అన్వేషించండి

Uravakonda latest News: ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 

Uravakonda latest News: ఆంధ్రప్రదేశ్‌ మంత్రి పయ్యావుల కేశవ్‌కు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన ధర్నా ఉరవకొండలో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. దీంతో వైసీపీ లీడర్లను పోలీసులు అరెస్టు చేశారు. 

Uravakonda latest News: ఆంధ్రప్రదేశ్‌లో మంత్రులు బరితెగించి ప్రైవేటు ఆస్తులు కాజేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఉరవకొండలో మంత్రి పయ్యావుల కేశవ్‌కు వ్యతిరేకంగా భారీ ఎత్తున ఆందోళనకు ప్లాన్ చేసింది. ఈ నిరసన ధర్నాకు కోర్టు నుంచి కూడా అనుమతులు తెచ్చుకున్నట్టు వైసీపీ నేతలు చెబుతున్నారు. అయినా పోలీసులు ఆందోళన చేపట్టకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తున్నారు. నేతల అరెస్టును పార్టీ తీవ్రంగా ఖండించింది. 

ఉరవకొండలోని వేల్పుమడుగులో వైసీపీ నేతకు చెందిన భూమిని మంత్రి పయ్యావుల కేశవ్ ఆక్రమించుకున్నారని వైసీపీ విమర్శిస్తున్నారు. నియోజకవర్గంలో ఆయన భూదందా పెరిగిపోతుందని నేడు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ధర్నాకు పిలుపునిచ్చారు. ఆయన పిలుపు మేరకు అనంతపురం జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నేతలంతా ఉరవకొండ వచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. 

వైసీపీ నేతల ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ నేతలను అరెస్టు చేశారు. దీనిపై వైసీపీ లీడర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల అక్రమాలకు పోలీసులు, రెవెన్యూ అధికారులు అండగా నిలబడుతున్నారని మండిపడ్డారు. వారి అరాచకలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు.  

గుంతకల్ సబ్ డివిజన్‌లో పోలీస్ యాక్ట్-30 అమలులో ఉందని ఉరవకొండలో నిరసనలకు అనుమతి లేదన్నారు పోలీసులు. అయినా సరే ధర్నా నిర్వహిస్తామంటూ వీడియో విడుదల చేశారు విశ్వేశ్వర్‌రెడ్డి. ఈ ధర్నాకు సంఘీభావంగా వస్తున్న వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పెనుకొండలో మాజీ మంత్రి శంకర నారాయణ హౌస్ అరెస్ట్ చేశారు. 

గత ప్రభుత్వంలో బీసీలపై దాడులు చేశారను, భూకబ్జాలకు పాల్పడ్డారని టీడీపీ ఆరోపిస్తోంది. వైసీపీ నేతలు చేస్తున్న ధర్నాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టింది. దేవాలయ భూముల పరిరక్షణకు నిరసన కార్యక్రమం చేపట్టారు. 

ఇరువర్గాల మధ్య సాగుతున్న పోటాపోటీ నిరసనలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. అనుమతులు లేకుండా ధర్నాలు చేస్తే అరెస్టు చేశామని పేర్కొన్నారు.  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Uravakonda latest News: ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
Breaking News:హైదరాబాద్‌లో నిరుద్యోగుల మెరుపు ధర్నా- 19వేల పోలీస్‌ ఉద్యోగాలతో నోటిఫికేషన్ వేయాలని డిమాండ్ !
హైదరాబాద్‌లో నిరుద్యోగుల మెరుపు ధర్నా- 19వేల పోలీస్‌ ఉద్యోగాలతో నోటిఫికేషన్ వేయాలని డిమాండ్ !
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Advertisement

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
CWG India Analysis: గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
Nithiin Nani : హీరో నితిన్... ప్రొడ్యూసర్ నాని - రోహిణి వైఫ్ ఆఫ్ కృష్ణ... వి'చిత్ర' ప్రేమ కథ
హీరో నితిన్... ప్రొడ్యూసర్ నాని - రోహిణి వైఫ్ ఆఫ్ కృష్ణ... వి'చిత్ర' ప్రేమ కథ
Breaking News: కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
Embed widget