అన్వేషించండి

Historic Cricket Diplomacy: కరాచీలో టెస్ట్ కావాలన్న ముషారఫ్.. అద్వానీ ఫోన్ కాల్ తో ఆగిన ప్లాన్, 2004 పాకిస్తాన్ టూర్ సీక్రెట్స్ పై తాజా బుక్ లో వెల్ల‌డి!

India VS Pakistan: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కరాచీలో టెస్ట్ మ్యాచ్ కోరినా భద్రతా కారణాలతో ఎల్‌కే అద్వానీ ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు యశోవర్ధన్ ఆజాద్ పుస్తకంలో వెల్లడైంది.

2004 India -Pakistan Tour Security Secrets Revealed:  2004 లో జరిగిన చారిత్రాత్మక పాకిస్తాన్ పర్యటనకు సంబంధించి పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కరాచీలో టెస్ట్ మ్యాచ్ నిర్వహించాలని ఇండియా అనుమతి కోరినప్పటికీ, భద్రతా కారణాల వల్ల ఆ విజ్ఞప్తిని ఇండియా తిరస్కరించింది. ఈ మొత్తం వ్యవహారంలో అప్పటి ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ కీలక పాత్ర పోషించారని మాజీ ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ ఆఫీషియల్ యశోవర్ధన్ ఆజాద్ తన తాజా పుస్తకం 'పోలీసింగ్ ది రిపబ్లిక్' లో వెల్లడించాడు.

అద్వానీ నుంచి ఆజాద్ కు అర్జెంట్ ఫోన్ కాల్
పాకిస్తాన్‌లోని అన్ని వేదికలను పరిశీలించిన ముగ్గురు సభ్యుల అడ్వాన్స్ సెక్యూరిటీ టీమ్ కు ఆజాద్ హెడ్ గా వ్యవహరించాడు. ముల్తాన్, రావల్పిండి, లాహోర్ లలో టెస్ట్ మ్యాచ్ లకు అనుమతి ఇచ్చిన ఆ కమిటీ, తీవ్రమైన ముప్పు పొంచి ఉన్నందున కరాచీ, పెషావర్‌లను టెస్ట్ వేదికల జాబితా నుంచి తప్పించింది. ఆ వెంటనే అద్వానీ నుంచి ఆజాద్ కు ఆర్ఏఎక్స్ (RAX) ఫోన్ లో కాల్ వచ్చింది. "కరాచీలో మనం టెస్ట్ మ్యాచ్ నిర్వహించలేమా?" అని అద్వానీ అడిగినప్పుడు, ఎక్కువ రోజుల పాటు అక్కడ ఉండటం టీమ్ కు చాలా రిస్క్ అని ఆజాద్ వివరించాడు. ఆ రిక్వెస్ట్ ముషారఫ్ నుంచి వచ్చిందని తెలిసినా, సెక్యూరిటీ టీమ్ రిపోర్ట్ ను గౌరవిస్తూ అద్వానీ షెడ్యూల్ మార్చకుండా భద్రతా సలహాకే కట్టుబడ్డాడు.

Read Also: Jadeja Costly No-Ball:  అద్భుత‌మైన బంతితో వికెట్ తీసిన‌ జడేజా.. క‌ట్ చేస్తే నోబాల్‌.. గౌతమ్ గంభీర్ రియాక్ష‌న్ వైరల్..

అల్ ఖైదా ముప్పు.. రా (RAW) హెచ్చరికలతో అలర్ట్
మార్చి 11న మాడ్రిడ్ రైలు బాంబు పేలుళ్లు జరిగిన సమయంలో ఇండియన్ టీమ్ కరాచీ వన్డే కోసం ప్రాక్టీస్ చేస్తోంది. పాకిస్తాన్ లోని కీలక ప్రాంతాల్లో అల్ ఖైదా ఆపరేటివ్స్ ఉన్నారనే సమాచారంతో మేనేజర్ ఆర్ఎస్ శెట్టి, కోచ్ జాన్ రైట్ లతో కలిసి భద్రతా విభాగం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించింది. అదే సమయంలో భారత జట్టుకు ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని ఇస్లామాబాద్‌లోని ఇండియన్ హైకమిషన్ నుంచి 'రా' (RAW) ఇంటెలిజెన్స్ సమాచారం కూడా అందింది. దీంతో కరాచీ మ్యాచ్ ముగిసిన వెంటనే నేరుగా విమానాశ్రయానికి వెళ్లేలా లగేజీని ఉదయమే సిద్ధం చేసి ఎయిర్‌పోర్టుకు తరలించారు.

న్యూక్లియర్ బటన్ అడిగిన సచిన్ టెండూల్కర్
ఈ టూర్ సమయంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో జరిగిన ఒక సరదా సంఘటనను కూడా పుస్తకంలో ఆజాద్ గుర్తుచేసుకున్నాడు. ఇస్లామాబాద్ ఎయిర్‌పోర్టులో బ్లాక్ సూట్ ధరించి బ్రీఫ్‌కేస్ పట్టుకున్న సెక్యూరిటీ గార్డులను చూసి సచిన్ అమాయకంగా "అది న్యూక్లియర్ బటనా?" అని అడిగాడు. అవి జామ్మర్స్ అని చెప్పిన తర్వాత సచిన్ ఎంతో ఆసక్తితో సందేహాలను నివృత్తి చేసుకున్నాడు. సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని భారత జట్టు ఈ 'ఫ్రెండ్‌షిప్ టూర్' లో వన్డే సిరీస్‌ను 3-2తో, టెస్ట్ సిరీస్‌ను 2-1తో గెలుచుకుని చరిత్ర సృష్టించింది.  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND VS WI Indore 2nd T20 Updates: బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
IND vs NZ ODI Series: కివీస్ టీమ్‌లో బిగ్ సర్ప్రైజ్... ఇండియాతో వ‌న్డే సిరీస్ కు జ‌ట్ల ప్ర‌క‌ట‌న‌.. ప్రతీకారానికి గిల్ సేన రెడీ!
కివీస్ టీమ్‌లో బిగ్ సర్ప్రైజ్... ఇండియాతో వ‌న్డే సిరీస్ కు జ‌ట్ల ప్ర‌క‌ట‌న‌.. ప్రతీకారానికి గిల్ సేన రెడీ!
Scrap Impact Rule: ఆల్‌రౌండర్ల కెరీర్‌ను మింగేస్తున్న ఆ నిబంధన.. =ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ తక్షణమే ఎత్తివేయాలంటూ రహానే ఫైర్
ఆల్‌రౌండర్ల కెరీర్‌ను మింగేస్తున్న ఆ నిబంధన.. =ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ తక్షణమే ఎత్తివేయాలంటూ రహానే ఫైర్
Samson Storm Reply: వరుస వైఫల్యాల తర్వాత ఊచకోత.. కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన సంజూ శాంసన్
వరుస వైఫల్యాల తర్వాత ఊచకోత.. కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన సంజూ శాంసన్
Advertisement

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
IND VS WI Indore 2nd T20 Updates: బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Horror Thriller OTT : మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
Bollaram Kidnap Case: బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
CM Revanth Reddy On El Nino Crisis: రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Embed widget