అన్వేషించండి

Hyderabad Crime News: మియాపూర్‌లో మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు.. ఘటనాస్థలానికి వెళ్లిన ఎమ్మెల్యే గాంధీ

Hyderabad Rains News | మియాపూర్ వైశాలినగర్‌లో తెరిచి ఉన్న మాన్‌హోల్‌లో పడి వృద్ధుడు గల్లంతయ్యాడు. హైడ్రా, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపడుతుండగా, ఎమ్మెల్యే ఆరేకపూడి గాంధీ పరిశీలించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మియాపూర్ అండర్‌పాస్ వద్ద డ్రైనేజీలో వృద్ధుడు గల్లంతు.
  • అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆగ్రహం వ్యక్తం.
  • ఎమ్మెల్యే గాంధీ ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు.

హైదరాబాద్‌లోని మియాపూర్ పరిధిలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. వైశాలి నగర్ రైల్వే అండర్ పాస్ సమీపంలో తెరిచి ఉన్న డ్రైనేజీ మాన్ హోల్‌లో పడి 70 ఏళ్ల వృద్ధుడు గల్లంతయ్యాడు. గల్లంతైన వ్యక్తిని హఫీజ్‌పేట్ ప్రేమ్‌నగర్ నివాసి బాలయ్య (70)గా పోలీసులు గుర్తించారు. నాలా మరమ్మత్తు పనులు జరుగుతున్న సమయంలో కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, రక్షణ చర్యలు తీసుకోకపోవడమే దానికి కారణమని జీహెచ్‌ఎంసీ అధికారుల తీరుపై బాధితుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Hyderabad Crime News: మియాపూర్‌లో మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు.. ఘటనాస్థలానికి వెళ్లిన ఎమ్మెల్యే గాంధీ

సమాచారం అందుకున్న వెంటనే మియాపూర్ పోలీసులు, హైడ్రా (HYDRA), ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గల్లంతైన బాలయ్య ఆచూకీ కోసం సహాయక బృందాలు నాలాలో తీవ్రంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. వైశాలినగర్ అండర్‌పాస్ వద్ద నాలా మరమ్మతులు చేస్తున్న సమయంలో తెరిచి ఉన్న మ్యాన్ హోల్‌లో బాలయ్య పడినట్లు పోలీసులు తెలిపారు. మరమ్మతులు చేయడానికి కొన్ని రోజులుగా ఈ అండర్ పాస్‌ను అధికారులు మూసివేశారు


Hyderabad Crime News: మియాపూర్‌లో మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు.. ఘటనాస్థలానికి వెళ్లిన ఎమ్మెల్యే గాంధీ
కాగా, విషయం తెలియగానే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరేకపూడి గాంధీ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులు, సహాయక సిబ్బందిని అడిగి తెలుసుకున్న ఆయన, గాలింపు చర్యలను మరింత వేగవంతం చేసి వృద్ధుడి ఆచూకీ త్వరగా కనిపెట్టాలని కోరారు. డ్రైనేజీ మ్యాన్ హోల్ తెరిచి ఉండటం వల్ల వర్షకాలంలో వాటిలో పడి ప్రజలు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని.. కాంట్రాక్టర్లు, జీహెచ్ఎంసీ సిబ్బంది నిర్లక్ష్యం సరికాదన్నారు.


నగర ప్రజలకు ట్రాఫిక్ పోలీసుల కీలక సూచనలు
 వర్ష తీవ్రత ఎక్కువగా ఉన్నందున అత్యవసర పనులు ఉంటే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, సురక్షితంగా ఇళ్లలోనే ఉండాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు సూచించారు. వాహనదారులు తమ వాహనాలను అత్యంత నెమ్మదిగా, వేగాన్ని నియంత్రిస్తూ డ్రైవింగ్ చేయాలి. రహదారులపై విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసుల సూచనల్ని వాహనదారులు తప్పనిసరిగా పాటించాలి. అత్యవసర ప్రయాణాలు చేసే వారు సాధారణ సమయం కంటే కొంత అదనపు సమయాన్ని కేటాయించుకుని బయలుదేరడం మంచిదని సూచించారు. సామాజిక మాధ్యమాల ద్వారా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు అందించే అధికారిక సమాచారాన్ని, ట్రాఫిక్ అప్‌డేట్‌లను గమనిస్తూ మీ జర్నీ ప్లాన్ చేయాలని హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. 

Frequently Asked Questions

మియాపూర్‌లో మ్యాన్ హోల్‌లో పడి గల్లంతైన వృద్ధుడు ఎవరు?

గల్లంతైన వ్యక్తి పేరు బాలయ్య (70), హఫీజ్‌పేట్ ప్రేమ్‌నగర్ నివాసి. వైశాలి నగర్ రైల్వే అండర్ పాస్ సమీపంలోని డ్రైనేజీ మ్యాన్‌హోల్‌లో అతను పడిపోయాడు.

వృద్ధుడు మ్యాన్ హోల్‌లో పడటానికి కారణం ఏమిటి?

నాలా మరమ్మత్తు పనులు జరుగుతున్న సమయంలో కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగింది. రక్షణ చర్యలు తీసుకోకపోవడమే దీనికి కారణమని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గల్లంతైన వృద్ధుడి కోసం ఎవరు గాలింపు చర్యలు చేపడుతున్నారు?

సమాచారం అందుకున్న వెంటనే మియాపూర్ పోలీసులు, హైడ్రా (HYDRA), ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గల్లంతైన బాలయ్య ఆచూకీ కోసం నాలాలో తీవ్రంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి.

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు ఎలాంటి సూచనలు చేశారు?

వర్ష తీవ్రత ఎక్కువగా ఉన్నందున అత్యవసర పనులు ఉంటే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. వాహనదారులు నెమ్మదిగా డ్రైవ్ చేయాలని, ట్రాఫిక్ అప్‌డేట్‌లను గమనించాలని కోరారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Embed widget