Womens Day 2026 Wishes : అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు.. మీ లైఫ్‌లో స్పెషల్ మహిళలకు ఉమెన్స్ డే విషెష్ ఇలా చెప్పేయండి
Womens Day 2026 Wishes in Telugu : మీ లైఫ్‌లో ప్రతి దశలో మీకు తోడుగా ఉన్న మహిళలకు థ్యాంక్స్ చెప్పే సమయం ఇది. వాట్సాప్, సోషల్ మీడియాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి.

International Women’s Day History and Wishes : ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళల దినోత్సవం (International Womens Day)ను జరుపుకుంటారు. మహిళల హక్కులు, సమానత్వం, సామాజిక–ఆర్థిక అభివృద్ధి కోసం మహిళలు చేసిన పోరాటాన్ని గుర్తు చేస్తూ ఉమెన్స్ డే నిర్వహిస్తూ.. సెలబ్రేట్ చేస్తారు. అసలు ఈ స్పెషల్ డే చరిత్ర, ప్రాముఖ్యత ఏంటి? మీ లైఫ్‌లో స్పెషల్ మహిళలకు ఎలా ఉమెన్స్ డే విషెష్ చెప్పవచ్చో చూసేద్దాం.
ఉమెన్స్ డే చరిత్ర
అంతర్జాతీయ మహిళా దినోత్సవం కోసం పునాది 1908లో పడింది. ఆ సమయంలో అమెరికాలో మహిళా కార్మికులు తక్కువ వేతనాలు, ఎక్కువ పని గంటలు, ఓటు హక్కు కోసం ఉద్యమాలు చేపట్టారు. తర్వాత 1910లో డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌లో అంతర్జాతీయ మహిళా సదస్సు జరిపి.. మహిళల హక్కుల కోసం ప్రత్యేక దినోత్సవాన్ని జరపాలని ప్రతిపాదించారు. 1911లో మొదటిసారిగా కొన్ని యూరోప్ దేశాల్లో మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. తరువాత 1975లో United Nations అధికారికంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది మార్చి 8వ తేదీన ఉమెన్స్ డే జరుపుకుంటున్నాము.
మహిళ దినోత్సవం ఎందుకు చేసుకోవాలంటే..
మహిళల సాధికారతను గుర్తు చేస్తూ.. సమాజంలోని అన్ని రంగాల్లో మహిళలు సమాన అవకాశాలు పొందేలా అవగాహన కల్పించడమే ఉమెన్స్ డే లక్ష్యం. మహిళల హక్కుల పరిరక్షణ, లింగ సమానత్వంపై అవగాహన, మహిళల విజయాలను గౌరవించడం, సమాజంలో మహిళల పాత్రను గుర్తించడం, విద్య, విజ్ఞానం, రాజకీయాలు, క్రీడలు, వ్యాపారం వంటి ప్రతి రంగంలో మహిళలు అద్భుత విజయాలు గుర్తు చేస్తూ స్ఫూర్తి పెంచడమే లక్ష్యంగా దీనిని ముందుకు తీసుకెళ్తున్నారు.
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
- ప్రతి మహిళ శక్తి, ధైర్యం, ప్రేమకు ప్రతీక. మా జీవితాన్ని సానుకూలంగా ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికీ.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
- నాన్న లేని లోటు నాకు తెలియకుండా.. నాకు మంచి లైఫ్ ఇచ్చేందుకు నువ్వు పడిన కష్టాన్ని నేను ఎప్పటికీ మరచిపోలేను అమ్మ. నాకు తెలిసినా స్ట్రాంగెస్ట్ ఉమెన్ నువ్వు. అలాంటి నీ ప్రేమను ప్రతి రోజూ సెలబ్రేట్ చేయాలి. కానీ ఈ రోజు మరింత స్పెషల్‌గా హ్యాపీ ఉమెన్స్ డే అమ్మ.
- మీ కలలు నిజం కావాలి.. మీ అడుగులు ప్రపంచాన్ని మార్చాలి. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
- అమ్మగా, అక్కగా, స్నేహితురాలిగా.. ప్రతి రూపంలో మహిళ పాత్ర అమూల్యమైనది. అలాంటి వారందరికీ హ్యాపీ ఉమెన్స్ డే.
- మహిళలకు గౌరవం ఉన్న చోటే నిజమైన అభివృద్ధి ఉంటుంది. ప్రతి మహిళా దానికి అర్హురాలని గుర్తు చేస్తూ.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
- దేవుడు ఇచ్చిన స్పెషల్ సిస్టర్‌కు హ్యాపీ ఉమెన్స్ డే. నీవల్ల నా లైఫ్‌లో చాలా మార్పులు చూశాను తల్లి. మహిళలకు గౌరవం ఎందుకు అవసరమో నీవల్లే తెలిసింది నాకు.
- మీ ధైర్యం మరెందరికో స్ఫూర్తి కావాలి. జగతిలో మార్పు తీసుకుని రావాలి. హ్యాపీ ఉమెన్స్ డే.
- ప్రతి మహిళ తనలోని శక్తిని నమ్మితే ప్రపంచం మారుతుంది. ప్రతి మగవాడు ఆమె శక్తిని గుర్తించి కామ్రెడ్‌గా తోడుండాలని కోరుకుంటూ హ్యాపీ ఉమెన్స్ డే.
- సమానత్వం, గౌరవం, స్వేచ్ఛ అనేది ప్రతి మహిళకు లభించాలి. అది వారి హక్కు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
- మీ నవ్వు కుటుంబానికి ఆనందం.. సమాజానికి ఆశ. హ్యాపీ ఉమెన్స్ డే.
- మహిళలు ఎదిగితే సమాజం ఎదుగుతుంది. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
- మీ బలం, మీ ఆత్మవిశ్వాసం ప్రపంచానికి వెలుగునిస్తుంది. అలాంటి మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ హ్యాపీ ఉమెన్స్ డే.
ఇలా మీ లైఫ్‌లో ప్రతి మహిళకు ఉమెన్స్ డే విషెష్ చెప్పవచ్చు. వాట్సాప్, ఇన్స్టాలలో షేర్ చేసేందుకు.. స్టోరీలలో తెలుగులో విషెష్ చెప్పేందుకు అనువైనవి. మీరు మీ స్పెషల్ పర్సన్ ఫోటోతో లేదా ఉమెన్స్ డే కోట్తో వీటిని సోషల్ మీడియాలో షేర్ చేయవచ్చు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















