అన్వేషించండి

Karnataka Cabinet Expansion: కర్ణాటక కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ - మరి తెలంగాణలో మార్పు చేర్పులుంటాయా?

CM DK Shivakumar Cabinet : కర్ణాటక సీఎం డీకే శివకుమార్ మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 20 మంది మంత్రుల జాబితా, స్పీకర్‌గా జీఎస్ పాటిల్ ఖరారు.

Karnataka Raj Bhavan Oath Ceremony:  కర్ణాటక రాజకీయం మళ్లీ సంచలన మలుపు తిరిగింది. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తమ మంత్రివర్గ విస్తరణకు పూర్తిస్థాయిలో రంగం సిద్ధం చేసింది. సుదీర్ఘ చర్చలు, కసరత్తుల అనంతరం నూతన మంత్రుల తుది జాబితాకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధికారికంగా ఆమోద ముద్ర వేశారు. శనివారం ఢిల్లీ వేదికగా మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మధ్య జరిగిన కీలక భేటీ తర్వాత ఈ తుది జాబితాను సీఎం డీకే శివకుమార్‌కు పంపారు.  బెంగళూరులో నూతన మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది.

ఈ విస్తరణలో భాగంగా మొత్తం 20 మంది నేతలకు మంత్రివర్గంలో స్థానం లభించనుంది. ప్రస్తుత మంత్రివర్గంలోని సీనియర్ నేతలు బి.జెడ్. జమీర్ అహ్మద్ ఖాన్, సంతోష్ లాడ్ వంటి ప్రముఖులతో పాటు ప్రాంతీయ, సామాజిక సమతుల్యతను పాటిస్తూ పలువురు కొత్త ముఖాలకు అవకాశమిచ్చారు. పార్టీ అధిష్ఠానం నుంచి ఆమోదం పొందిన ఈ జాబితాను రాజ్యాంగ నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రాజ్ భవన్‌లో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్‌కు అందజేయనున్నారు. అనంతరం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

మంత్రివర్గ విస్తరణతో పాటు శాసనసభ స్పీకర్ నియామకంపైనా అధిష్ఠానం ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చింది. కర్ణాటక శాసనసభ తదుపరి స్పీకర్‌గా సీనియర్ నాయకుడు జీఎస్ పాటిల్ పేరును కాంగ్రెస్ నాయకత్వం ఖరారు చేసింది. సభను సమర్థవంతంగా నడిపించడంలో ఆయనకున్న అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ కీలక బాధ్యతలను అప్పగిస్తున్నట్లు అధిష్ఠానం స్పష్టం చేసింది. జీఎస్ పాటిల్ నియామకంతో సభలో పాలనాపరమైన సమన్వయం మరింత మెరుగుపడుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. 

  మంత్రివర్గంలో చోటు కోసం తీవ్ర స్థాయిలో పోటీ నెలకొన్నప్పటికీ, లోక్‌సభ ఎన్నికల తదుపరి సమీకరణలు మరియు 2028 అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా ఈ ఎంపికలు జరిగాయి. పాతమైసూరు, కళ్యాణ కర్ణాటక, ముంబై కర్ణాటక ప్రాంతాలకు బ్యాలెన్స్ చేస్తూ, లింగాయత్, వొక్కలిగ, కురుబ, ఎస్సీ/ఎస్టీ,  మైనార్టీ సామాజిక వర్గాలకు సమన్యాయం చేసేలా జాబితాను రూపొందించినట్లు తెలుస్తోంది. నామినేటెడ్ నేతల్లో కొందరికి అసంతృప్తి కలగకుండా అధిష్ఠానం ముందుగానే సంప్రదింపులు జరిపింది.

ఈ నూతన విస్తరణ ద్వారా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం తన పరిపాలనా యంత్రాంగాన్ని మరింత వేగవంతం చేయాలని భావిస్తోంది. మంత్రివర్గ విస్తరణ పూర్తయితే శాఖల కేటాయింపు సైతం శరవేగంగా జరగనుంది. సీఎం డీకే శివకుమార్ నేతృత్వంలో జరగనున్న ఈ విస్తరణతో రాష్ట్రంలో కాంగ్రెస్ పట్టు మరింత బిగుస్తుందా లేదా అసమ్మతి స్వారాలు వ్యక్తమవుతాయా అనేది ఇప్పుడు కన్నడ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. కర్ణాటక మంత్రివర్గం విస్తరణకు రాహుల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తెలంగాణ నేతలు కూడా పదవుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Karnataka Cabinet Expansion: కర్ణాటక కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ - మరి తెలంగాణలో మార్పు చేర్పులుంటాయా?
కర్ణాటక కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ - మరి తెలంగాణలో మార్పు చేర్పులుంటాయా?
Auqib Nabi Selection: జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
Breaking News:హైదరాబాద్‌లో నిరుద్యోగుల మెరుపు ధర్నా- 19వేల పోలీస్‌ ఉద్యోగాలతో నోటిఫికేషన్ వేయాలని డిమాండ్ !
హైదరాబాద్‌లో నిరుద్యోగుల మెరుపు ధర్నా- 19వేల పోలీస్‌ ఉద్యోగాలతో నోటిఫికేషన్ వేయాలని డిమాండ్ !
ABP Desam Top 10, 3 August 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
ABP Desam Top 10, 3 August 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
Advertisement

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Uravakonda latest News: ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
Auqib Nabi Selection: జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
Eesha Rebba : గోల్డ్ కలర్ డ్రెస్‌లో అందాల ఈషా - సరస్సు ఒడ్డున దేవకన్యలా...
గోల్డ్ కలర్ డ్రెస్‌లో అందాల ఈషా - సరస్సు ఒడ్డున దేవకన్యలా...
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
CWG India Analysis: గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
Embed widget