అన్వేషించండి

Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!

కాలిఫోర్నియాలోని డొనాల్డ్‌ ట్రంప్‌ గోల్ఫ్‌ క్లబ్‌ వెలుపల ఆయుధాలతో సంచరిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద లోడెడ్‌ గన్‌తోపాటు అతడి నివాసంలో ఆయుధాలు, బుల్లెట్‌లు లభించాయి. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ట్రంప్ పర్యటనకు ముందే గోల్ఫ్ క్లబ్ వద్ద ఒకరు పట్టుబడ్డారు.
  • నిందితుడి వద్ద ఆయుధాలు, కారులో లోడెడ్ పిస్టల్ లభించాయి.
  • ఇంట్లో భారీ ఆయుధాలు, బుల్లెట్ ప్రూఫ్, దాడుల నోట్స్ స్వాధీనం.
  • హత్యాయత్న కుట్ర ఆరోపణలతో నిందితుడిపై తీవ్ర కేసులు నమోదు.

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ హత్యకు కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. లాస్‌ఏంజిల్స్‌ సమీపంలోని రంచోపాలోస్‌ వెర్డెస్‌ వద్ద ఉన్న ట్రంప్‌ నేషనల్‌ గోల్ఫ్‌ క్లబ్‌ వెలుపల ఆయుధాలతో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఒక వ్యక్తిని భద్రతా దళాలు అరెస్టు చేశాయి. ట్రంప్ హాజరు కావాల్సిన కార్యక్రమం జరిగే రెండు రోజుల ముందే ఈ ఘటన జరగం భద్రతా సంస్థలను ఉలిక్కిపడేలా చేస్తోంది. 

కాలిఫోర్నియాలోని గోల్ఫ్‌ కోర్స్‌లో రిపబ్లిక్‌ నేషనల్‌ కమిటీ ఒక కార్యక్రమం నిర్వహించింది. దీనికి ట్రంప్ ప్రధాన అతిథిగా రావాల్సి ఉంది. అయితే ట్రంప్‌ రాకకు 48 గంటల ముందే ఆదివారం నాడు ఒక వ్యక్తి గోల్ఫ్‌ క్లబ్‌ పరిసరాల్లోని భద్రతా ఏర్పాట్లు, సీసీ టీవీలు ఉండే ప్రాంతాలను, సిబ్బంది కదలికలను తన మొబైల్‌ ఫోన్‌‌ ద్వారా ఫొటోలు వీడియోలు తీస్తున్న రికార్డ్ చేయడాన్ని భద్రతా సిబ్బంది గమనించారు. 

వెంటనే అప్రమత్తమైన లాస్ ఏంజిల్స్ కౌంటీ షెరిఫ్‌ పోలీసుల ఆ  వ్యక్తిని అదుపులోకి  తీసుకొని చెక్ చేశారు. ఇందులో వారికి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు ప్యాంటు జేబులో 16 రౌండ్ల తూటాలతో సిద్దంగా ఉన్న ఒక మేగ్‌జైన్ లభించింది. గోల్ఫ్‌ క్లబ్ పార్కింగ్‌లో ఉన్న అతని కారును సోదా చేయగా అందులో ఒక లోడెడ్‌ పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

నిందితుడు ఎవరు?

అరెస్టు అయిన నిందితుడిని కాలిఫోర్నియాలోని డౌనీ నగరానికి చెందిన జీనైన్‌ జాన్ టేటే గా పోలీసులు గుర్తించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుడిపై ఇప్పటికే ఎల్‌ సెగుండో పోలీస్ స్టేషన్‌లో ఒక దోపిడీ కేసు విచారణలో ఉన్నట్టు తేలింది. ఇంతలో ఆయుధాలతో తిరుగుతూ ఆ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులను తన ఫోన్‌లో రికార్డు చేయడం వెనుక కుట్ర ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. 

నిందితుడి ఇంట్లో భారీగా ఆయుధాలు స్వాధీనం 

నిందితుడి వద్ద లోడెడ్‌ గన్‌ దొరకడంతో ఫెడరల్ ఏజెంట్లు సోమవారం నాడు డౌనీలోని అతడి నివాసంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో లభించిన సామాగ్రిని చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. అక్రమంగా మార్పులు చేసి నాటో కేటగిరీకి చెందిన 45క్యాలిర్‌ పిస్టల్‌ ఒక ఏఆర్ టైప్ షార్ట్‌ బ్యారెల్‌ రైఫిల్‌ లభించాయి. భారీ సంఖ్యలో బుల్లెట్ ఫ్రూఫ్‌ జాకెట్లు, పెద్ద మొత్తంలో తూటాలు, భారీ కెపాసిటీ కలిగిన మేగజైన్‌లను స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో దొరికిన కొన్ని నోట్‌బుక్స్‌లో కన్సర్నింగ్ స్టేట్‌మెంట్స్‌ ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇవి నేరుగా దాడులకు లేదా హత్యాయత్నాలకు సంబంధించిన రాతలు అయి ఉండొచ్చని సమాచారం. 

