అన్వేషించండి

West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?

BHAVYA Rasayan Chemical Park: బెంగాల్‌లో సువేందు అధికారి నేతృత్వంలో పారిశ్రామిక విప్లవం? కేంద్రం భవ్య రసాయన్ ప్రాజెక్టుతో గుజరాత్, మహారాష్ట్రలకు ధీటుగా నిలబడాలనుకుంటున్నారు.

Bengal vs Gujarat Dahej Model Industry: ఒకప్పుడు భారత పారిశ్రామిక పటంలో అగ్రస్థానంలో వెలిగిన పశ్చిమ బెంగాల్, గత కొన్ని దశాబ్దాలుగా మౌలిక వసతుల లేమి, భూసేకరణ వివాదాలు , విధానపరమైన నిరోధకత వల్ల తన ఆధిపత్యాన్ని కోల్పోతూ వచ్చింది. హల్దియా, డ్యాంకుణి వంటి ప్రాంతాలు జూట్, ఇంజనీరింగ్, పెట్రోకెమికల్ రంగ్లాలో చరిత్ర సృష్టించినప్పటికీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఇంటిగ్రేటెడ్ పారిశ్రామిక పార్కులు  లేకపోవడం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పెద్ద ఆటంకంగా మారింది. బీజేపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన సీఎం  సువేందు అధికారి నేతృత్వంలో బెంగాల్‌ను మళ్లీ పారిశ్రామిక ప్రగతి పథంలోకి తెచ్చేందుకు రూపుదిద్దుకుంటున్న ప్లాన్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయ, ఆర్థిక వర్గాల్లో వేడి పుట్టిస్తోంది.

భవ్య రసాయన్ రసాయన పార్కుల్లో ఒకటి బెంగాల్‌కు!

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భవ్య రసాయన్  పథకం కింద దేశవ్యాప్తంగా కేవలం మూడు అత్యాధునిక రసాయన పార్కులను  నిర్మించాలని నిర్ణయించారు. ఇందులో ఒక పార్కును పశ్చిమ బెంగాల్‌లోని హల్దియా-నందిగ్రామ్ బెల్ట్‌లో సాధించుకోవడం ద్వారా రాష్ట్ర రూపురేఖలు మార్చవచ్చని సువేందు వర్గాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి.  గతంలో సింగూరు, నందిగ్రామ్ సంఘటనల తర్వాత పశ్చిమ బెంగాల్ పేరు చెప్పగానే పారిశ్రామికవేత్తలు వెనకడుగు వేసే పరిస్థితి ఏర్పడింది. అయితే, గుజరాత్‌లోని  దహేజ్ కెమికల్ కాంప్లెక్స్ తరహాలో ఒకే చోట నీరు, నిరంతర విద్యుత్, ప్లగ్ అండ్ ప్లే మోడల్, గ్రీన్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సదుపాయాలు కల్పిస్తే గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షించడం బెంగాల్‌కు పెద్ద కష్టమేమీ కాదు. ముఖ్యంగా సువేందు ప్రాతినిధ్యం వహిస్తున్న నందిగ్రామ్, హల్దియా ప్రాంతాలకు ఉన్న సహజసిద్ధమైన పోర్టు కనెక్టివిటీ, సముద్ర మార్గాలు ఈ ప్రాజెక్టుకు అతిపెద్ద ప్లస్ పాయింట్‌గా మారనున్నాయి.

పారిశ్రామికంగా వెనుకబడిన బెంగాల్

ఈ విప్లవాత్మక కెమికల్ పార్క్ కనుక రూపుదిద్దుకుంటే, కేవలం రసాయన పరిశ్రమలకే పరిమితం కాకుండా ఫార్మా, ప్లాస్టిక్స్, ఆటోమోటివ్ విడిభాగాలు, బ్యాటరీ టెక్నాలజీ, ప్యాకేజింగ్ వంటి అనేక అనుబంధ రంగాలు రూపుదిద్దుకుంటాయి. ఇది జరిగితే, ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న బెంగాలీ యువతకు స్థానికంగానే వేలాది ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయి. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు వంటి పారిశ్రామిక దిగ్గజ రాష్ట్రాలతో బెంగాల్ పోటీ పడాలంటే ఇలాంటి భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులు అత్యంత అవసరం.  ఆధునిక పారిశ్రామిక వేగం పర్యావరణ పరిరక్షణను బలికోరకూడదనే స్పష్టమైన విజన్‌ను ఈ నమూనా ప్రతిపాదిస్తోంది. రసాయన పరిశ్రమల వల్ల వచ్చే వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ , కఠినమైన కాలుష్య నిరోధక విధానాలు అమలైనప్పుడే ఇది సుస్థిర అభివృద్ధిగా మారుతుంది. పర్యావరణాన్ని కాపాడుకుంటూనే పరిశ్రమలను నడపవచ్చనే ఆధునిక విధానానికే ఈ ప్రతిపాదిత ప్రాజెక్టు ప్రాధాన్యత ఇస్తోంది.

సీఎం సువేందు ప్రత్యేక ప్రయత్నాలు

 బెంగాల్ పునర్వైభవం సాధించడానికి ఇప్పుడు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. డబుల్ఇంజిన్సర్కార్ ఏర్పడింది.  విధానపరమైన పారదర్శకత, సింగిల్ విండో అనుమతులు, పెట్టుబడిదారుల్లో నమ్మకం పెంపొందించడం ద్వారా మాత్రమే బెంగాల్‌ను మళ్లీ పారిశ్రామిక శక్తిగా మార్చడం సాధ్యమవుతుంది. సువేందు అధికారి ప్రతిపాదిస్తున్న ఈ పారిశ్రామిక విజన్ కనుక క్షేత్రస్థాయిలో ఆచరణలోకి వస్తే, అది బెంగాల్ ఆర్థిక రంగానికి సరికొత్త దిశను నిర్దేశిస్తుదనడంలో సందేహం లేదని అంటున్నారు. 
 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Ongole Politics: కూటమి ఎమ్మెల్యేనే టార్గెట్ చేస్తున్న బాలినేని - కోవర్ట్ అంటున్న దామచర్ల - టీడీపీ, జనసేనకు మరో గండం తప్పదా?
కూటమి ఎమ్మెల్యేనే టార్గెట్ చేస్తున్న బాలినేని - కోవర్ట్ అంటున్న దామచర్ల - టీడీపీ, జనసేనకు మరో గండం తప్పదా?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
AP Assembly: అసెంబ్లీకి రాకుండా ముట్టడి అంటే అనర్హతే - వైసీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ కఠిన చర్యలకు రెడీ అయ్యారా?
అసెంబ్లీకి రాకుండా ముట్టడి అంటే అనర్హతే - వైసీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ కఠిన చర్యలకు రెడీ అయ్యారా?
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Embed widget