అన్వేషించండి

Top 5 Affordable cars: బైక్ కొనేవారు కూడా కారు ఈజీగా కొనవచ్చు! టాప్ 5 చౌకైన ఫ్యామిలీ కార్లు ఇవే

Top 5 Cheapest Cars: భారత మార్కెట్లో అత్యంత చౌకైన టాప్ 5 కార్ల వివరాలు ఇక్కడ అందిస్తున్నాం. టాటా, మారుతి, రెనాల్డ్ కంపెనీ కార్లు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.

కారు కొనాలి అని చాలా మంది కలలు కంటారు. కానీ వారి ఫ్యామిలీ ఖర్చులు, బడ్జెట్ ఇతర అవసరాలు ఉన్న కారణంగా కారు కొనడాన్ని వాయిదా వేస్తుంటారు. కొందరు కారు కొనాలన్న కలను సులభంగా నెరవేర్చుకుంటే, మరికొందరికి అందుకు ఏళ్లకు ఏళ్లు టైం పడుతుంది. భారత మార్కెట్లో కేవలం రూ. 3.49 లక్షల ప్రారంభ ధరతోనే కార్లు లభిస్తాయని అందరికీ తెలియదు. అవగాహన ఉన్నవారు ఎలాగోలా తమ కారు కల నెరవేర్చుకుంటున్నారు. దేశంలోని అత్యంత చౌకైన కార్ల జాబితాలో ఉన్న కొన్నింటి జాబితా ఇక్కడ అందిస్తున్నాం. మీరు రోజూ వాడే బైక్ నుండి కారుకు అప్‌గ్రేడ్ అవ్వాలనుకుంటే, ఈ చౌకైన కార్ల ధర, ఫీచర్ల వివరాలు తెలుసుకోండి. 

మారుతి ఎస్ ప్రెస్సో (Maruti S-Presso)

దేశంలోనే అత్యంత చౌకైన కారుగా Maruti S-Presso నిలిచింది. దీని STD (O) వేరియంట్ ధర గతంలో 4.26 లక్షల రూపాయలు ఉండగా, ఇప్పుడు ధర రూ.3.49 లక్షలకు తగ్గింది. అంటే వినియోగదారులకు సుమారు రూ. 76,600 ప్రయోజనం లభిస్తుంది. ధరలో దాదాపు 18 శాతం తగ్గింపు తర్వాత, బడ్జెట్ సెగ్మెంట్లో ఇది అత్యంత డిమాండ్ ఉన్న కార్లలో ఒకటిగా కొనసాగుతోంది. కొత్త జీఎస్టీ (GST) సంస్కరణల తర్వాత మారుతి ఎస్ ప్రెస్సో కారు దేశంలోనే అత్యంత చౌకైన కారుగా మారింది. 

మారుతి ఆల్టో కే10 (Maruti Alto K10)

ఒకప్పుడు మారుతి ఆల్టో K10 భారత్‌లో అత్యంత చౌకైన కారుగా ఉండేది. కానీ గత ఏడాది సెప్టెంబర్ నెలలో ప్రకటించిన జీఎస్టీ సంస్కరణతో ఇది రెండో స్థానానికి చేరుకుంది. దీని STD (O) వేరియంట్ ధర 3.69 లక్షల రూపాయలు. జీఎస్టీ సంస్కరణలు వచ్చిన తర్వాత, వినియోగదారులు ఈ కారు కొనుగోలుపై దాదాపు రూ.53,100 వరకు ఆదా చేస్తున్నారు. ఆల్టో K10 ఇప్పటికీ తక్కువ ధర, కస్టమర్లకు తన నమ్మకమైన పనితీరు (Performance) కారణంగా ఎంతో పాపులర్‌ అయింది. 

