తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సవాళ్లు, ప్రతిసవాళ్లు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌పై రాజకీయ వర్గాల్లో హాట్ డిబేట్ నడుస్తోంది. దమ్ముంటే సొంతంగా ఎలక్షన్ అఫిడవిట్ నింపి చూపాలని కేటీఆర్‌కు సవాల్ విసిరిన ఈ పాలిటిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.