అన్వేషించండి

Why TMC MPs Not Joined BJP: బీజేపీలో చేరలేదు - తృణమూల్‌ను లాక్కోలేదు - బెంగాల్ తిరుగుబాటు ఎంపీల మాస్టర్ ప్లాన్ ఊహించనిదే !

Shiv Sena NCP Vs TMC Legal Case: లోక్‌సభలో తృణమూల్ ఎంపీలు నేరుగా బీజేపీలో చేరకుండా, అసలైన టీఎంసీ అని క్లెయిమ్ చేయకుండా అనామక NCPI పార్టీలో విలీనం అయ్యారు. దీని వెనుక మాస్టర్ ప్లాన్ ఏంటి?

NCPI Merger Strategy Amit Shah: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ కి చెందిన 20 మంది తిరుగుబాటు ఎంపీలు నేరుగా దేశంలోనే అత్యంత బలమైన అధికార పార్టీ అయిన బీజేపీలో చేరకుండా, ఎవరికీ తెలియని ఎన్‌సీపీఐ అనే అనామక పార్టీలో విలీనం కావడం వెనుక భారత రాజ్యాంగం, చట్టాల్లోని లూప్‌హోల్స్‌తో కూడిన ఒక మైండ్ బ్లోయింగ్ పొలిటికల్ మైండ్ గేమ్ ఉంది. చాలా మందికి  బీజేపీలో ఎందుకు విలీనం కాలేదు? లేదా శివసేన, ఎన్సీపీ తరహాలో ‘మాదే అసలైన టీఎంసీ’ అని ఎందుకు క్లేయిమ్ చేసుకోలేదు? అన్న సందేహాలున్నాయి. 

 నేరుగా బీజేపీలో ఎందుకు చేరలేదు?  

తిరుగుబాటు ఎంపీలు నేరుగా బీజేపీలో చేరిపోతే, పశ్చిమ బెంగాల్ సెంటిమెంట్‌ను మమతా బెనర్జీ  సులభంగా వాడుకోగలరు.  బీజేపీ భయపెట్టి, మా ఎంపీలను కొనేసింది అంటూ బెంగాలీ ప్రజల్లో ఆమె సానుభూతి పొందే అవకాశం ఉంది. అందుకే,  వీరంతా తృణమూల్ కాంగ్రెస్ నుంచి విడిపోయి, బెంగాల్ చిరునామాగా ఉన్న  ఎన్‌సీపీఐ పార్టీని  టేకోవర్  చేసుకున్నారు. కాకోలి ఘోష్ దస్తీదార్ వంటి సీనియర్ తిరుగుబాటు నేత ముందే ఎన్‌సీపీఐ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టడం ఇందులో భాగమే. దీనివల్ల మేము బెంగాల్ ప్రయోజనాల కోసమే ప్రత్యేకంగా నిలబడ్డాం అని చెప్పుకోవడానికి, అదే సమయంలో కేంద్రంలోని ఎన్డీయే  కూటమికి మద్దతు ఇవ్వడానికి వీలు పడుతుంది.

 శివసేన, ఎన్సీపీ లాగా  మాదే అసలైన టీఎంసీ  అని ఎందుకు అనలేదు? 

మహారాష్ట్రలో ఏకనాథ్ షిండే , అజిత్ పవార్  తరహాలో వీరు క్లెయిమ్ చేయకపోవడానికి ప్రధాన కారణం.. సుప్రీంకోర్టు ఇటీవలి తీర్పులు , ఎన్నికల కమిషన్ నిబంధనలు అనుకోవచ్చు.  కేవలం ఎంపీల మెజార్టీ సరిపోదు, శివసేన, ఎన్సీపీ కేసుల్లో కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రమే కాదు, పార్టీ ప్రాథమిక సభ్యులు, జిల్లా అధ్యక్షులు, క్షేత్రస్థాయి క్యాడర్  కూడా తమ వైపు ఉన్నారని వారు నిరూపించుకోగలిగారు.  టీఎంసీ విషయంలో పశ్చిమ బెంగాల్‌లోని అట్టడుగు క్యాడర్, జిల్లా కమిటీలు, మున్సిపల్ కౌన్సిలర్లు ఇప్పటికీ మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీల గుప్పిట్లోనే ఉన్నారు. కేవలం ఢిల్లీలో ఉన్న 20 మంది ఎంపీలు తిరుగుబాటు చేసినంత మాత్రాన  మాదే అసలైన టీఎంసీ  అంటే ఎన్నికల కమిషన్ ఒప్పుకోదు. పైగా ఆ లీగల్ ఫైట్ తెమలడానికి ఏళ్ల సమయం పడుతుంది. చట్టం ప్రకారం కేవలం ఒక పార్టీకి చెందిన రెండు వంతుల  ప్రజాప్రతినిధులు విడిపోతే సరిపోదు. ఆ విడిపోయిన గ్రూప్ ఖచ్చితంగా మరొక రాజకీయ పార్టీలో విలీనం  కావాలి. అప్పుడే వారిపై అనర్హత వేటు పడదు.
 