రెనాల్ట్ క్విడ్ (Renault Kwid)

అతి తక్కువ ధరకు లభించే జాబితాలో మూడవ కారు రెనాల్ట్ క్విడ్ (Renault Kwid). దీని 1.0 RXE వేరియంట్ ధర గతంలో 4.69 లక్షల రూపాయలు ఉండగా, ఇప్పుడు రూ.4.29 లక్షలకు విక్రయాలు జరుగుతున్నాయి. ఎస్‌యూవీ (SUV) వంటి స్టైలింగ్, బడ్జెట్-ఫ్రెండ్లీ ధర రెనాల్ట్ క్విడ్ కారును ఎంట్రీ-లెవల్ కస్టమర్లకు బెస్ట్ ఛాయిస్‌గా మార్చుతోంది. 

Tata Tiago

దేశంలో నాల్గవ అతి చౌకైన కారు Tata Tiago. టియాగో XE వేరియంట్ ధర ప్రస్తుతం రూ. 4.57 లక్షల నుండి ప్రారంభమవుతుంది. అంటే వినియోగదారులకు ఏకంగా రూ.42,500 వరకు లాభం చేకూరుతుంది. బలమైన బిల్డ్ క్వాలిటీతో పాటు స్టైలిష్ లుక్స్ కారణంగా ఈ ధర వద్ద టాటా Tiago కారు వాల్యూ ఫర్ మనీ వెహికల్‌గా నిలుస్తోంది.

Maruti Celerio

భారత మార్కెట్లో చౌకైన కార్ల జాబితాలో Maruti Celerio చోటు దక్కించుకుంది. మారుతి సెలెరియో LXI వేరియంట్ ధర గతంలో రూ. 5.64 లక్షలు ఉండగా, ఇప్పుడు కారు ధర రూ. 4.69 లక్షలకు దిగొచ్చింది. ఈ కారు కొనుగోలుదారులకు సుమారు ₹94,100 ఆదా అవుతుంది. ఇది ఏకంగా కారు పాత ధరలో 17% తగ్గింపు అని చెప్పవచ్చు. దాంతో మారుతి సెలెరియో మరింత తక్కువ ధర కారుగా మారి కస్టమర్లను ఆకర్షిస్తోంది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

MG Majestor India Launch on April 20: ఫార్చ్యూనర్‌కు చెక్ పెట్టేందుకు 'మెజెస్టర్' వచ్చేస్తోంది..! ఎంజీ మోటార్ నుండి మోస్ట్ ప్రీమియం ఎస్‌యూవీ లాంచ్.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!
ఫార్చ్యూనర్‌కు చెక్ పెట్టేందుకు 'మెజెస్టర్' వచ్చేస్తోంది..! ఎంజీ మోటార్ నుండి మోస్ట్ ప్రీమియం ఎస్‌యూవీ లాంచ్.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!
Summer Road Trip Guide: సమ్మర్ లో లాంగ్ డ్రైవ్ వెళ్తున్నారా? మీ కారును ఇలా రెడీ చేసుకోండి,  సేఫ్ జర్నీ కోసం టిప్స్!
సమ్మర్ లో లాంగ్ డ్రైవ్ వెళ్తున్నారా? మీ కారును ఇలా రెడీ చేసుకోండి,  సేఫ్ జర్నీ కోసం టిప్స్!
Bajaj Pulsar 180 Vs Apache 180 Bikes: 180 సీసీ సెగ్మెంట్‌లో మళ్ళీ మొదలైన పోరు - పల్సర్ రీ-ఎంట్రీతో అపాచీకి చెక్!
180 సీసీ సెగ్మెంట్‌లో మళ్ళీ మొదలైన పోరు - పల్సర్ రీ-ఎంట్రీతో అపాచీకి చెక్!
Tata Sierra EV: రేంజ్‌లో టాటా సియెర్రా ఈవీ అన్నింటిని దాటుతుందా ? ఫీచర్లు, మైలేజీపై కస్టమర్లలో ఉత్కంఠ
రేంజ్‌లో టాటా సియెర్రా ఈవీ అన్నింటిని దాటుతుందా ? ఫీచర్లు, మైలేజీపై కస్టమర్లలో ఉత్కంఠ
Advertisement

