అన్వేషించండి

Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!

Pithapurams Permanent MLA | పిఠాపురం పర్మినెంట్ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అని టీడీపీ వర్సెస్ జనసేన కొనసాగుతున్న సమయంలో కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి.

Janasena vs TDP in Pithapuram | పిఠాపురం నియోజకవర్గ శాశ్వత ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ ఉంటారని, ఆయన చేస్తున్న అభివృద్ధే అందుకు నిదర్శనమని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురంలో నిర్వహించిన వేడుకల్లో ఎంపీ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో ఇప్పటికే 60,000 మందితో జనసేన ఒక బలమైన కుటుంబంగా మారిందని, త్వరలోనే లక్ష సభ్యత్వాల మార్కును చేరుకుంటామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కేవలం రాష్ట్ర స్థాయి నేత మాత్రమే కాదు, దేశ స్థాయి నాయకుడిగా ఎదిగారని కొనియాడారు. డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల రామస్వామి బాబు కూడా పవన్ కళ్యాణ్ సేవలను కొనియాడుతూ, ఎంపీ వ్యాఖ్యలకు మద్దతు తెలిపారు.

ఘనంగా జనసేన ఆవిర్భావ వేడుకలు - సేవా కార్యక్రమాలు
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పిఠాపురంలో పార్టీ శ్రేణులు పండుగ వాతావరణాన్ని తలపించేలా వేడుకలు నిర్వహించాయి. ఉప్పాడ బస్టాండ్ వద్ద భారీ కేక్ కట్ చేసిన అనంతరం, పిఠాపురం నుండి గొల్లప్రోలు వరకు జనసైనికులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. గొల్లప్రోలులో అట్టహాసంగా జెండా ఆవిష్కరణ జరిగింది. రాజకీయ వేడుకలతో పాటు సేవా నిరతిని చాటుకుంటూ, పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఫైవ్ మెన్ కమిటీ సభ్యులు ఓదూరి కిషోర్ సహా భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.


Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!

నియోజకవర్గంలో రాజకీయ సెగలు: టీడీపీ వర్సెస్ జనసేన?
అయితే, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యల వెనుక పిఠాపురం నియోజకవర్గంలో సాగుతున్న అంతర్గత రాజకీయ పోరు కారణమనే చర్చ నడుస్తోంది. ఇటీవల ఒక ప్రభుత్వ కార్యక్రమంలో ఫ్లెక్సీపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో చిన్నదిగా ఉండటంపై టీడీపీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ అధికారులపై, జనసేన నేతలపై మండిపడ్డారు. ముఖ్యమంత్రికి ప్రాధాన్యత లేని చోట టీడీపీ కార్యకర్తలకు స్థానం ఎక్కడిదని ఆయన ప్రశ్నిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కూటమి నాయకులు రాష్ట్ర స్థాయిలో కలిసి ఉన్నప్పటికీ, పిఠాపురంలో మాత్రం టీడీపీ, జనసేన నేతల మధ్య 'కోల్డ్ వార్' నడుస్తోందని స్థానికులు చర్చించుకుంటున్నారు. వర్మ అసహనానికి కౌంటర్ గానే ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ "శాశ్వత ఎమ్మెల్యే" వ్యాఖ్యలు చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అసలేం జరిగింది.. వర్మ కోపానికి కారణమేంటి..

పిఠాపురంలో శుక్రవారం జరిగిన 'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర' కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. మున్సిపల్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో చాలా చిన్నదిగా ఉండటంపై మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్రంగా మండిపడ్డారు. అధికారులే కూటమి పార్టీల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మున్సిపల్ కమిషనర్‌ను నిలదీశారు. ఇది కేవలం తనను మాత్రమే కాకుండా, మూడు పార్టీల నాయకులను అవమానించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. పిలిచి అవమానించడం తగదని సూచిస్తూ, అధికారుల తీరుకు నిరసనగా ఆయన సమావేశం మధ్యలోనే వెళ్ళిపోయారు. వర్మకు మద్దతుగా టీడీపీ కార్యకర్తలు కూడా అధికారుల వ్యవహారశైలిపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan vs Prakash Raj: డీలిమిటేషన్ బిల్లుపై ఢీ అంటే ఢీ! పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్‌ మధ్య సోషల్ మీడియా వార్!
డీలిమిటేషన్ బిల్లుపై ఢీ అంటే ఢీ! పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్‌ మధ్య సోషల్ మీడియా వార్!
Vasamsetti Subhash : మంత్రి వాసంశెట్టి సుభాష్‌ ఇలాఖాలో తండ్రి పెత్త‌నం! టీడీపీకి న‌ష్టం జరుగుతోందని కేడర్‌ అసహనం!
మంత్రి వాసంశెట్టి సుభాష్‌ ఇలాఖాలో తండ్రి పెత్త‌నం! టీడీపీకి న‌ష్టం జరుగుతోందని కేడర్‌ అసహనం!
Dindi - Chinchinada Bridge: నెల‌లు దాటినా పూర్తికాని దిండి- చించినాడ వంతెన మ‌ర‌మ్మ‌త్తు ప‌నులు! ఇబ్బందులు పడుతున్న జనం!
నెల‌లు దాటినా పూర్తికాని దిండి- చించినాడ వంతెన మ‌ర‌మ్మ‌త్తు ప‌నులు! ఇబ్బందులు పడుతున్న జనం!
Narasapuram -Tirupati Train: నరసాపురం -తిరుపతి మధ్య కొత్త ఎక్స్ ప్రెస్ వచ్చేసింది! టైమింగ్స్ ఇవే!
నరసాపురం -తిరుపతి మధ్య కొత్త ఎక్స్ ప్రెస్ వచ్చేసింది! టైమింగ్స్ ఇవే!
Advertisement

వీడియోలు

IPL 2026 GT vs KKR Highlights | గుజ‌రాత్ హ్యాట్రిక్ విజ‌యం
IPL 2026 KKR vs Gujarat Titans Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
IPL 2026 KKR vs GT Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
Shubman Gill GT vs KKR IPL 2026 | అదరగొట్టిన కెప్టెన్ శుభమన్ గిల్
Shubman Gill Success Secret Revealed IPL 2026 | శుబ్మన్ గిల్ సక్సెస్ సీక్రెట్ ఇదే
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy in Delhi: మహిళా బిల్లు ఒక్కటే తెస్తే మద్దతిస్తాం - బీజేపీకి రేవంత్ రెడ్డి పిలుపు
మహిళా బిల్లు ఒక్కటే తెస్తే మద్దతిస్తాం - బీజేపీకి రేవంత్ రెడ్డి పిలుపు
Chandrababu Nidadavolu: మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆపిన కాంగ్రెస్ కూటమిది ఘోరమైన తప్పిదం - నిడదవోలులో చంద్రబాబు నిరసన ర్యాలీ
మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆపిన కాంగ్రెస్ కూటమిది ఘోరమైన తప్పిదం - నిడదవోలులో చంద్రబాబు నిరసన ర్యాలీ
Citroen Basalt X Prices Hiked : వాహనదారులకు షాక్ - సిట్రోయెన్ బసాల్ట్ X ధరలు పెంచుతూ కంపెనీ నిర్ణయం!
వాహనదారులకు షాక్ - సిట్రోయెన్ బసాల్ట్ X ధరలు పెంచుతూ కంపెనీ నిర్ణయం!
Pawan vs Prakash Raj: డీలిమిటేషన్ బిల్లుపై ఢీ అంటే ఢీ! పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్‌ మధ్య సోషల్ మీడియా వార్!
డీలిమిటేషన్ బిల్లుపై ఢీ అంటే ఢీ! పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్‌ మధ్య సోషల్ మీడియా వార్!
Naga Babu Konidela: రామాయణం కాంట్రవర్సీ... వేరే దేశంలో అయితేనా? ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై నాగబాబు రియాక్షన్
రామాయణం కాంట్రవర్సీ... వేరే దేశంలో అయితేనా? ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై నాగబాబు రియాక్షన్
Rebirth of Punarvika: చిన్నారి పునర్వికకు పునర్జన్మ- రూ.16 కోట్ల ఇంజక్షన్ చికిత్స పూర్తి - లోకేష్ ట్వీట్ వైరల్
చిన్నారి పునర్వికకు పునర్జన్మ- రూ.16 కోట్ల ఇంజక్షన్ చికిత్స పూర్తి - లోకేష్ ట్వీట్ వైరల్
ఎన్డీయే మంత్రి విందులో రేవంత్ ..మిత్రులతో మాటా ముచ్చట
ఎన్డీయే మంత్రి విందులో రేవంత్ ..మిత్రులతో మాటా ముచ్చట
Strait of Hormuz:
"హర్మూజ్‌ జలసంధి మూసివేస్తాం" శాంతి చర్చలకు సిద్ధమవుతున్న వేళ ఇరాన్ వార్నింగ్! ట్రంప్ తీరుపై ఆగ్రహం!
Embed widget