 ఎన్‌సీపీఐ ను ఒక షెల్ కంపెనీ లా ఎందుకు వాడుకున్నారు? 

తిరుగుబాటు ఎంపీలకు తమ పదవులు ఊడిపోకుండా ఉండాలంటే తక్షణమే ఒక రిజిస్టర్డ్ రాజకీయ పార్టీ కావాలి. కొత్త పార్టీ పెట్టాలంటే ఎలక్షన్ కమిషన్ చుట్టూ తిరగాలి, దానికి చాలా సమయం పడుతుంది. ఈ లోగా మమతా బెనర్జీ వీరిపై అనర్హత వేటు వేయించే ప్రమాదం ఉంది. అందుకే, 2023లో రిజిస్టర్ అయ్యి, ఎలాంటి ఆస్తులు లేదా క్రియాశీల క్యాడర్ లేని ఎన్‌సీపీఐ ని ఒక చట్టపరమైన రక్షణ కవచం  లా వాడుకున్నారు. ఒక వ్యాపారవేత్త నష్టాల్లో ఉన్న చిన్న కంపెనీని కొనుగోలు చేసి తన వ్యాపారాన్ని విస్తరించుకున్నట్లు.. ఈ 20 మంది ఎంపీలు ఎన్‌సీపీఐ లోకి విలీనమై, రాత్రికి రాత్రే ఆ పార్టీని పార్లమెంట్‌లో 5వ అతిపెద్ద శక్తిగా మార్చేశారు.

 మిత్రపక్షంగా ఉంచితేనే బీజేపీకి లాభం! 

ఈ మొత్తం డ్రామా వెనుక అమిత్ షా మాస్టర్ ప్లాన్ ఉందని ఎక్కువ మంది నమ్మకం. ఈ 20 మంది ఎంపీలను బీజేపీలో చేర్చుకుంటే లోక్‌సభలో బీజేపీ బలం 260 కి పెరుగుతుంది. కానీ, దానికంటే వారిని ఎన్‌సీపీఐ అనే ప్రత్యేక మిత్రపక్షంగా ఉంచడం వల్ల ఎన్డీయే కూటమిలో ఎక్కువ లాభం ఉంది. కూటమిలో చంద్రబాబు , నితీష్ కుమార్ లపైనే పూర్తిగా ఆధారపడకుండా, తమకు విధేయులుగా ఉండే 20 మంది ఎంపీల ఎన్‌సీపీఐ గ్రూప్‌ను ఎన్డీయేలో చేర్చడం ద్వారా బీజేపీ తన బేరసారాల శక్తిని పెంచుకుంది. జైరాం రమేష్ విమర్శించినట్లు.. ఎన్డీయేలో టీడీపీ ప్రాధాన్యతను తగ్గించడానికి ఇదొక వ్యూహాత్మక అడుగు అనుకోవచ్చు. సుప్రీంకోర్టు కోరల్లో చిక్కుకోకుండా, మమతా బెనర్జీకి లీగల్ ఛాన్స్ ఇవ్వకుండా, బెంగాల్ సెంటిమెంట్‌ దెబ్బతినకుండా మరియు కేంద్రంలో బీజేపీకి పూర్తి విధేయులుగా ఉంటూనే సొంత అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఎన్‌సీపీఐ విలీనం అనేది అత్యంత వ్యూహాత్మకమైన, లీగల్ సేఫ్ రూట్. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Vijay Delimitation Meeting: తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌ను బహిష్కరించిన 37 మంది ఎంపీలు
తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌కు 37 మంది ఎంపీలు డుమ్మా!
Polavaram Banakacherla Project : పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?
పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?
Ambati Rambabu Padayatra Postponed : వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?
వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
HYDRA Jobs: ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి! హైడ్రా జాబ్స్ కోసం వచ్చిన అభ్యర్థులపై దురుసు ప్రవర్తన
ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి! హైడ్రా జాబ్స్ కోసం వచ్చిన అభ్యర్థులపై దురుసు ప్రవర్తన
Embed widget