ఈ కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ చర్లపల్లి జంక్షన్ నుంచి కన్యాకుమారికి సమీపంలో ఉన్న నాగర్‌కోయిల్ వరకు నడుస్తుంది.
Hyderabad to Kanyakumari Amrit Bharat Express : హైదరాబాద్ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్ భారత్, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
కొత్త అమృత్ భారత్ రేల్ కేవలం రవాణా సౌకర్యం మాత్రమే కాదు, ఇదొక ఆధ్యాత్మిక యాత్రగా నిలవనుంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్ర మీదుగా సాగుతూ ఎన్నో చారిత్రక ఆధ్యాత్మిక కేంద్రాలను అనుసంధానిస్తుంది.

- చర్లపల్లి నుండి నాగర్‌కోయిల్ వరకు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం.
- తెలంగాణలో నాలుగో అమృత్ భారత్ రైలు, దక్షిణ యాత్రకు సౌకర్యం.
- ఆధునిక సౌకర్యాలు, వైఫై, ఛార్జింగ్, బయో టాయిలెట్లతో ప్రయాణం.
- ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాలను కలిపే వారధిగా ఈ రైలు.
Hyderabad to Kanyakumari Amrit Bharat Express : దక్షిణ భారత్‌లో రైల్వే మ్యాప్‌లో మరో కీలక ఘట్టం అవిష్కృతం కానుంది. తెలుగు రాష్ట్రాల ప్రయాణికుల చిరకాల వాంఛను నెరవేరుస్తూ, ఆధ్యాత్మిక వైభవాన్ని, ఆధునిక ప్రయాణ సౌకర్యాలను మేళవించిన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ఇప్పుడు భాగ్యనగరం నుంచి సాగర తీరం వైపు పరుగులు తీయడానికి సిద్ధమైంది. చర్లపల్లి జంక్షన్ నుంచి కన్యాకుమారికి అతి సమీపంలో ఉండే నాగర్‌కోయిల్ వరకు ఈ కొత్త రైలును భారత రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకువస్తోంది.
మార్చి 11న ముూర్తం- తెలంగాణకు నాల్గో అమృత్ భారత్ రైలు
రైల్వే వర్గాల సమాచారం ప్రకారం, ఈ ప్రతిష్టాత్మక రైలు ఈ నెల 11న అధికారికంగా తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఈ ప్రారంభంతో తెలంగాణ రాష్ట్రంలో నడిచే అమృత్ భారత్ రైళ్ల సంఖ్య నాలుగుకు చేరుకుంటుంది. వీటిలో మూడు రైళ్లు నేరుగా హైదరాబాద్ మీదుగానే ప్రయాణిస్తున్నాయి. ప్రస్తుతం చర్లపల్లిి నుంచి ముజఫర్‌పూర్(బిహార్), చర్లపల్లి నుంచి తిరువనంతపురం(కేర) మధ్య ఇప్పటికే విజయవంతంగా నడుస్తున్నాయి. వరంగల్ మీదుగా కూడా ఒక రైలు అందుబాటులో ఉంది.
జనవరి నుంచే ఎదురు చూపులు
నిజానికి ఈ రైలు జనవరిలోనే ప్రారంభించాలని రైల్వే శాఖ ప్లాన్ చేసింది. అప్పట్లో చర్లపల్లి నుంచి కేరళ రాజధాని తిరువనంతపురం వరకు నడిచే రైలుకు మంచి స్పందన రావడంతో, ప్రభుత్వం ఈ కొత్త నాగర్‌కోయిల్ మార్గానికి కూడా పచ్చజెండా ఊపింది. అయితే రైలుకు సంబంధించిన రేక్ అందుబాటులో లేకపోవడంతో కొంత ఆలస్యం జరిగింది. తాజాగా ఆ సాంకేతిక ఇబ్బందులు తొలగిపోవడంతో ట్రయల్ రన్‌లు పూర్తి చేసుకొని పూర్తి స్థాయి వాణిజ్య ప్రయాణాలకు ఈ రైలు సిద్ధమైంది.
ఆధునిక హంగులు- రాజభోగ ప్రయాణం
భారత రైల్వే ఆధునీకరణలో భాగంగా ప్రవేశ పెట్టిన అమృత్ భారత్ రైళ్లు ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని అందిస్తున్నాయి. కేవలం వేగం మాత్రమే కాకుండా, సౌకర్యాల విషయంలో కూడా ఈ రైళ్లు విమాన ప్రయాణంతో పోటీ పడుతున్నాయి.
ఈ రైలులో పూర్తి ఎయిర్ కండిషన్డ్‌కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. ఇది సుదీర్ ప్రయాణానికి అత్యంత సుఖవంతం చేస్తుంది. ప్రయాణికుల కోసం హై స్పీడ్ వైఫై సదుపాయం, ప్రతి సీటు వద్ద మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఆధునిక బయో టాయిలెట్లు ఈ రైలులో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఇవి పర్యావరణహితంగా ఉండటమే కాకుండా స్టేషన్ల వద్ద పరిశుభ్రతను కాపాడతాయి.
