Liam Livingstone England T20 World Cup Squad | సన్ రైజర్స్ తప్పు చేసిందా..ఇంగ్లండ్ విస్మరించిందా.? | ABP Desam
హైదరాబాద్ సన్ రైజర్స్ ఏం చేసినా ఓ వార్తే. అలానే మొన్న జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో కూడా SRH దూకుడు చూపించింది. ఇంగ్లండ్ ఆల్ రౌండర్ టీ20 స్పెషలిస్ట్ అయిన లియాం లివింగ్ స్టన్ ను వేలంలో దక్కించుకునేందుకు మిగిలిన జట్ల కంటే ఉత్సాహం చూపించింది ఆరెంజ్ ఆర్మీ. తగ్గేదేలా అన్నట్లు గట్టిగా వేలం పాడి ఏకంగా 13 కోట్ల రూపాయలకు లివింగ్ స్టన్ ను కొనుగోలు చేసింది. కానీ ఇప్పుడు అందరినీ షాక్ కి గురి చేసిన విషయం ఏంటంటే ఫిబ్రవరి 7నుంచి జరగనున్న టీ20 వరల్డ్ కప్ లో ఆడే ఇంగ్లండ్ జట్టులో లివింగ్ స్టన్ కు చోటు దక్కలేదు. 15మందితో ప్రొవిజినల్ జట్టును ప్రకటించిన ఇంగ్లీష్ ఆర్మీ అందులో లివింగ్ స్టన్, జేమీ స్మిత్ లకు ప్లేస్ ఇవ్వలేదు. ఇంగ్లండ్ తరపున ఆఖరిసారిగా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడిన లివింగ్ స్టన్ అందులో విఫలయ్యాడు. 2025లో 11 మ్యాచ్ లు ఆడి 162పరుగులు మాత్రమే చేశాడు. మరో వైపు ఈ ఏడాది ఐపీఎల్ లో ఆర్సీబీ తరపున ఆడిన లివింగ్ స్టన్ అక్కడ కూడా 16 యావరేజ్ తో 112 పరుగులు మాత్రమే చేశాడు. సో లివింగ్ స్టన్ ను ఎంపిక చేయకపోవటానికి ఇదే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. కానీ
ఇంగ్లండ్ దేశవాళీల్లో లివింగ్ స్టన్ దుమ్మురేపుతున్నాడు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్ నిర్వహించే బ్లాస్ట్ టీ20 టోర్నీలో 25 మ్యాచ్ లు ఆడిన లివింగ్ స్టన్ ఓ సెంచరీతో పాటు 160 స్ట్రైక్ రేట్ తో 725పరుగులు చేశాడు. అటు బౌలింగ్ లోనూ 13వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శనే SRH ఏకంగా 13 కోట్లు పెడితే ఇంగ్లండ్ మాత్రం జాతీయ జట్టు ప్రదర్శనను, ఐపీఎల్ లో పరిగణనలోకి తీసుకుని భారత్ లో జరిగే టీ20 వరల్డ్ కప్ కు లివింగ్ స్టన్ ను పక్కనపెడుతూ సంచలన నిర్ణయం తీసుకుంది.





















