అన్వేషించండి

Ambati Rambabu farmhouse controversy: మళ్లీ వస్తానని రాజమండ్రి జైలు అధికారులకు చెప్పే వచ్చా - అంబటి రాంబాబు ప్రకటన దేని కోసమంటే ?

Ambati Rambabu farmhouse: అంబటి రాంబాబుకు సత్తెనపల్లిలో ఉన్న 22 ఎకరాల ఫాంహౌస్ కు అధికారులు నోటీసులు జారీ చేశారు. అక్రమంగా స్విమ్మింగ్ ఫూల్, లగ్జరీ ఇల్లు కట్టారని సర్వే చేయాల్సి ఉందని తెలిపారు.

Ambati Rambabu alleges that the government has targeted his assets:  మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఫాంహౌస్‌కు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన సర్వే నోటీసులు హాట్ టాపిక్ గా మారాయి. 
సత్తెనపల్లి నియోజకవర్గంలో అంబటి రాంబాబుకు ఉన్న సుమారు 22 ఎకరాల పొలానికి సంబంధించి రెవెన్యూ అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు. రీజినల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల ఆదేశాల మేరకు ఈ పొలాన్ని, అందులోని నిర్మాణాలను సర్వే చేయాల్సి ఉందని ఎమ్మార్వో కార్యాలయం స్పష్టం చేసింది. ఈ ఫాంహౌస్‌లో నిబంధనలకు విరుద్ధంగా లగ్జరీ గెస్ట్ హౌస్, స్విమ్మింగ్ పూల్ నిర్మించారనే ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తోంది. అంబటి స్వయంగా ఈ నోటీసుల విషయాన్ని ధృవీకరించారు.

రాజకీయ కక్షసాధింపేనన్న అంబటి 

ప్రభుత్వ చర్యలపై అంబటి రాంబాబు తీవ్రంగా మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం తనపై, తన కుటుంబంపై పక్షపాతంతో వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ఇప్పటికే తనపై భౌతిక దాడులకు దిగారని, ఇప్పుడు తన ఆస్తులను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన పొలాన్ని సర్వే చేయడం అంటే తన వ్యక్తిగత స్వేచ్ఛపై దాడి చేయడమేనని ఆయన అభివర్ణించారు.  రేపు మా ఇంటికి కూడా నోటీసులు ఇస్తారేమో  అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. త

లీగల్‌గా కొన్న పొలమేనని స్పష్టీకరణ 

ఈ 22 ఎకరాల పొలాన్ని తాను చట్టబద్ధంగా  కొనుగోలు చేశానని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. తన దగ్గర దాచడానికి ఏమీ లేదని, తాను ఆ పొలాన్ని కొనే ముందే అందులో ఒక చిన్న బావి, పెంకుటిల్లు ఉన్నాయని వివరించారు. అధికారులు చెబుతున్నట్లుగా అక్రమ నిర్మాణాలు ఏవీ అక్కడ లేవని ఆయన వాదిస్తున్నారు. కావాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ స్వయంగా వచ్చి తన పొలాన్ని చూడవచ్చని, తనకు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని సవాల్ విసిరారు. తాను మళ్లీ వస్తానని రాజమండ్రి జైలు అధికారులకు చెప్పి వచ్చానన్నారు. అధికారం శాశ్వతం కాదని, కూటమి ప్రభుత్వం తనను భయపెట్టలేదని అంబటి రాంబాబు హెచ్చరిస్తున్నారు.

గత ఐదేళ్ల సంపాదనపై విమర్శలు 

అంబటి రాంబాబు సొంత ఊరు రేపల్లె అయినప్పటికీ, ఆయన సత్తెనపల్లిలో భారీగా భూములు కూడబెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. కేవలం ఐదేళ్ల ఎమ్మెల్యే పదవీ కాలంలోనే ఇన్ని ఎకరాల భూమిని ఎలా సంపాదించారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం కేవలం చట్టపరమైన విచారణే చేస్తోందని కూటమి నేతలు చెబుతుంటే.. తనను రాజకీయంగా దెబ్బతీయడానికే ఇలా చేస్తున్నారని అంబటి అంటున్నారు. ఆస్తులన్నీ సక్రమంగా ఉంటే అధికారుల సర్వేకు సహకరించకుండా ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు. అధికారుల సర్వే తర్వాత ఈ 22 ఎకరాల భూమి చుట్టూ ఉన్న చిక్కుముడులు వీడే అవకాశం ఉంది. ఒకవేళ ఏవైనా నిబంధనల ఉల్లంఘనలు బయటపడితే మాజీ మంత్రికి మరిన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు.                

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ambati Rambabu farmhouse controversy: మళ్లీ వస్తానని రాజమండ్రి జైలు అధికారులకు చెప్పే వచ్చా - అంబటి రాంబాబు ప్రకటన దేని కోసమంటే ?
మళ్లీ వస్తానని రాజమండ్రి జైలు అధికారులకు చెప్పే వచ్చా - అంబటి రాంబాబు ప్రకటన దేని కోసమంటే ?
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Christian controversy in AP Legislative Council: శాసనమండలిలో క్రిస్టియన్ అంశంపై దుమారం - క్షమాపణ చెప్పిన అచ్చెన్న - అసలేం జరిగిందంటే?
శాసనమండలిలో క్రిస్టియన్ అంశంపై దుమారం - క్షమాపణ చెప్పిన అచ్చెన్న - అసలేం జరిగిందంటే?
Advertisement

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
ఇరాన్‌-అమెరికా యుద్ధం: బ్యారెల్‌కు ఒక్క డాలర్‌ పెరిగినా ₹12,000 కోట్ల అదనపు భారం - మన పెట్రోల్‌ బడ్జెట్‌పై ప్రభావం ఎంత?
ఇరాన్‌-అమెరికా యుద్ధం: ఇండియాలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతాయా? ఆటో ఇండస్ట్రీకి హెచ్చరిక సంకేతాలు
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
US Shooting: అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
Palamaner Latest News:తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
Embed widget