కోర్టు విచారణ

నిందితుడు జీనైన్‌ జాన్ టేల్‌పై సెకండ్‌ డిగ్రీ రోబర్టీ వాహనంలో అక్రమ ఆయుధాల రవాణా, నిషేధిత షార్ట్ బారెల్‌ రైఫిల్‌ కలిగి ఉండటం వంటి తీవ్రమైన కేసులు నమోదు చేశారు. న్యాయస్థానం అతడికి 2.1 కోట్లు భారీ బెయిల్ మొత్తాన్ని విధించింది. అయితే కోర్టులో హాజరైన నిందితుడు తనపై ఉన్న ఆరోపణలను తోసిపుచ్చాడు.

ట్రంప్‌పై గత దాడులు చరిత్ర 

డొనాల్డ్ ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకొని దాడులు జరగడం ఇది మొదటిసారి కాదు. గడిచిన ఏడాది కాలంలోనే ఆయనపై చాలా సార్లు హత్యాయత్నం జరిగింది. 2024 జులైలో పెన్సిల్వేనియాలోని బట్లర్‌ ర్యాలీ థామస్‌ మాథ్యూ క్రుక్స్‌ జరిపిన కాల్పుల్లో ట్రంప్‌ కుడి చెవికి గాయం కాగా, ఒక పౌరుడు చనిపోయాడు.  అదే ఏడాది సెప్టెంబర్‌లో ఫ్లోరిడాలోని వెస్ట్‌ పామ్‌ బీచ్‌ గోల్ఫ్‌ క్లబ్‌ వద్ద రయాన్‌ వెస్లీ రౌత్‌ అనే వ్యక్తి స్కోప్‌ రైఫిల్‌తో పొదల్లో పొంచి ఉండగా సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు పట్టుకున్నారు.

Frequently Asked Questions

డొనాల్డ్ ట్రంప్ హత్యకు కుట్రను భద్రతా బలగాలు ఎక్కడ భగ్నం చేశాయి?

లాస్ ఏంజిల్స్ సమీపంలోని రంచోపాలోస్ వెర్డెస్ వద్ద ఉన్న ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్ వెలుపల ఈ కుట్రను భగ్నం చేశారు. ట్రంప్ హాజరు కావాల్సిన కార్యక్రమానికి రెండు రోజుల ముందే ఈ ఘటన జరిగింది.

ఈ కుట్రకు సంబంధించి ఎవరు అరెస్టు అయ్యారు?

కాలిఫోర్నియాలోని డౌనీ నగరానికి చెందిన జీనైన్ జాన్ టేటే అనే వ్యక్తిని భద్రతా దళాలు అరెస్టు చేశాయి. అతనిపై గతంలో దోపిడీ కేసు కూడా విచారణలో ఉంది.

అరెస్ట్ అయిన వ్యక్తి వద్ద ఎలాంటి ఆయుధాలు లభించాయి?

నిందితుడి జేబులో 16 రౌండ్ల మేగజైన్, కారులో లోడెడ్ పిస్టల్ దొరికాయి. అతని ఇంట్లో నాటో పిస్టల్, AR-రైఫిల్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, పెద్ద మొత్తంలో తూటాలు లభించాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
India Pakistan:
"భారత ఏజెంట్ పాకిస్థాన్‌లోకి ప్రవేశించి 30 మంది ఉగ్రవాదులను హతమార్చాడు"లష్కర్ కార్యకర్త సంచలన ప్రకటన!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Iran US War: చర్చల కోసం ఇరాన్ మమ్మల్ని అడుక్కుంటోంది, కానీ..! డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనం
చర్చల కోసం ఇరాన్ మమ్మల్ని అడుక్కుంటోంది, కానీ..! డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనం
Advertisement

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
NEET UG 2026 Counselling: ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
The Story of Vizag Old Airport : విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ -
విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ - "INS డేగ" ఇక జ్ఞాపకమేనా !!
Supreme Court On Vehicle Insurance:బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
Embed widget