అన్వేషించండి

ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది

Konaseema ONGC Blowout ఇరుసుమండలో సోమవారం ఓఎన్‌జీసీ పైప్ లైన్ లీకేజీ కావడంతో చెలరేగిన మంటలు మంగళవారం అదే సమయానికి 50 శాతం వరకు తగ్గాయి.

Malikipuram ONGC Blowout | మలికిపురం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో సంభవించిన బ్లోఅవుట్ మంటలు ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నాయి. సుమారు 15 గంటల పాటు భీకరంగా ఎగసిపడిన మంటల తీవ్రత ఇప్పుడు కొంత మేర తగ్గడంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ మంటలు ఇంకా అదుపులోకి రాలేదని అధికారులు తెలిపారు.  ఓఎన్జీసీ (ONGC) సాంకేతిక సిబ్బంది ఆధ్వర్యంలో మంటలను అదుపు చేసేందుకు సోమవారం ఉదయం నుంచి ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 

గొడుగు ఆకారంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది..

అంబ్రెల్లా ఫార్మ్ (గొడుగు రూపం) విధానం ద్వారా భారీ పైప్‌లైన్లతో గొడుగు ఆకారంలో నీటిని లోపలికి పంపిస్తూ, ఆ ప్రాంతాన్ని మొత్తం కూలింగ్ చేస్తున్నారు. నిన్నటితో పోల్చితే పరిస్థితి 50 శాతం వర మంటలు అదుపులోకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇరుసుమండలో ఘటనా స్థలంలో పరిస్థితిని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండగా, ఎంపీ హరీష్ మాధుర్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. 

సోమవారం నాడు మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో రింగ్ లోపలికి వెళ్లేందుకు సాహసించని ఓఎన్జీసీ సిబ్బంది, నేడు మంటలు కాస్త తగ్గడంతో దగ్గరకు వెళ్లి మంటలను పూర్తిగా ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఇప్పటికే ఇరుసుమండ గ్రామాన్ని అధికారులు పూర్తిగా ఖాళీ చేయించారు. గ్రామానికి చెందిన ప్రజలు గత రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. సమీప పరిసర ప్రాంతాల్లోని కొబ్బరి చెట్లు మంటలకు కాలిపోయాయి. చుట్టుపక్కల వరి రైతులు మంటల భయంతో నారుమళ్లు పనులు ఆపేశారు. ఈ బ్లూ అవుట్ రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. అయితే బాధిత రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటామని భరోసా ఇచ్చింది. 

బ్లో అవుట్ అంటే ఏమిటి?  
భూమి లోపల చమురు లేదా గ్యాస్ నిక్షేపాలు భారీ పీడనం వద్ద ఉంటాయి. వీటి కోసం మేషిన్లతో డ్రిల్లింగ్ చేసినప్పుడు, ఆ పీడనాన్ని నియంత్రించడానికి ప్రత్యేకమైన డ్రిల్లింగ్ మడ్ అనే ద్రవాన్ని బావిలోకి పంపుతారు. ఈ ద్రవం బరువు లోపలి పీడనాన్ని తగ్గిస్తుంది. అయితే, కొన్నిసార్లు భూగర్భంలో ఊహించని విధంగా పీడనం ఒక్కసారిగా పెరిగినప్పుడు లేదా డ్రిల్లింగ్ మడ్ బరువు తగ్గిన సమయంలో లోపలి గ్యాస్, చమురు నియంత్రణ తప్పి అత్యంత వేగంతో పైకి తన్నుకొస్తాయి. అలా రావాన్ని కిక్ అంటారు. ఈ కిక్ ను నియంత్రించలేకపోతే అది బ్లో అవుట్ గా మారి భారీగా ఆస్తి, ప్రాణనష్టం సంభవించేలా చేస్తుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Amalapuram Latest News: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Breaking News: నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Air India Phuket Delhi Flight: ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Embed widget