అన్వేషించండి

Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?

Ravi Teja Irumudi Censor Report: మాస్ మహారాజా రవితేజ హీరోగా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన 'ఇరుముడి' సెన్సార్ పూర్తి అయ్యింది. ఈ సినిమా రిపోర్ట్ ఎలా ఉందో తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఇరుముడి'కు U/A లభించింది; కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కింది.
  • కుమార్తె కోసం తండ్రి ఆరాటం, రవితేజ నటన ప్రధాన ఆకర్షణ.
  • రవితేజ దీక్ష, గ్రామీణ నేపథ్యం; ఆగస్టు 21న సినిమా విడుదల.

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా నటించిన యాక్షన్ అండ్ డివోషనల్ ఫిల్మ్ 'ఇరుముడి' (Irumudi Movie). ఆల్రెడీ విడుదలైన ట్రైలర్ గానీ, పాటలు గానీ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. రవితేజ నుంచి ఓ డిఫరెంట్ సినిమా, కంటెంట్ బేస్డ్ ఫిల్మ్ వస్తోందని అర్థమైంది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. 'ఇరుముడి'కి సెన్సార్ బోర్డు 'U/A' సర్టిఫికేట్‌ ఇచ్చింది. మరి సెన్సార్ రిపోర్ట్ ఎలా ఉంది? అనేది చూస్తే...

పక్కా ఫ్యామిలీ డ్రామా... ఎమోషన్స్ హైలైట్
'ఇరుముడి' రన్‌ టైమ్ విషయానికి వస్తే... రెండు గంటల 25 నిమిషాలు. పక్కా ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన సినిమా అని, రన్ టైమ్ తక్కువ కావడంతో చకచకా సాగుతుందని తెలిసింది.

'ఇరుముడి' కథ విషయానికి వస్తే... ఫ్యామిలీ డ్రామాలో ఎమోషన్స్ హైలైట్ అవుతాయని ఫస్ట్ సెన్సార్ రిపోర్ట్. మధ్యతరగతి తండ్రిగా, తన కుటుంబం కోసం, మరీ ముఖ్యంగా కుమార్తె కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధపడే వ్యక్తిగా రవితేజ నటన అందరికీ నచ్చుతుందట. ఆయన కుమార్తెగా బేబీ నక్షత్ర నటించారు. సినిమాలో ఇద్దరి మధ్య బాండింగ్, వాళ్ళిద్దరి సన్నివేశాలు హైలైట్ అవుతాయని 'ఇరుముడి' చూసిన వాళ్ళు చెబుతున్నారు. సినిమాకు ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్, సీన్స్ బ్యాక్‌బోన్‌గా నిలుస్తాయట.

Also Read: Vijay Jana Nayakudu OTT Release Date - జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ

'ఇరుముడి'లో తాగుడుకు అలవాటైన వ్యక్తిగా, ఆ వ్యసనం నుంచి బయట పడటానికి ప్రయత్నించే క్రమంలో అయ్యప్ప దీక్ష తీసుకుంటారు రవితేజ. మాల ధరించిన తర్వాత అతని వ్యక్తిత్వంలో, జీవితంలో వచ్చే మార్పులను దర్శకుడు శివ నిర్వాణ అద్భుతంగా ఆవిష్కరించారట. గ్రామీణ నేపథ్యంలో సినిమా తీశారు. పల్లెటూరిలో మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులతో పాటు వాళ్ళకు ఏ విధమైన గౌరవం ఇవ్వాలనేది కూడా చెప్పారట. 

రవితేజ, నక్షత్ర నటన - శివ నిర్వాణ దర్శకత్వానికి తోడు జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ 'ఇరుముడి'కి బిగ్గెస్ట్ ప్లస్ అంటున్నారు సినిమా చూసిన సెన్సార్ సభ్యులు. 'ఇరుముడి కట్టు', 'మల్లెపూల పల్లకి..' పాటలకు థియేటర్లలో ప్రేక్షకులు భక్తి పారవశ్యంలో మునగడం ఖాయమంటున్నారు. రవితేజ ఖాతాలో హిట్ గ్యారెంటీ అని వినబడుతోంది.

Also ReadNavdeep Reacts To Uppal Balu Controversy - ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mythri Movie Makers (@mythriofficial)

ఆగస్టు 21న థియేటర్లలోకి 'ఇరుముడి'
Irumudi Release Date: రవితేజ భార్యగా, ఆయన సరసన ప్రియా భవాని శంకర్ నటించిన 'ఇరుముడి'లో డైలాగ్ కింగ్ సాయి కుమార్, అజయ్ ఘోష్, స్వాసిక ఇతర కీలక తారాగణం. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రొడ్యూస్ చేశారు. ఆగస్టు 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. పల్లెటూరిలో కుటుంబ సభ్యుల మధ్య ఉండే అనుబంధాలకు తోడు యాక్షన్, సస్పెన్స్ మేళవించి శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ సినిమా మాస్, క్లాస్ ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.

Also ReadBalakrishna Koratala Siva Movie - కొరటాలతో బాలకృష్ణ సినిమా ఆగిందా? యూనిట్ ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే?

Frequently Asked Questions

'ఇరుముడి' సినిమా ఎప్పుడు విడుదలవుతుంది?

'ఇరుముడి' సినిమా ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

'ఇరుముడి' సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఏమిటి?

'ఇరుముడి' సినిమాకు సెన్సార్ బోర్డు 'U/A' సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ చిత్రం రన్ టైమ్ రెండు గంటల 25 నిమిషాలు.

'ఇరుముడి' సినిమా కథా నేపథ్యం ఏమిటి?

ఇది మధ్యతరగతి తండ్రి, కుమార్తె బంధంపై ఆధారపడిన ఫ్యామిలీ డ్రామా. రవితేజ తాగుడు వ్యసనం నుంచి బయటపడటానికి అయ్యప్ప దీక్ష తీసుకుంటారు.

'ఇరుముడి' సినిమాలో రవితేజ పాత్ర ప్రత్యేకత ఏమిటి?

రవితేజ మధ్యతరగతి తండ్రిగా, తన కుమార్తె కోసం ఏదైనా చేసే వ్యక్తిగా నటించారు. అయ్యప్ప దీక్ష తీసుకొని తన వ్యక్తిత్వంలో వచ్చే మార్పులను చూపిస్తారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Jana Nayakudu OTT: జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ
జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
మూడు స్క్రీన్లు, కొత్త బ్యాటరీ, AI ఫీచర్లు.. Mahindra BE 6 Sporteqలో అన్నీ ప్రత్యేకతలే!
651km రేంజ్‌.. రూ.8 లక్షలు తక్కువ ఖర్చు! మహీంద్రా BE 6లో కొత్త మార్పులేంటో తెలుసా?
Embed widget