అన్వేషించండి

Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!

Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఆయన మరో మహిళతో ప్రేమాయణం సాగిస్తున్నట్టు వెలుగుచూసింది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై మహిళ ఫిర్యాదుతో అరెస్ట్.
  • సోదాల్లో కృష్ణారెడ్డికి మరో మహిళతో ప్రేమాయణం బయటపడింది.
  • శిక్షణలోనూ ఉదయ్ కృష్ణారెడ్డిపై అనేక ఆరోపణలు వెలుగులోకి.

Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి సామాన్యుడు కాదనిపిస్తోంది. ఆయన మరో మహిళతో ప్రేమాయణం సాగించిన విషయం వెలుగులోకి వచ్చింది. మహిళ ట్రైనీ ఐపీఎస్‌ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులకు రోజుకో విషయం తెలుస్తోంది. తాజాగా ఆయన ఇంట్లో తనిఖీలు చేస్తే కీలక విషయాలు బయటపడ్డాయి. మరో మహిళతో ఉన్న సంబంధాలు బహిర్గతమయ్యాయి. దీంతో పోలీసులు మరింత డీప్‌గా డిగ్ చేస్తున్నారు. 

మహిళ ట్రైనీ ఐపీఎస్‌ ఫిర్యాదుతో అత్తాపూర్‌ పోలీసులు సహచర ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు వేగాన్ని పెంచారు. విచారణను నగర మహిళా భద్రతా విభాగం డీసీపీ లావణ్యనాయక్‌ జాదవ్‌ పర్యవేక్షిస్తున్నారు. ఈ విచారణ తీవ్రత పెరుగుతున్న కొద్దీ కీలక విషయాలు వెలుగు చూస్తోంది. బాధితురాలు ఇచ్చిన సమాచారంతో ఉదయ్‌ కృష్ణారెడ్డి ఉండే గదిలో పోలీసులు సోదాలు చేపట్టారు. అశోక్‌నగర్‌లో ఉండే ఈ నివాసంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్టు చెప్తున్నారు.  
  
కృష్ణారెడ్డి గదిలో సోదాలు చేసిన పోలీసులకు ఆయనకు మరో మహిళతో ఉన్న సంబంధం వెలుగు చూసింది. ల్యాప్‌టాల్‌, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. రెండు ప్రేమ లేఖలు కూడా ఆయన గదిలో లభ్యమయ్యాయి. దీనిని పరిశీలించిన అధికారులు వేరే మహిళతో కృష్ణారెడ్డి ప్రేమాయణం సాగించినట్టు తేల్చారు. ఆమెకు 2014లో వివాహమైంది. ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే 2023లో భర్త నుంచి విడిపోయి హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుండేది. ఆయితే ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. తర్వాత ఆ ఉద్యోగానికి రాజీనామా చేయించి అశోక్‌నగర్‌లోని ఓ కోచింగ్ సెంటర్‌లో ఉద్యోగం కల్పించాడు. తర్వాత లివ్ ఇన్ రిలేషన్ కోసం ప్రయత్నించాడు. అయితే ఆమెకు ఇంకా విడాకులు మంజూరు కాకపోవడంతో ఆయన ప్రపోజ్‌ను తిరస్కరించింది. 

ప్రస్తుతం కేసు పెట్టిన బాధితురాలు కూడా సదరు మహిళను కలిశారు. తాను కూడా కృష్ణారెడ్డి బాధితురాలినేనని చెప్పారు. తనతో కూడా అతిగా ప్రవర్తిస్తున్నాడని ఆమె వాపోయారని మహిళా ట్రైనీ ఐపీఎస్‌ చెప్పినట్టు తెలుస్తోంది. ఆమెతోపాటు మరో 20 మంది నుంచి కూడా వాంగ్మూలాలను తీసుకున్నారు.

ట్రైనింగ్‌లో ఉన్నప్పుడు కూడా కృష్ణారెడ్డిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. అతి ప్రవర్తన కారణంగా చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఈ విషయాలు తెలుసుకున్న పోలీసులు మరింత సమాచారం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దీని కోసం ఆయన్ని కస్టడీలోకి తీసుకొని విచారించాలని చూస్తున్నారు.

Frequently Asked Questions

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని ఎందుకు అరెస్టు చేశారు?

ఆయనపై మరో మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు చేయడంతో అత్తాపూర్ పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఉదయ్ కృష్ణారెడ్డి ఇంట్లో తనిఖీల్లో ఏ విషయాలు బయటపడ్డాయి?

ఆయన గదిలో సోదాలు చేసిన పోలీసులకు మరో మహిళతో ఉన్న సంబంధాలు వెల్లడయ్యాయి. ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌తో పాటు రెండు ప్రేమ లేఖలు లభ్యమయ్యాయి.

ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధం ఉన్న మరో మహిళ వివరాలు ఏమిటి?

ఆమెకు 2014లో వివాహమై, ఒక కుమారుడున్నాడు. భర్త నుంచి విడిపోయిన ఆమెతో పరిచయం పెంచుకుని, అశోక్ నగర్‌లోని కోచింగ్ సెంటర్‌లో ఉద్యోగం కల్పించాడు.

ఈ కేసులో ఉదయ్ కృష్ణారెడ్డి బాధితులు ఎంత మంది ఉన్నారు?

ఫిర్యాదు చేసిన ట్రైనీ ఐపీఎస్ తో పాటు, మరో మహిళ కూడా ఆయన బాధితురాలే. మొత్తం 20 మంది నుంచి వాంగ్మూలాలను తీసుకున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Embed widget