అప్సరా రాణి ప్రధాన పాత్రలో నటించిన 'డార్క్ సీక్రెట్స్' వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఇది టాప్ 10 పర్చేజెస్ ఇన్ ఇండియా లిస్టులో అగ్రస్థానంలో ఉంది.
Romantic Thriller OTT: ఓటీటీలో అప్సరా రాణి రొమాంటిక్ థ్రిల్లర్... సైలెంట్‌గా ప్రైమ్‌లో టాప్‌లోకి
Dark Secrets OTT Trending: రామ్ గోపాల్ వర్మ సినిమాలతో పాపులరైన అందాల భామ అప్సరా రాణి. ఆమె ప్రధాన పాత్రలో రూపొందిన రొమాంటిక్ యాంథాలజీ థ్రిల్లర్ 'డార్క్ సీక్రెట్స్'. ప్రజెంట్ ట్రెండింగ్‌లో ఉంది.

- అప్సరా రాణి 'డార్క్ సీక్రెట్స్' సిరీస్ ప్రైమ్ వీడియోలో టాప్ స్థానంలో.
- రొమాంటిక్ యాంథాలజీ 'డార్క్ సీక్రెట్స్' అమెజాన్ ప్రైమ్‌లో ఊహించని విజయం.
- మానవ సంబంధాలు, అసాధారణ రహస్యాలు, కోరికలే ప్రధాన కథాంశం.
రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాలతో అప్సరా రాణి (Apsara Rani)కి పాపులారిటీ వచ్చింది. మాస్ మహారాజా రవితేజ 'క్రాక్' సినిమాలో స్పెషల్ సాంగ్ 'భూమ్ బద్దలు...' చేశారు. ఆమె ప్రధాన పాత్రలో ఓ వెబ్ సిరీస్ రూపొందింది. అదొక యాంథాలజీ ఫిల్మ్. టైటిల్ 'డార్క్ సీక్రెట్స్'. సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి టాప్‌లోకి వచ్చేసింది. కానీ, ఒక ట్విస్ట్ ఉంది. అది ఏమిటంటే?
ప్రైమ్ వీడియో ఓటీటీలో టాప్ సెల్లర్
Dark Secrets Web Series OTT Platforms: అప్సరా రాణి, జయ శ్రీ, అజిత్ రాధారం, మోహిత్ రెహ్మానియాక్, అరుణ్ కుమార్ కొప్పుల, కృష్ణ నాగరం, నైనిక అనసూయ ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ యాంథాలజీ సిరీస్ 'డార్క్ సీక్రెట్స్'.
'డార్క్ సీక్రెట్స్' చిత్రానికి అవినాష్ కొకటి దర్శకత్వం వహించారు. టచ్ వుడ్ టేల్స్ పతాకంపై అరుణ్ కుమార్ కొప్పుల, కృష్ణ నాగరం నిర్మించారు. మానవ సంబంధాలు, మనుషుల్లో కోరికలు యాంథాలజీ ఫిల్మ్ మెయిన్ ప్లాట్. భిన్నమైన కథలను ఓ ఎమోషనల్ థీమ్‌తో కలుపుతూ... మనుషుల జీవితాల్లోని సంక్లిష్ట పరిస్థితులను ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.
ప్రస్తుతం 'డార్క్ సీక్రెట్స్' సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోని 'Top 10 Purchases In India' లిస్టులో టాప్ ప్లేసుకు చేరుకుంది. ఈ సినిమా చూడటానికి వీక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
అసలు 'డార్క్ సీక్రెట్స్'లో ఏముంది?
'డార్క్ సీక్రెట్స్'లో ఏముంది? యాంథాలజీగా తెరకెక్కిన ఈ సినిమాలోని కథల్లో ఏముంది? అనే విషయంలోకి వెళితే... సామాన్య మనుషుల జీవితాల్లో అసాధారణ రహస్యాలు, కోరికలు, భావోద్వేగాలు, సంబంధాలే ప్రధాన అంశం. 'ప్రతి మనిషి జీవితంలో ఒక రహస్యం ఉంటుంది. అది బయట పడితే ఏమవుతుంది?' అనేది ఆధారంగా చేసుకుని విభిన్న పాత్రలు, కథలతో ప్రేక్షకులను ఆలోచింపజేసేలా సినిమా తీశారు. ఒంటరి మహిళల్లో కోరికల గురించి చర్చించారు. అదీ సంగతి. అందుకే ట్రెండింగ్ లిస్టులోకి వచ్చింది. అప్సరా రాణి రొమాంటిక్ రోల్, అందులో ఆమె యాక్టింగ్ వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
Also Read: Mammootty : మలయాళ స్టార్ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
Before You Go
Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Frequently Asked Questions
అప్సరా రాణి నటించిన 'డార్క్ సీక్రెట్స్' వెబ్ సిరీస్ ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది?
'డార్క్ సీక్రెట్స్' వెబ్ సిరీస్ కథాంశం ఏమిటి?
ఈ రొమాంటిక్ యాంథాలజీ సిరీస్ మానవ సంబంధాలు, మనుషుల్లోని కోరికలు, అసాధారణ రహస్యాల గురించి చర్చిస్తుంది. ప్రతి మనిషి జీవితంలో ఉండే రహస్యాలు బయటపడితే ఏం జరుగుతుందనేది ప్రధానాంశం.
'డార్క్ సీక్రెట్స్' వెబ్ సిరీస్‌కు దర్శకుడు ఎవరు?
'డార్క్ సీక్రెట్స్' చిత్రానికి అవినాష్ కొకటి దర్శకత్వం వహించారు. టచ్ వుడ్ టేల్స్ పతాకంపై అరుణ్ కుమార్ కొప్పుల, కృష్ణ నాగరం నిర్మించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















