Newtons 3rd Law OTT : ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Newtons 3rd Law OTT Platform : యంగ్ హీరో సుమంత్ రీసెంట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ న్యూటన్స్ థర్డ్ లా (Newtons Third Law). నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.

Sumanth's Newtons 3rd Law OTT Release Date Locked : క్రైమ్, హారర్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రీసెంట్‌గా థియేటర్లలోకి వచ్చిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. నెల రోజుల్లోపే డిజిటల్ స్ట్రీమింగ్‌కు రావడం విశేషం. ఇంతకూ ఏంటా మూవీ... ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందనేది ఓసారి చూస్తే...
ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
యంగ్ హీరో సుమంత్ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ న్యూటన్స్ థర్డ్ లా (Newtons 3rd Law) ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ఈటీవీ విన్ (Etv win)లో ఆగస్ట్ 27 (గురువారం) నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. థియేటర్లలో మిక్స్‌డ్ రెస్పాన్స్ అందుకున్న మూవీ... ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాల్సి ఉంది.
ఈ మూవీకి రాజేశ్ కర్ణ దర్శకత్వం వహించగా... సుమంత్‌తో పాటు జగపతి బాబు, అవసరాల శ్రీనివాస్, రవి వర్మ, షెల్లీ ఎన్ కుమార్, త్రినాథ్ వర్మ, నేహా పఠాన్, పండిట్ గౌతమ్, రూపేశ్ మార్రపు, హరిణిరావు, అభినయన తదితరులు కీలకపాత్రలు పోషించారు. సింజిత్ యర్రమిల్లి మ్యూజిక్ అందించగా... హరీశ్ కొహిర్కర్ నిర్మించారు.
స్టోరీ ఏంటంటే?
ఇంజినీరింగ్ విద్యార్థి వినయ్ (త్రినాథ్ వర్మ) ఓ రోజు ఇంటి పైనుంచి పడి అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోతాడు. దీంతో ఆ కేసును ఛేదించేందుకు పోలీస్ ఆఫీసర్ వాసుదేవ్ (సుమంత్) రంగంలోకి దిగుతాడు. వినయ్ తలలో బుల్లెట్ ఉందని పోస్ట్ మార్టం రిపోర్టుల్లో తెలుస్తుంది. దీంతో వినయ్ పేరెంట్స్‌ను అదుపులోకి తీసుకుని ఇన్వెస్టిగేట్ చేస్తాడు వాసుదేవ్. ఇందులో ఆసక్తికర విషయాలు బయటపడతాయి.
వినయ్‌కు సంబంధించి ఏదో విషయాలు దాచి పెడుతున్నారని వాసుదేవ్‌కు అర్థమవుతుంది. అసలు వినయ్ ఎవరు? అతనికి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ స్టీఫెన్ మెర్క్యురి (జగపతి బాబు)కి ఉన్న సంబంధం ఏంటి? ఓ మహిళ యాక్సిడెంట్ కేసుకు... వినయ్ మెర్క్యురీలకు ఉన్న సంబంధం ఏంటి? ఈ ఘటనల్ని 'న్యూటన్స్ థర్డ్ లా' పేరుతో పుస్తకంగా రాసింది ఎవరు? దీన్ని చూసి డేవిడ్ (అవసరాల శ్రీనివాస్) ఎందుకు భయపడ్డాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Before You Go
Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