వీడియోలు

SRH Bowling Disaster vs PBKS IPL 2026 | SRH బౌలింగ్ వైఫల్యంపై ఫ్యాన్స్ ఫైర్
Ayush Mhatre Retired Out IPL 2026 | సీఎస్కే మేనేజ్మెంట్ పై విమర్శల వర్షం
Sanju Samson Salute Celebration | కోచ్ కోసం సంజూ శాంసన్ సెల్యూట్
CSK vs DC IPL 2026 Sanju Samson Century | సంజూ శాంస‌న్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ
IPL 2026 CSK vs DC Highlights | బోణీ కొట్టిన చెన్నై
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India-Pakistan Border Surveillance: భారత్‌ సైనిక వ్యూహాత్మక స్థావరాలను చైనా కన్నుతో చూస్తోన్న పాక్‌!ఐఎస్‌ఐ కుట్రలు బహిర్గతం!
భారత్‌ సైనిక వ్యూహాత్మక స్థావరాలను చైనా కన్నుతో చూస్తోన్న పాక్‌!ఐఎస్‌ఐ కుట్రలు బహిర్గతం!
Nara Lokesh meets the President: పోరాడి సాధించిన విజయాలు చిరస్థాయిలో నిలిచిపోతాయి - అమరావతి రైతులకు రాష్ట్రపతి ప్రశంసలు
పోరాడి సాధించిన విజయాలు చిరస్థాయిలో నిలిచిపోతాయి - అమరావతి రైతులకు రాష్ట్రపతి ప్రశంసలు
Varanasi Leaks : 'వారణాసి' బోట్ యాక్షన్ సీన్ లీక్? - ఆ ప్రచారంలో నిజమెంత!... లీకుల బెడద తప్పలేదా...
'వారణాసి' బోట్ యాక్షన్ సీన్ లీక్? - ఆ ప్రచారంలో నిజమెంత!... లీకుల బెడద తప్పలేదా...
Summer Diet : మండుతున్న సూరీడు.. హాట్ సమ్మర్​లో హీట్​ని తగ్గించుకునేందుకు ఏమి తింటే మంచిది? ఏమి తినకూడదు? 
మండుతున్న సూరీడు.. హాట్ సమ్మర్​లో హీట్​ని తగ్గించుకునేందుకు ఏమి తింటే మంచిది? ఏమి తినకూడదు? 
Singer Mangli vs Subbarao: మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన లాయర్ సుబ్బారావుకు షాక్! బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసిన పోలీసులు
మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన లాయర్ సుబ్బారావుకు షాక్! బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసిన పోలీసులు
PM Modi on Women Reservations: మహిళా రిజర్వేషన్ల అమలు చారిత్రక ఘట్టం, 2029 ఎన్నికల నుంచే వర్తింపు: ప్రధాని మోదీ
మహిళా రిజర్వేషన్ల అమలు చారిత్రక ఘట్టం, 2029 ఎన్నికల నుంచే వర్తింపు: ప్రధాని మోదీ
Pocharam Srinivas Reddy: నిధుల కోసం మంత్రుల కాళ్లు మొక్కాలా? చావైనా బతుకైనా సరే తేల్చుకుంటా: పోచారం శ్రీనివాస్ రెడ్డి
నిధుల కోసం మంత్రుల కాళ్లు మొక్కాలా? చావైనా బతుకైనా సరే తేల్చుకుంటా: పోచారం శ్రీనివాస్ రెడ్డి
Donald Trump on Pope Leo: పోప్‌ లియోకు క్రైమ్స్ అంటే చాలా ఇష్టం! అణ్వాయుధాలను వ్యతిరేకించరు.. ఆయన నాకు నచ్చలేదు: డొనాల్డ్ ట్రంప్
పోప్‌ లియోకు క్రైమ్స్ అంటే చాలా ఇష్టం! అందుకే ఆయన నాకు నచ్చలేదు: డొనాల్డ్ ట్రంప్
Embed widget