అన్వేషించండి

Ambati Rambabu Padayatra Postponed : వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?

Ambati Rambabu Vinathi Padayatra: అంబటి రాంబాబు వినతి పాదయాత్ర రద్దు వెనుక జగన్ ఆదేశాలు ఉన్నాయా? వైసీపీలో నేతల వ్యక్తిగత మైలేజ్ పోరుపై అధిష్టానం సీరియస్ అయిందా?

YSRCP Internal Politics : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  లో మాజీ మంత్రి, సీనియర్ నేత అంబటి రాంబాబు తలపెట్టిన వినతి పాదయాత్ర ఆకస్మికంగా నిలిచిపోవడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. గుంటూరులోని తన నివాసం నుండి మంగళగిరి డీజీపీ కార్యాలయం వరకు ఈ రెండు రోజుల పాదయాత్రకు ఆయన అంతా సిద్ధం చేసుకున్న తరుణంలో అధిష్టానం జోక్యంతో అది రద్దయింది.   ఒక సీనియర్ నేత ఆందోళన కార్యక్రమానికి బ్రేకులు పడటం వెనుక వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మార్క్ పొలిటికల్ కమాండ్ ఉందన్నప్రచారం జరుగుతోంది. 

పార్టీ కార్యక్రమాలను కాదని సొంత కార్యాచరణ

ఈ పరిణామం వెనుక ముఖ్యంగా రెండు రకాల అభిప్రాయాలు బలంగా వినబడుతున్నాయి. కూటమి ప్రభుత్వ విధానాలకు నిరసనగా, పోలీసుల వైఖరిని ఎండగట్టేందుకు అంబటి సొంతంగా కార్యాచరణ ప్రకటించడం ద్వారా వ్యక్తిగత మైలేజ్ పొందే ప్రయత్నం చేశారని పార్టీలోని కొందరు నేతలు జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. పార్టీ అధికారికంగా సమగ్ర నిరసన షెడ్యూల్ , డీఎస్సీ పోరాటాన్ని  చేయకుండానే.. నాయకులు తమ సొంత ఇమేజ్ లేదా నియోజకవర్గ స్థాయి అజెండాలతో రోడ్డెక్కితే అది పార్టీ ఐక్యతను దెబ్బతీస్తుందనేది అధిష్టానం ఆలోచన. జగన్ అనుమతి లేకుండా లేదా పార్టీ అప్రూవల్ లేకుండా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం పట్ల పార్టీ హైకమాండ్ సీరియస్ అయిందని, అందుకే ఈ కార్యక్రమాన్ని వెనక్కి తీసుకోమని స్పష్టమైన సంకేతాలు వెళ్లినట్లు సమాచారం.

నేతల సొంత మైలేజీ ప్రయత్నాలు వైసీపీలో నడవవు!

వైసీపీ కార్యశైలిని మొదటి నుంచి గమనిస్తే, అక్కడ సెంట్రలైజ్డ్ కమాండ్ కంట్రోల్ నడుస్తుందనేది బహిరంగ సత్యం. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విధానాల ప్రకారం పార్టీలో నేతలు ఎవరైనా సరే.. అది మాజీ మంత్రులైనా, రీజినల్ కోఆర్డినేటర్లైనా పార్టీ అధిష్టానం నిర్ణయించిన గీత దాటకూడదు. సొంతంగా రాజకీయ నిర్ణయాలు తీసుకోవడం లేదా సొంత వేదికలపై నుంచి ప్రత్యేక మైలేజ్ పొందే వ్యూహాలను వైసీపీ సంస్కృతి ప్రోత్సహించదు. గతంలో కూడా పలువురు నాయకులు తమ నియోజకవర్గాల్లో పార్టీ అనుమతి లేకుండా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినప్పుడు అధిష్టానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన దాఖలాలు ఉన్నాయి.

పార్టీ కార్యక్రమాలే ముఖ్యమని సంకేతం!

ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నిరసనలు, పోరాటాలు అన్నీ  సమిష్టిగా జరగాలని, ఎవరికి వారే ఇండివిజువల్ షోలు చేస్తే అది ప్రధాన సమస్య దిశను మళ్లిస్తుందనే అభిప్రాయం ఉంది. అంబటి రాంబాబు పాదయాత్ర చేయడం ద్వారా పోలీసులు లేదా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉన్నప్పటికీ, అది ఒక వ్యక్తి చొరవగా వార్తల్లోకి వెళ్లి పార్టీ వ్యవస్థ కంటే నాయకుడే హైలైట్ అవుతారని జగన్ భావించి ఉండవచ్చని పొలిటికల్ సర్కిల్స్ గుసగుసలాడుతున్నాయి. పార్టీ ఆందోళనలైనా, వైఎస్సార్‌సీపీ జెండా కింద జరిగే పోరాటాలైనా జగన్ నిర్ణయించిన రూట్‌ మ్యాప్‌లోనే జరగాలి  అనే సంకేతాన్ని ఈ ఘటన ద్వారా మరోసారి స్పష్టం చేశారు. ఈ నిర్ణయం పట్ల పార్టీ శ్రేణుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఓటమి తర్వాత ప్రభుత్వంపై పోరాడేందుకు సీనియర్ నేతలు చొరవ తీసుకుంటున్న సమయంలో, ఇలాంటి ఆంక్షలు విధించడం వల్ల నాయకుల్లో ఉత్సాహం తగ్గుతుందనే అభిప్రాయం ఒక వర్గం నుంచి వస్తోంది. పార్టీ అధికారిక కార్యక్రమాల కోసమే వేచి చూస్తే క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే అవకాశాలు చేజారిపోతాయని, నేతలకు కొంత స్వయం ప్రతిపత్తి ఇస్తేనే పార్టీ మళ్లీ పుంజుకుంటుందని వారు వాదిస్తున్నారు.

పార్టీ అనుమతితో చేస్తానంటున్న రాంబాబు

అంబటి రాంబాబు పాదయాత్ర రద్దు వ్యవహారం వైసీపీలోని అంతర్గత నియంత్రణను, నాయకత్వ శైలిని మరోసారి తెరపైకి తెచ్చింది. ప్రతిపక్ష హోదాలో ఉన్న సమయంలో నాయకులు వ్యక్తిగత మైలేజ్ కంటే పార్టీ సమష్టి ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వాలని, 'జగన్ నిర్ణయమే తుది నిర్ణయం' అనే నియమాన్ని మరోసారి నిరూపించినట్లయింది. రాబోయే రోజుల్లో కేవలం అధిష్టానం ఖరారు చేసే కార్యాచరణతోనే వైసీపీ నేతలు రోడ్డెక్కుతారా లేదా క్షేత్రస్థాయి పోరాటాలకు కొంత వెసులుబాటు లభిస్తుందా అనేది వేచి చూడాలి. పార్టీ అనుమతితో మళ్లీ పాదయాత్ర చేయాలని రాంబాబు టార్గెట్ గా పెట్టుకున్నారు.  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ambati Rambabu Padayatra Postponed : వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?
వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?
Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
Embed widget