో నైతిక నిలువల పతం 

సమాజంలో మారుతున్న పోకడలపై కూడా అమ్మవారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు వావివరుసలు లేకుండా ప్రవరిస్తున్నారని, ధర్మాన్ని విస్మరిస్తున్నారని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమశిక్షణతో పెంచకుండా ఊరిమీద వదిలేస్తున్నారని, ఈ ధోరణి తనకు కంటతడి పెట్టిస్తోందని స్వర్ణలత పేర్కొన్నారు. భక్తులు దోసెడంత ఇస్తే నాకు గోరంత కూడా పెట్టడం లేదు అని తనను కనీసం సంతోషపరచడం లేదని వాపోయారు. 

Also Read: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళీ బోనాలు ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ఎంతో వైభవంగా జరుగుతాయి. ఆదివారం అమ్మవారికి బోనాలు సమర్పించి అనంతరం సోమవారం రంగం కార్యక్రమం నిర్వహిస్తారు. రంగం అంటే భవిష్యత్‌ను వెల్లడించడం. మాతంగి స్వర్ణలతో పచ్చి మట్టి కుండపై నిలబడి అమ్మవారు తనలోకి ఆవాహన అయినట్టు భావించి భవిష్యవాణి వినిపిస్తారు. ఈ మాటలను అమ్మవారి ఆదేశాలుగా భక్తులు భావిస్తారు. 

Also Read: హైదరాబాద్‌లో నిరుద్యోగుల మెరుపు ధర్నా- 19వేల పోలీస్‌ ఉద్యోగాలతో నోటిఫికేషన్ వేయాలని డిమాండ్ !

Frequently Asked Questions

రంగం కార్యక్రమం అంటే ఏమిటి?

రంగం అంటే భవిష్యత్ వెల్లడించడం. మాతంగి స్వర్ణలత పచ్చి మట్టి కుండపై నిలబడి అమ్మవారు పూనినట్లు భావించి భవిష్యవాణి వినిపిస్తారు.

బోనాల ఉత్సవాల్లో భవిష్యవాణి ఎవరు వినిపించారు?

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ బోనాల ఉత్సవాల్లో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఆమె సరిగ్గా 9.55 గంటలకు పచ్చికుండపై నిలబడి అమ్మవారు పూనినట్లు చెప్పారు.

అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ గురించి భవిష్యవాణిలో ఏమి చెప్పబడింది?

గతంలో ఇచ్చిన మాట ప్రకారం విగ్రహ ప్రతిష్ఠ చేయనందుకు అమ్మవారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఆరు నెలల్లోగా విగ్రహ ప్రతిష్ఠ పూర్తి చేయాలని హెచ్చరించారు.

ఈ ఏడాది ఎలాంటి ప్రకృతి విపత్తులు సంభవిస్తాయని భవిష్యవాణి తెలిపింది?

ఈ సంవత్సరం కుంభవర్షాలు, వరదలు, అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయని మాతంగి స్వర్ణలత హెచ్చరించారు. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: చదువు రాని రేవంత్ రెడ్డి బ్రదర్స్.. పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. శ్రీధర్ బాబు బుకాయిస్తున్నారు: కేటీఆర్ ఆగ్రహం
చదువు రాని రేవంత్ రెడ్డి బ్రదర్స్.. పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. శ్రీధర్ బాబు బుకాయిస్తున్నారు: కేటీఆర్ ఆగ్రహం
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Embed widget