అన్వేషించండి

IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌

ఐపీఎల్ 2027 ముందు హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ రూమర్స్ వస్తున్న వేళ ఫ్రాంచైజీల ట్రేడ్ అమౌంట్ పై పూర్తి పారదర్శకత ఉండాలని సునీల్ గవాస్కర్ డిమాండ్ చేశాడు.

IPL News, Sunil Gavaskar Questions Secret Trades: ఐపీఎల్ 2027 సీజన్ రాకముందే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ప్లేయర్ల ట్రేడింగ్ లొల్లి స్టార్ట్ అయింది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ వేరే ఫ్రాంచైజీకి ట్రేడ్ చేయబోతోందనే ప్రచారం ఊపందుకుంది. 2015 లో ముంబై తరఫున ఎంట్రీ ఇచ్చిన హార్దిక్, 2022 లో గుజరాత్ టైటాన్స్ కు వెళ్లి కెప్టెన్ గా టైటిల్ నెగ్గాడు. ఆ తర్వాత ట్రేడింగ్ విండో ద్వారా తిరిగి ముంబైకి వచ్చి కెప్టెన్సీ తీసుకున్నప్పటికీ ఆశించిన ఫలితాలు ల‌భించ‌లేదు. 2024 లో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలవగా, 2025 లో క్వాలిఫైయర్ 2 వరకు వెళ్లి, 2026 సీజన్ లో తొమ్మిదో స్థానంతో స‌రిపెట్టుకుంది. ఈ ట్రేడ్ రూమర్స్ నడుమ ముంబై యాజమాన్యం హార్దిక్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మరింత అగ్నికి ఆజ్యం పోసిన‌ట్ల‌య్యింది.

Read Also: Historic Test Victory: సుతార్ 10 వికెట్ల మాయాజాలంతో లంక చిత్తు.. 165 రన్స్ తేడాతో భారత్ ఘనవిజయం, 600వ టెస్టులో టీమిండియా బంపర్ విక్టరీ!

అలాంటివి చేయ‌కూడ‌దు..గావ‌స్క‌ర్
ఈ ట్రేడింగ్ వ్యవహారాలపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తాజాగా త‌న‌ కాలమ్‌లో స్పందిస్తూ కీలక విషయాలపై చ‌ర్చించాడు. "ఒక ఫ్రాంచైజీ నుంచి మరో జట్టుకు ప్లేయర్ల బదిలీపై మీడియాలో పెద్ద ఎత్తున ఊహాగానాలు చెల‌రేగుతున్నాయి. ట్రేడింగ్ విండో క్లోజ్ కావడానికి ఇంకా సమయం మిగిలుంది. ఒక ఆటగాడి బదిలీ పబ్లిక్ డొమైన్ లో ఉన్నప్పటికీ, ట్రేడ్ జరిగినప్పుడు దానికి సంబంధించిన అమౌంట్ వివరాలు కేవలం రెండు ఫ్రాంచైజీలు, ఆ ప్లేయర్, బిసిసిఐకి మాత్రమే తెలుస్తున్నాయి" అని గుర్తు చేశాడు.

Read Also:  Historic Cricket Diplomacy: కరాచీలో టెస్ట్ కావాలన్న ముషారఫ్.. అద్వానీ ఫోన్ కాల్ తో ఆగిన ప్లాన్, 2004 పాకిస్తాన్ టూర్ సీక్రెట్స్ పై తాజా బుక్ లో వెల్ల‌డి!

నిబంధ‌నాలు పాటించారా..?
ట్రేడ్ మనీ వివరాలు గోప్యంగా ఉంచడం వల్ల ఇతర జట్లలో అనుమానాలు వస్తాయని గవాస్కర్ పేర్కొన్నాడు. "ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి జట్టుకు ఉండే నిర్దేశిత శాలరీ క్యాప్ ను పాటించారా లేదా నిబంధనలు ఉల్లంఘించారా అనేది మిగతా ఫ్రాంచైజీలకు తెలియకుండా ఉంటోంది. అందుకే పూర్తి ట్రాన్స్‌పరెన్సీ కోసం ట్రేడ్ అమౌంట్ నంబర్లను కూడా అధికారికంగా బయటపెట్టడం ఎంతో కీల‌కం" అని పేర్కొన్నాడు.

వేలెత్తి చూపే అవ‌కాశం ఉండ‌కూడ‌దు..
ప్రపంచంలోనే బెస్ట్ టీ20 లీగ్ గా ఉన్న ఐపీఎల్ ప్రతిష్టను కాపాడటానికి పూర్తి పారదర్శకత అవసరమని గవాస్కర్ వ్యాఖ్యానించాడు. "ఐపీఎల్ అనేది ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 లీగ్ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. దీనిపై అసూయపడేవారు వేలెత్తి చూపే అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే అన్ని డీల్స్ క్లియర్ గా ఉండేలా చూసుకోవాలి" అని పేర్కొన్నాడు. హార్దిక్ పాండ్యా భవిష్యత్ పై ఇంకా అఫీషియల్ క్లారిటీ రానప్పటికీ ట్రేడింగ్ నిబంధనలపై గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ సర్కిల్స్ లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయి. మరోవైపు హార్దిక్ ట్రేడింగ్ రేసులో చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్  ఉన్నాయి. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chahal Dark Phase: చాహ‌ల్ వెనుక దాగి ఉన్న కన్నీళ్ల గాథ.. డివోర్స్ తర్వాత తాగుడుకు బానిసై ప్యానిక్ అటాక్స్, ఆ త‌ర్వాత ఇన్స్పైరింగ్ కంబ్యాక్ స్టోరీ
చాహ‌ల్ వెనుక దాగి ఉన్న కన్నీళ్ల గాథ.. డివోర్స్ తర్వాత తాగుడుకు బానిసై ప్యానిక్ అటాక్స్, ఆ త‌ర్వాత ఇన్స్పైరింగ్ కంబ్యాక్ స్టోరీ
Starc Availability Uncertainty: నెక్స్ట్ సీజన్ కు స్టార్క్ దూరం కానున్నాడా..! ఆ కార‌ణంతో ఫ్రాంచైజీలకు టెన్షన్
నెక్స్ట్ సీజన్ కు స్టార్క్ దూరం కానున్నాడా..! ఆ కార‌ణంతో ఫ్రాంచైజీలకు టెన్షన్
Natarajan Homecoming Trade: సగం ధరకే సొంత గూటికి యార్కర్ల వీరుడు.. సన్‌రైజర్స్ ,ఢిల్లీ మధ్య  ప్లేయర్ స్వాప్, నటరాజన్ కోసం అన్సారీని వదులుకున్న ఆరెంజ్ ఆర్మీ
సగం ధరకే సొంత గూటికి యార్కర్ల వీరుడు.. సన్‌రైజర్స్ ,ఢిల్లీ మధ్య  ప్లేయర్ స్వాప్, నటరాజన్ కోసం అన్సారీని వదులుకున్న ఆరెంజ్ ఆర్మీ
Rishabh Pant Homecoming Strategy: ఢిల్లీ మిడిలార్డర్‌కు పంత్ సరైన అస్త్రం.. కుల్దీప్ ట్రేడింగ్ వెనుక అసలు ప్లాన్ ఇదేనంటూ డీసీ కోచ్ గంగూలీ విశ్లేషణ
ఢిల్లీ మిడిలార్డర్‌కు పంత్ సరైన అస్త్రం.. కుల్దీప్ ట్రేడింగ్ వెనుక అసలు ప్లాన్ ఇదేనంటూ డీసీ కోచ్ గంగూలీ విశ్లేషణ
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget