అన్వేషించండి

Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు

Maruti Suzuki Dzire Cost | 'మారుతి సుజుకి డిజైర్' మార్కెట్లో ఇండియ‌న్ ఆటోమొబైల్ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. 30 లక్షల యూనిట్ల రికార్డు దాటి టాప్ సెల్లింగ్ మోడల్‌గా నిలిచింది.

ఇండియ‌న్ ఆటోమొబైల్ రంగంలో మారుతి సుజుకి డిజైర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. దేశవ్యాప్తంగా 30 లక్షల యూనిట్ల అమ్మకాల మార్కును ఈ కారు అధిగమించింది. 2025 క్యాలెండర్ ఏడాదిలో 2.14 లక్షల విక్రయాలతో కంపెనీలోనే టాప్ సెల్లింగ్ మోడల్‌గా నిలిచింది. 

ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన 'మారుతి సుజుకి డిజైర్' మార్కెట్లో తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. దేశవ్యాప్తంగా ఈ కారు విక్రయాలు 30 లక్షల మార్కును దాటినట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. 2008లో తొలిసారిగా పరిచయమైన ఈ మోడల్, ప్రస్తుతం నాలుగు ర‌కాల వేరియంట్ల‌తో వినియోగదారులను అలరిస్తోంది. ముఖ్యంగా 2025 సంవత్సరంలో సుమారు 2.14 లక్షల యూనిట్ల విక్రయాలను సాధించి, మారుతి సుజుకి బ్రాండ్‌లో అత్యధికంగా అమ్ముడైన కారుగా రికార్డు సృష్టించింది. దీంతో కంపెనీ వర్గాలు ఆనందోత్సాహాల‌లో మునిగి పోయాయి. 

తొలిసారి కారు కొనేవారికి మొదటి ఛాయిస్
మారుతి సుజుకి వివ‌రాల‌ ప్రకారం, డిజైర్ కారును కొనుగోలు చేస్తున్న వారిలో దాదాపు సగం మంది మొదటిసారి వాహనం కొంటున్నవారే ఉండటం విశేషంగా చెప్పుకోవ‌చ్చు. యువతను ఆకట్టుకునేలా దీని డిజైన్‌ను అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. రూ. 6.25 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లభిస్తున్న ఈ సెడాన్, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండి, అత్యుత్త‌మ ఎంపిక‌గా నిలిచింద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

మైలేజీలో కింగ్..
ఇండియ‌న్ కస్టమర్లు ప్రధానంగా ఆశించే ఇంధన సామర్థ్యం విషయంలో డిజైర్ అగ్రస్థానంలో ఉంది. పెట్రోల్ మాన్యువల్ వెర్షన్ లీటరుకు 24.79 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. . పర్యావరణ హితమైన ఎస్-సీఎన్‌జీ (S-CNG) మోడ్‌లో కేజీకి 33.73 కిలోమీటర్ల మైలేజీని అందిస్తూ ఖర్చులను భారీగా తగ్గిస్తుంది. ఈ అద్భుతమైన మైలేజీనే ఈ కారును సెగ్మెంట్ లీడర్‌గా నిలబెట్టాయన‌డంలో సందేహం లేదు.

అధునాతన ఫీచర్లు
కాలంతో పాటు మారుతున్న టెక్నాలజీని డిజైర్ తనలో అందిపుచ్చుకుంది. ఇందులో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ హెచ్‌డీ కెమెరా వంటి ప్రీమియం సౌకర్యాలు ఉన్నాయి. 22.86 సెంటీమీటర్ల (9 అంగుళాల) స్మార్ట్‌ప్లే ప్రో ప్లస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ద్వారా వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేను వాడుకోవచ్చు. నెక్స్ట్ జనరేషన్ సుజుకి కనెక్ట్ ద్వారా స్మార్ట్ వాచ్ ఇంటిగ్రేషన్, అలెక్సా వాయిస్ అసిస్టెంట్ ఫీచ‌ర్లు కూడా ఉన్నాయి.

టాప్ సెక్యూరిటీ
ప్రస్తుతం భద్రతకు ఉన్న ప్రాధాన్యతను గుర్తించిన మారుతి, ఇందులో 15కు పైగా సేఫ్టీ ఫీచర్లను చేర్చింది. ఆరు ఎయిర్ బ్యాగ్‌లు, హిల్ హోల్డ్ అసిస్ట్‌తో కూడిన ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఏబీఎస్, ఈబీడీ వంటి సెక్యూరిటీ ఫీచ‌ర్లు ఇందులో ఉన్నాయి. భారత్ ఎన్‌క్యాప్ (B-NCAP), గ్లోబల్ ఎన్‌క్యాప్ పరీక్షల్లో 5-స్టార్ రేటింగ్ సాధించడం ఈ కారు స్ట్రాంగ్ నెస్ కు నిదర్శనం. మైలేజీ, లగ్జరీ, భద్రతల మేళవింపుతో డిజైర్ తన విజయ పరంపరను కొనసాగిస్తోంది. దీంతో అతి త‌క్కువ కాలంలోనే అత్యున్న‌త మైల్ స్టోన్ ను అధిగమించింది. 

 

టాప్ హెడ్ లైన్స్

రూ.10-15 లక్షల్లో ఐదుగురికి హాయిగా సరిపోయే ఆటోమేటిక్‌ కారు, మంచి మైలేజ్ కూడా.. ఈ కారు బెస్ట్ ఛాయిస్!
వెనుక సీట్‌లో ముగ్గురు కూర్చోగల బెస్ట్ ఆటోమేటిక్ కారు ఏది? మారుతి బ్రెజ్జా లేదా హోండా అమేజ్?
అన్ని కార్లకూ పవర్ పెట్రోల్ అవసరమా? పూర్తి నిజం ఏంటో ఇప్పుడే తెలుసుకోండి!
పవర్ పెట్రోల్ vs నార్మల్ పెట్రోల్ - మీ కారుకు ఏది బెస్ట్? డబ్బు వృథా చేసుకోవద్దు
5.75 లక్షల బైక్ Royal Enfield Shotgun 650.. 3 నిమిషాల్లో SOLD OUT, ఫీచర్లు చూశారా
5.75 లక్షల బైక్ Royal Enfield Shotgun 650.. 3 నిమిషాల్లో SOLD OUT, ఫీచర్లు చూశారా
ఫిక్స్‌డ్ బ్యాటరీతో విడా VX2 కొత్త వేరియంట్ విడుదల, 65 నిమిషాల్లోనే ఛార్జింగ్‌.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే
హీరో విడా VX2 Go FB లాంచ్.. 128km రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్, రేటు మీకు అందుబాటులోనే!

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
Embed widget