Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి చెందిన మొయినాబాద్ ఫాంహౌస్ మరోసారి వార్తల్లో నిలిచింది. అనుమతి లేకుండా పార్టీ నిర్వహిస్తున్నారని సమాచారం అందుకున్న SOT పోలీసులు శనివారం రాత్రి దాడులు నిర్వహించారు. అయితే పోలీసుల రాకను గమనించిన పార్టీలోని వ్యక్తుల్లో ఒకరు గాలిలోకి, అనంతరం పోలీసుల్ని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపినట్లుగా తెలుస్తుంది.
ఈ పార్టీకి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్, రోహిత్ రెడ్డి, రాజస్థాన్‌కు చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే సహా మొత్తం 10 మంది హాజరైయ్యారు. వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్ టెస్ట్ చేయగా రోహిత్ రెడ్డితో పాటు మరికొందరికి పాజిటివ్ వచ్చింది. తాజాగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కు కూడా డ్రగ్స్ టెస్ట్ పాజిటివ్ వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ సోదాల్లో 2 గ్రాముల కోకైన్, ఇతర మత్తు పదార్థాలతో పాటు రివాల్వర్, ఖరీదైన లిక్కర్ బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ ఎక్కడి నుండి సరఫరా అయ్యాయి? దీని వెనుక ఉన్న నెట్‌వర్క్ ఏమిటి అనే కోణంలో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు.
ట్రెండింగ్ వార్తలు





















