Draksharamam Temple : అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం- ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన దుండగులు
Draksharamam Temple : అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ద్రాక్షారామంలో ఉన్న శివలింగాన్ని ధ్వంసం చేశారు. స్పందించిన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Draksharamam Temple : ద్రాక్షారామం వద్ద ఉండే కోనేటీలో ఉన్న శివలింగం ధ్వంసమైంది. గుర్తు తెలియని వ్యక్తులు చేసిన ఈ పని ఇప్పుడు సంచలనంగా మారుతోంది. ఓవైపు హిందూ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. మరోవైపు అధికారులు గుడి వద్దకు వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ద్రాక్షారామంలో గుర్తు తెలియని వ్యక్తులు శివలింగాన్ని ధ్వంసం చేయడాన్ని హైందవ సంఘాల తీవ్రంగా తప్పుపట్టాయి. ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశాయి. శివలింగం ధ్వంసమైన ప్రాంతాన్ని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా పరిశీలించారు.
డాగ్ స్క్వాడ్‌ను రప్పించి వివరాలు సేకరించారు పోలీసులు. ఘటనకు సంబంధించిన నిందితులను గుర్తించేందుకు నాలుగు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. సమీపంలో ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు.





















