అన్వేషించండి

Karnataka Cabinet Expansion: కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ.. మంత్రులుగా 19 మంది ప్రమాణం- మరోవైపు ఎమ్మెల్యేల రాజీనామాలు

DK Shivakumar Cabinet | కర్ణాటకలో సోమవారం నాడు 19 మంది కొత్త మంత్రులు ప్రమాణం చేశారు. దాంతో రాష్ట్ర కేబినెట్ మంత్రుల సంఖ్య 33కి చేరింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కర్ణాటక కేబినెట్‌ రెండు నెలల తర్వాత 19 మందితో విస్తరించబడింది.
  • మంత్రి పదవి దక్కని ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించారు.
  • పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు మంత్రివర్గంలో చోటు దక్కనందుకు అసంతృప్తి.

Karnataka Cabinet Expansion | బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్‌లో ఓవైపు అసంతృప్తి జ్వాలలు సెగలు రేపుతుండగా మరోవైపు ప్రభుత్వం తమ మంత్రివర్గాన్ని విస్తరించింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన 2నెలల తర్వాత డీకే శివకుమార్ మంత్రి వర్గాన్ని విస్తరించారు. ట్టారు. నూతనంగా 19 మందికి క్యాబినెట్‌లో చోటు కల్పించగా, లోక్‌భవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ కొత్త మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జి. పరమేశ్వర్, మంత్రులు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ రణదీప్ సింగ్ సూర్జేవాలా తదితర ముఖ్య నేతలు హాజరయ్యారు. 

కర్ణాటక కేబినెట్‌లో 19 మంది కొత్త మంత్రులు వీరే..
ఈ ప్రమాణస్వీకార మహోత్సవంలో నరేంద్ర స్వామి, శివరాజ్ తంగదగి, బసవంతప్ప, నాగేంద్ర, రుద్రప్ప లమానీ, రఘుమూర్తి, జమీర్ అహ్మెద్ ఖాన్, రిజ్వాన్ అహ్షద్, సంతోష్ లాడ్, పుట్టురంగ శెట్టి, ఎస్.ఎస్. మల్లికార్జున, అజయ్ సింగ్, మధు బంగారప్ప, చలువరాయ స్వామి, బసవరాజు రాయరెడ్డి, శివలింగే గౌడ, బాలకృష్ణ, విజయానంద కాశప్పనవర్, లక్ష్మణ సవధి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నూతన మంత్రుల చేరికతో కర్ణాటక కేబినెట్ సభ్యుల మొత్తం సంఖ్య 33కి చేరింది.

మంత్రి పదవి దక్కలేదని వరుస రాజీనామాలు

కర్ణాటక కాంగ్రెస్‌లో రాజీనామాలు కలకలం రేపుతున్నాయి. కర్ణాటకలో సీఎం డీకే శివకుమార్ నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ విస్తరణ అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేపింది. నూతన క్యాబినెట్‌లో స్థానం దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రమాణ స్వీకారానికి కొద్ది గంటల ముందే ఇండి నియోజకవర్గ ఎమ్మెల్యే యశవంతరాయగౌడ పాటిల్, సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే బెళూరు గోపాలకృష్ణ తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

Also Read: Karnataka Congress MLAs Resign: కర్ణాటక కాంగ్రెస్‌లో తిరుగుబాటు జ్వాల - క్యాబినెట్‌లో చోటు దక్కక ఎమ్మెల్యేల రాజీనామాలు!

పాటిల్ విధాన సౌధలో డిప్యూటీ స్పీకర్ రుద్రప్ప లమాణిని స్వయంగా కలసి తన రాజీనామా లేఖ అందజేశారు. దశాబ్దాలుగా పార్టీకి నమ్మకమైన వారిగా  ఉన్నప్పటికీ మంత్రి పదవి ఇవ్వకుండా కాంగ్రెస్ అధిష్ఠానం తమకు తీవ్ర అన్యాయం చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం బయటకురాగానే  బెంగళూరు వీధుల్లో ఆయన మద్దతుదారులు భారీ ఎత్తున నిరసనలు, ధర్నాలు నిర్వహించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

మరోవైపు, ప్రాంతీయ, సామాజిక సమీకరణాల పేరుతో తమను పక్కనపెట్టి ఇతరులకు ప్రాధాన్యత ఇవ్వడంపై మంత్రివర్గంలో చోటు ఆశించి భంగపడ్డ మరికొందరు సీనియర్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ముగ్గురు నేతలు కార్పొరేషన్ చైర్మన్ పదవులకు రాజీనామా చేసి కేబినెట్ లో చోటు దక్కకపోవడంపై నిరసన తెలిపారు. పలువురు ఎమ్మెల్యేలు తమ అనుచరులతో అత్యవసర సమావేశాలు నిర్వహిస్తుండటంతో కన్నడ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. సిద్ధరామయ్య సీఎంగా ఉన్న సమయంలో సైలెంట్ గా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయ్యాక తమకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశించి భంగపడ్డారు.

Frequently Asked Questions

కర్ణాటక మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగింది?

కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు స్వీకరించిన 2 నెలల తర్వాత మంత్రివర్గం విస్తరించబడింది. కొత్తగా 19 మందికి క్యాబినెట్‌లో చోటు కల్పించారు.

విస్తరణ తర్వాత కర్ణాటక కేబినెట్‌లో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత?

కొత్త మంత్రుల చేరికతో కర్ణాటక కేబినెట్ సభ్యుల మొత్తం సంఖ్య 33కి చేరింది. ఈ ప్రమాణస్వీకార మహోత్సవంలో 19 మంది కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.

మంత్రివర్గ విస్తరణ కారణంగా జరిగిన ప్రధాన పరిణామాలు ఏమిటి?

మంత్రి పదవి దక్కకపోవడంపై అసంతృప్తితో ఇండి ఎమ్మెల్యే యశవంతరాయగౌడ పాటిల్, సాగర్ ఎమ్మెల్యే బెళూరు గోపాలకృష్ణ తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. పలువురు ఎమ్మెల్యేలు నిరసనలు తెలిపారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Karnataka Cabinet Expansion: కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ.. మంత్రులుగా 19 మంది ప్రమాణం- మరోవైపు ఎమ్మెల్యేల రాజీనామాలు
కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ.. మంత్రులుగా 19 మంది ప్రమాణం- మరోవైపు ఎమ్మెల్యేల రాజీనామాలు
Breaking News: నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
EPFO 15000 పరిమితిని పెంచుతున్న కేంద్రం.. PF, పెన్షన్‌లో మరింత పొదుపు చేయవచ్చు
EPFO 15000 పరిమితిని పెంచుతున్న కేంద్రం.. PF, పెన్షన్‌లో మరింత పొదుపు చేయవచ్చు
Karnataka Congress MLAs Resign: కర్ణాటక కాంగ్రెస్‌లో తిరుగుబాటు జ్వాల - క్యాబినెట్‌లో చోటు దక్కక ఎమ్మెల్యేల రాజీనామాలు!
కర్ణాటక కాంగ్రెస్‌లో తిరుగుబాటు జ్వాల - క్యాబినెట్‌లో చోటు దక్కక ఎమ్మెల్యేల రాజీనామాలు!
Advertisement

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Embed widget