West Bengal TMC Political Crisis 2026: బెంగాల్ రాజకీయాల్లో మహారాష్ట్ర సీన్ - టీఎంసీలో ఓ షిండే రెడీ - మమతా బెనర్జీకి 50 మంది ఎమ్మెల్యేలు షాకిస్తారా?
50 TMC MLAs Revolt : పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అధికార టీఎంసీ పార్టీలో భారీ సంక్షోభం నెలకొంది. మహారాష్ట్ర శివసేన తరహాలోనే మమతా బెనర్జీ పార్టీ , గుర్తును కోల్పోయే ప్రమాదం కనిపిస్తోంది.

Mamata Banerjee Loses Party Symbol To Rebel MLAs: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. దేశంలోనే అత్యంత శక్తివంతమైన ప్రాంతీయ పార్టీగా, మమతా బెనర్జీ ఉక్కుపిడికిలిలో ఉన్న అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రస్తుతం చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యంత తీవ్రమైన అంతర్గత సంక్షోభంలో మునిగిపోయింది. మహారాష్ట్రలో గతంలో శివసేన ఏకనాథ్ షిండే వర్గం తరహాలోనే ఇప్పుడు బెంగాల్‌లోని టీఎంసీలో కూడా నిలువునా చీలిక వచ్చే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
చిచ్చు పెట్టిన ప్రతిపక్ష నేత ఎంపిక
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎంపిక అంశం తృణమూల్ కాంగ్రెస్‌లో దశాబ్దాల నాటి అసంతృప్తిని ఒక్కసారిగా బద్దలు కొట్టింది. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ తన అత్యంత నమ్మకస్థుడైన సీనియర్ నేత శోభన్‌దేబ్ ఛటోపాధ్యాయను ఈ పదవికి ఎంపిక చేయాలని భావించారు. అయితే, పార్టీలోని మెజారిటీ ఎమ్మెల్యేలు మాత్రం మమత ఏకపక్ష నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీలో తిరుగుబాటు జెండా ఎగురవేసిన యువ నేత రితబ్రత బెనర్జీకి మెజారిటీ శాసనసభ్యులు మద్దతుగా నిలవడంతో ఈ వివాదం అధిష్టానం వర్సెస్ ఎమ్మెల్యేలుగా మారిపోయింది.
50 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు - షిండే ఫార్ములా
దాదాపు 50 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు రితబ్రత బెనర్జీ నాయకత్వంలో ప్రత్యేక క్యాంప్‌గా ఏర్పడ్డారు. ఇది కేవలం ఒక పదవి కోసం జరుగుతున్న పోరాటం కాదని, పార్టీలో దీర్ఘకాలంగా మమతా బెనర్జీ , ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీల ఒంటెద్దు పోకడలపై ఉన్న నిశ్శబ్ద తిరుగుబాటు అని భావిస్తున్నారు. యాంటీ డిఫెక్షన్ లా పరిధిలోకి రాకుండా ఉండేందుకు అవసరమైన సంఖ్యాబలాన్ని సమకూర్చుకుని, అసెంబ్లీలో తామే అసలైన తృణమూల్ కాంగ్రెస్ అని క్లెయిమ్ చేయడానికి తిరుగుబాటు వర్గం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
పార్టీ గుర్తు, పేరు కూడా కోల్పోయే ప్రమాదం
మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరేకు ఎదురైన పరాభవమే ఇప్పుడు మమతా బెనర్జీకి కూడా ఎదురయ్యేలా కనిపిస్తోంది. తిరుగుబాటు వర్గం గనుక మూడింట రెండు వంతుల ఎమ్మెల్యేల మద్దతుతో కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిస్తే.. సాంకేతికంగా మమతా బెనర్జీ అధికారిక పార్టీ పేరును, జోడు పువ్వులు గుర్తును కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. బెంగాల్ రాజకీయాల్లో దశాబ్దాలుగా ఏకఛత్రాధిపత్యం చలాయించిన మమతకు.. తన సొంత ఎమ్మెల్యేల నుంచే ఇలాంటి సునామీ వస్తుందని ఊహించకపోవడం ఆమె వ్యూహాత్మక లోపంగా కనిపిస్తోంది.
VIDEO | Expelled TMC leader Ritabrata Banerjee says, "We are the principal opposition, urge Mamata Banerjee to be our chief advisor; Abhishek Banerjee has no connection with state assembly."
— Press Trust of India (@PTI_News) June 3, 2026
The rebellion within the TMC took a decisive turn on Wednesday, as 58 dissident MLAs… pic.twitter.com/2rDJ3XZnOJ
దిక్కుతోచని స్థితిలో దీదీ - క్యాడర్‌లో గందరగోళం
ప్రస్తుతం మమతా బెనర్జీ రౌండ్ ది క్లాక్ పార్టీ సీనియర్లతో అత్యవసర సమావేశాలు నిర్వహిస్తున్నారు. తిరుగుబాటు దారులు మాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఇప్పటికే రితబ్రతతో పాటు మరో ఎమ్మెల్యేని పార్టీ నుంచి బహిష్కరించారు. మహారాష్ట్ర తరహాలోనే తిరుగుబాటు వర్గం చట్టపరంగా విజయం సాధిస్తే.. బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీ యుగం ముగిసిపోయినట్లేనని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. రాబోయే 48 గంటలు పశ్చిమ బెంగాల్ భవిష్యత్తును మార్చబోయే అత్యంత కీలకమైన సమయంగా మారనున్నాయి.
Before You Go
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















