అన్వేషించండి

ABP Desam Smart Ed Conclave 2026 : ఏబీపీ దేశం స్మార్ట్ ఎడ్ కాన్‌‌క్లేవ్​లో జాహ్నవి దాంగేటి స్పేస్ టాక్.. పాలకొల్లు నుంచి అంతరిక్షం వరకు

Jahnavi Dangeti : ABP స్మార్ట్ ఎడ్ కాన్క్లేవ్‌లో పాల్గొన్న జాహ్నవి దాంగేటి స్పేస్ రంగంలో ఉన్న అవకాశాలు గురించి ఎన్నో విషయాలు తెలిపారు. ఏఐ నుంచి స్పేస్ మిషన్ల వరకు ఆమె చెప్పిన ఇంట్రెస్టింగ్ విషయాలివే.

Analog Astronaut Jahnavi Dangeti : ఆంధ్రప్రదేశ్‌లోని పాలకొల్లు అనే చిన్న పట్టణం నుంచి వచ్చి.. అంతర్జాతీయ స్థాయిలో అనలాగ్ ఆస్ట్రోనాట్‌గా ఎదిగిన జాహ్నవి దాంగేటి (Jahnavi Dangeti) ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అనలాగ్ ఆస్ట్రోనాట్​గా చేస్తోన్న జాహ్నవి గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. ఏబీపీ దేశం స్మార్ట్ ఎడ్ కాన్క్లేవ్ 2026 (ABP Desam Smart Ed Conclave 2026)లో పాల్గొన్న జాహ్నవి అంతరిక్ష విద్య, ఏఐ (AI) గురించి ఎన్నో విషయాలు పంచుకున్నారు. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. 

  • అంతరిక్షంపై ఆసక్తి ఎలా మొదలైంది?

జాహ్నవి : నేను పాలకొల్లు అనే చిన్న పట్టణం నుంచి వచ్చాను. అక్కడ ఖగోళ శాస్త్రాన్ని (Astronomy) జ్యోతిష్యంగా (Astrology) భావించేవారు. చిన్నప్పుడు మా నానమ్మ, తాతయ్యలు చాలా చందమామ కథలు చెప్పేవారు. ఆ కథల్లో చంద్రుడి మీద ఒక ఆవిడ ఉంటుందని చెప్పేవారు. అది నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. ఆ చిన్ననాటి కథలే నన్ను అంతరిక్షం వైపు నడిపించాయి.

  • స్పేస్ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవాలని ఎప్పుడు నిర్ణయించుకున్నారు?

జాహ్నవి : నాకు మూడు ఏళ్ల వయస్సు ఉన్నప్పుడే చంద్రుడి పైకి వెళ్లాలని కలలు కనేదాన్ని. ఎవరైనా ఎలా వెళ్తావు అని అడిగితే.. ఒక పెద్ద నిచ్చెన వేసి చంద్రుడి పైకి వెళ్తానని చెప్పేదాన్ని. తర్వాత వ్యోమగాముల గురించి తెలుసుకుంటున్నప్పుడు, చదివినప్పుడు దానిపై మరింత ఇంట్రెస్ట్ పెరిగింది. ఈ రంగంలో ఎవరి దారిని వారే నిర్మించుకోవచ్చని నాకు అర్థమైంది. అదే నన్ను ఈ రంగం వైపు స్థిరంగా నడిపించింది.

  • స్పేస్ ఎడ్యుకేషన్, అవకాశాల గురించి విద్యార్థులకు మీరు ఇచ్చే సూచనలు..

జాహ్నవి : ఒకప్పుడు అంతరిక్ష రంగం అంటే కేవలం ప్రభుత్వ సంస్థలకే పరిమితం అనుకునేవారు. కానీ ఇప్పుడు చాలా ప్రైవేట్ స్టార్టప్‌లు వస్తున్నాయి. ఈ రంగంలో పనిచేయడానికి మీరు కేవలం సైంటిస్ట్ లేదా ఇంజనీర్ మాత్రమే కానక్కర్లేదు, డేటా అనలిస్ట్‌గా కూడా కెరీర్ ప్రారంభించవచ్చు. ఇంటర్న్‌షిప్‌ల ద్వారా విద్యార్థులకు ఇప్పుడు బోలెడు అవకాశాలు ఉన్నాయి.

  • అంతరిక్ష పరిశోధనల్లో ఏఐ పాత్ర ఎలా ఉంది?

జాహ్నవి : ఏఐ చాలా కీలకమైన పాత్ర పోషిస్తోంది. నేను ఇటీవల చేసిన మిషన్ సిమ్యులేషన్లలో క్రూ సైంటిస్ట్‌గా వ్యవహరించాను. అప్పుడు ఏఐ ద్వారా భారీ డేటాను చాలా సులభంగా విశ్లేషించగలిగాను. అలాగే అంగారక గ్రహం (Mars) వంటి చోట్ల ఊహించని పరిస్థితులను అంచనా వేయడానికి.. అక్కడ ఉండే 15-20 నిమిషాల కమ్యూనికేషన్ ఆలస్యాన్ని మేనేజ్ చేయడానికి ఏఐ ఎంతో అవసరం.

ఇలా ఎన్నో అంశాలపై జాహ్నవి ఏబీపీ స్మార్ట్ ఎడ్ కాన్‌క్లేవ్‌లో షేర్ చేసుకున్నారు. అమ్మాయిలు స్పేస్ రంగంలోకి రావడానికి కూడా పలు సూచనలు ఇచ్చారు. దానికి సంబంధించిన పూర్తి వీడియో ఇక్కడ ఉంది. క్లిక్ చేసి చూసేయండి. 

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
NEET SUPREME COURT:నీట్-యూజీ విధానంలో భారీ మార్పులు!మెయిన్, అడ్వాన్స్‌డ్ మోడల్‌లో చేయనున్నట్టు సుప్రీంకోర్టు చెప్పిన కేంద్రం!
నీట్-యూజీ విధానంలో భారీ మార్పులు!మెయిన్, అడ్వాన్స్‌డ్ మోడల్‌లో చేయనున్నట్టు సుప్రీంకోర్టు చెప్పిన కేంద్రం!

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Vishwanath And Sons Story : సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
మారుతి గ్రాండ్ విటారా నుంచి బలెనో వరకు సూపర్‌ ఆఫర్లు - రూ.1.55 లక్షల వరకు డిస్కౌంట్
ఇప్పుడు మారుతి కారు కొనేవాళ్లు నక్క తోక తొక్కినట్లే, రూ.లక్షల్లో డిస్కౌంట్లు!
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
Embed widget