ఆధ్యాత్మిక వారధి- దక్షిణ పుణ్యక్షేత్రాల కలయిక
ఈ కొత్త అమృత్ భారత్ రేలు కేవలం రవాణా సౌకర్యం మాత్రమే కాదు, ఇదొక ఆధ్యాత్మిక యాత్రగా నిలవనుంది. చర్లపల్లి నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రయాణం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్ర మీదుగా సాగుతూ ఎన్నో చారిత్రక ఆధ్యాత్మిక కేంద్రాలను అనుసంధానిస్తుంది. ప్రపంచ ప్రసిద్ధ మీనాక్షీ అమ్మన్ దేవాలయాన్ని దర్శించుకునే భక్తులకు ఈ రైతుల ఎంతో అనుకూలం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి, చార్‌ధామ్ యాత్రలో భాగమైన రామేశ్వరం శ్రీ రామనాథస్వామి దేవస్థానానికి వెళ్లే ప్రయాణికులకు ఇది సులభతర మార్గం. భారత్ భూభాగపు చిట్టచివరి పాయింట్ వద్ద ఉన్న భగవతి ఆలయం వివేకానంద రాక్ మెమోరియల్ సందర్శన ఈ ప్రయాణంలో ప్రధాన ఆకర్షణ. తమిళనాడులోని కుర్తాలం జలపాతాలను సందర్శించే పర్యాటకులకు కూడా ఈ రైలు మార్గం దగ్గరగా ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమైన క్షేత్రాలైన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవాలయం, తిరుపతి తిరుమల వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని, అక్కడి నుంచి దక్షిణాది యాత్రను కొనసాగించాలనుకునే వారికి అమృత్ భారత్ మంచి ఆప్షన్ అవుతుంది.
సామాన్యుడికి అందుబాటులో ప్రయాణం
అమృత్ భారత్ రైళ్లతో సామాన్య ప్రయాణికులకు తక్కువ ధరలో నాణ్యమైన సేవలు అందించడం, తక్కువ ఖర్చుతో ఎక్కువ పుణ్యక్షేత్రాలను చుట్టి రావాలని భావించే భక్తులకు, మధ్యతరగతి పర్యాటకులకు ఈ రైలు ఆర్థికంగా భారంగా అనిపించదు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లైదా మొబైల్ యాప్ ద్వారా ప్రయాణికులు తమ టికెట్లను ముందుగానే బుక్ చేసుకునే సౌకర్యం ఉంది.
షెడ్యూల్- నిర్వహణ
రైల్వే అధికారుల సమాచారం ప్రకారం ఈ కొత్త రైలు వారానికి రెండు రోజులు నడవనుంది. చర్లపల్లి నుంచి నాగర్ కోయిల్ వరకు సాగే ఈ సుదీర్ఘ ప్రయాణంలో దాదాపు 20కిపైగా స్టేషన్లలో రైలు నిలుస్తుంది. ప్రారంభ దశలో ప్రయాణికుల నుంచి వచ్చే స్పందనను, డిమాండ్‌ను బట్టి భవిష్యత్‌లో రోజువారీ సర్వీస్‌గా మార్చే అవకాశం లేదా కోచ్‌ల సంఖ్యను పెంచే ఆలోచనలో అధికారులు ఉన్నారు.
Frequently Asked Questions
కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ఎక్కడి నుంచి ఎక్కడికి నడుస్తుంది?
తెలంగాణలో ఎన్ని అమృత్ భారత్ రైళ్లు అందుబాటులోకి వస్తాయి?
ఈ కొత్త రైలు ప్రారంభంతో తెలంగాణలో నడిచే అమృత్ భారత్ రైళ్ల సంఖ్య నాలుగుకు చేరుకుంటుంది. వీటిలో మూడు హైదరాబాద్ మీదుగా ప్రయాణిస్తాయి.
కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?
ఈ ప్రతిష్టాత్మక రైలు మార్చి 11న అధికారికంగా తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది.
అమృత్ భారత్ రైలులో ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి?
ఈ రైలులో పూర్తి ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లు, హై స్పీడ్ వైఫై, ప్రతి సీటు వద్ద మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, ఆధునిక బయో టాయిలెట్లు వంటి సౌకర్యాలు ఉంటాయి.
ఈ రైలు ఏయే ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలను కలుపుతుంది?
ఈ రైలు మీనాక్షీ అమ్మన్ దేవాలయం, రామేశ్వరం, భగవతి ఆలయం, వివేకానంద రాక్ మెమోరియల్, కుర్తాలం జలపాతాలు, యాదాద్రి, భద్రాచలం, తిరుపతి వంటి అనేక ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాలకు అనుసంధానిస్తుంది.
ట్రెండింగ్ వార్తలు


















