బడ్జెట్ సమస్యల కారణంగా సినిమా ఆగిపోయిందని పుకార్లు వచ్చాయి. అయితే, బాలకృష్ణకు గాయం కావడమే సినిమా ఆలస్యానికి అసలు కారణం.
Balakrishna Koratala Siva Movie: కొరటాలతో బాలకృష్ణ సినిమా ఆగిందా? యూనిట్ ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే?
NBK112 Latest Update: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా పూజతో మొదలైంది. ఆ సినిమా ఆగిందని వార్తలు వచ్చాయి. మరి ఇండస్ట్రీ ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే?

- నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ సినిమాపై బడ్జెట్ పుకార్లు వచ్చాయి.
- బాలయ్యకు గాయం కావడంతో కొరటాల శివ ప్రాజెక్ట్ ఆలస్యమైంది.
- ముందు NBK111 పూర్తి చేసి కొరటాల సినిమా ప్రారంభిస్తారు.
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడిగా 'దేవర'తో పాన్ ఇండియా హిట్ అందుకున్న దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ఓ సినిమా మొదలైన సంగతి తెలిసిందే. పూజతో అమరావతిలో సినిమాను ప్రారంభించారు. బాలయ్య, కొరటాల కాంబినేషన్‌లో పాన్ సినిమా ప్రకటన ప్రేక్షకులు సైతం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎవరూ ఊహించని కాంబో ఇది. అయితే... ఈ సినిమా గురించి కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బడ్జెట్ కారణాల వల్ల సినిమా ఆగిపోయిందని టాక్.
కొరటాలతో సినిమా నిజంగా ఆగిందా?
బాలయ్య షెడ్యూల్ అప్డేట్ ఏమిటంటే?
కొరటాలతో బాలయ్య సినిమా ఆగిందనే వార్త నందమూరి అభిమానుల్లో చర్చకు దారి తీశాయి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న సినిమా కథ కూడా మారింది. మొదట హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్ సినిమా అనుకున్నా... బడ్జెట్ కారణాల వల్ల కథను మార్చారని గుసగుసలు కొన్ని వినిపించాయి. ఇప్పుడు కొరటాల శివ సినిమా సైతం బడ్జెట్ కారణాలతో ఆగడం అనేది కాస్త ఆందోళనకర విషయమేనని పుకార్లు వచ్చాయి. అయితే, అసలు నిజం వేరే ఉందట.
నిజానికి బాలకృష్ణ - కొరటాల శివ సినిమా షూటింగ్ ఈపాటికే మొదలు కావాలి. ఫస్ట్ వేసిన షెడ్యూల్స్, ప్లానింగ్ ప్రకారం సెట్స్ మీదకు వెళ్ళాలి. అయితే... ఆ లెక్కల ప్రకారం సినిమా మొదలు కాలేదు. దాంతో ప్రాజెక్ట్ పక్కన పెట్టేశారని, బడ్జెట్ ఇష్యూ వల్ల సినిమా అటకెక్కిందని వార్తలు వచ్చాయి. బాలయ్య - కొరటాల సినిమా ఆలస్యం కావడానికి అసలు కారణం నందమూరి నాయకుడికి తగిలిన గాయమే అని విశ్వసనీయ వర్గాల సమాచారం.
Also Read: Romantic Thriller OTT - ఓటీటీలో అప్సరా రాణి రొమాంటిక్ థ్రిల్లర్... సైలెంట్‌గా ప్రైమ్‌లో టాప్‌లోకి
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న NBK 111 షూటింగ్ కాకినాడలో చేసేటప్పుడు బాలయ్యకు చిన్నపాటి గాయం అయ్యింది. హైదరాబాద్ సిటీలోని ఏఐజీ ఆస్పత్రిలో సర్జరీ చేశారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. బాలయ్య కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. అందుకని, కొరటాల శివ సినిమా సెట్స్ పైకి వెళ్ళడం ఆలస్యమైందని యూనిట్ సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ పూర్తి చేశాక... కొరటాల శివ దర్శకత్వంలో సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళాలని బాలయ్య ఆలోచిస్తున్నారట. తనకు గాయం కావడం వల్ల ఎన్‌బీకే111 లేట్ అయ్యిందని, అందువల్ల ముందు ఆ సినిమా పూర్తి చేయాలని భావిస్తున్నారట. కొరటాల శివ సినిమా విషయానికి వస్తే... ఎస్‌ఎల్‌వీ సినిమాస్, యువసుధ ఆర్ట్స్ సంస్థలపై సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
Before You Go
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Frequently Asked Questions
బాలకృష్ణ - కొరటాల శివ సినిమా ఆగిపోయిందా?
బాలకృష్ణ - కొరటాల శివ సినిమా ఆలస్యం కావడానికి కారణం ఏమిటి?
NBK 111 షూటింగ్ సమయంలో బాలకృష్ణకు గాయం కావడంతో సర్జరీ చేయించుకున్నారు. ఆయన కోలుకోవడానికి సమయం పడుతుంది కాబట్టి సినిమా ఆలస్యం అవుతోంది.
బాలకృష్ణకు ఏమైంది?
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న NBK 111 షూటింగ్ సమయంలో బాలకృష్ణకు చిన్నపాటి గాయం అయ్యింది. ఆయన ఏఐజీ ఆస్పత్రిలో సర్జరీ చేయించుకున్నారు.
బాలకృష్ణ, కొరటాల శివ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది?
బాలయ్య గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ పూర్తి చేసిన తర్వాత కొరటాల శివ సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళ్లాలని ఆలోచిస్తున్నారు.
బాలకృష్ణ - కొరటాల శివ సినిమా నిర్మాతలు ఎవరు?
ఈ సినిమాను ఎస్‌ఎల్‌వీ సినిమాస్, యువసుధ ఆర్ట్స్ సంస్థలపై సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు





















