వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అంటున్న క్రికెట్ అభిమానులకు ఇదొక గుడ్ న్యూస్. టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కేవలం వన్డే ఫార్మాట్‌పైనే పూర్తి దృష్టి పెట్టారు. 2027 వన్డే ప్రపంచకప్‌లో ఈ ఇద్దరు లెజెండ్స్ ఆడటం ఖాయమనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే, కేవలం ఒక్క ఫార్మాట్ మాత్రమే ఆడుతుండటంతో వీరికి ప్రతీ మ్యాచ్‌లోనూ రాణించడం సవాల్‌గా మారనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.