అన్వేషించండి

Hyundai Creta నుంచి Tata Sierra వరకు - కొత్త Seltos ముందు బలంగా నిలబడే కారు ఏది?

కొత్త Kia Seltos ధరలు, సైజు, ఇంజిన్‌ ఆప్షన్లు Hyundai Creta, Tata Sierra, Grand Vitara, Hyryder వంటి ప్రత్యర్థి కార్లతో పోలిస్తే ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలు తెలుసుకోండి.

New Kia Seltos Midsize SUV Comparison: భారత మార్కెట్‌లో మిడ్‌ సైజ్‌ SUVల విభాగం రోజురోజుకీ వేడెక్కుతోంది. ఈ పోటీని మరింత ఆసక్తికరంగా మారుస్తూ, కొత్త Kia Seltos సెకండ్‌ జనరేషన్‌ మోడల్‌ మార్కెట్‌లోకి వచ్చింది. కొత్త K3 ప్లాట్‌ఫామ్‌పై తయారైన ఈ SUV.... పాత మోడల్‌తో పోలిస్తే మరింత పొడవుగా, వెడల్పుగా ఉండటమే కాకుండా, వీల్‌బేస్‌ కూడా పెరిగింది. డిజైన్‌, ఫీచర్లు మాత్రమే కాదు, ధరల విషయంలో కూడా ప్రత్యర్థి కార్లకు గట్టి పోటీ ఇస్తోంది.

ధరల పోలికలో కొత్త Seltos స్థానం
కొత్త Kia Seltos ధరలు రూ.10.99 లక్షల నుంచి రూ.19.99 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌ ధర) వరకు ఉన్నాయి. ఇదే విభాగంలో ఉన్న Hyundai Creta ధర రూ.10.73 లక్షల నుంచి రూ.20.20 లక్షల వరకు వెళ్తోంది. Tata Sierra రూ.11.49 లక్షల నుంచి రూ.21.29 లక్షల వరకు ఉంది. ధరల వివరాలు ఇవిగో:

కొత్త కియా సెల్టోస్‌ vs రైవల్స్‌ - ధరల పోలిక (రూ.లక్షల్లో)

Seltos - 10.99-19.99
Creta - 10.73-20.20
Sierra - 11.49-21.29
Victoris - 10.5-19.9
Grand Vitara - 10.76-19.72
Hyryder - 10.99-19.76
Kushaq - 10.66-18.49
Taigun - 10.58-19.19
Aircross X - 8.29-13.69
Astor - 9.65-15.16 

టాప్‌ వేరియంట్‌ విషయానికి వస్తే.... Seltos ధర Creta, Sierra కంటే తక్కువగా ఉండటం గమనార్హం. Victoris, Grand Vitara, Hyryder లాంటి మోడళ్లతో పోలిస్తే కూడా Seltos రేటు బ్యాలెన్స్‌డ్‌గా ఉంది. బేస్‌ వేరియంట్‌ ధర Sierra కంటే తక్కువగా ఉండగా, Creta కంటే కొద్దిగా ఎక్కువగా ఉంది.

సైజ్‌లో ఏ కారు పెద్దది?
కొత్త Seltos, ఈ విభాగంలో పొడవులో ముందుంది. అయితే వెడల్పు, ఎత్తు, వీల్‌బేస్‌ విషయంలో Tata Sierra స్పష్టంగా పైచేయి సాధించింది. పెద్ద బూట్‌ స్పేస్‌, పెద్ద వీల్స్‌ కూడా Sierra బలమైన అంశాలు. Honda Elevate ఎక్కువ గ్రౌండ్‌ క్లియరెన్స్‌తో నిలుస్తే, Citroen Aircross X ఒక్కటే 7 సీట్ల ఆప్షన్‌ను ఇస్తోంది. అంటే అవసరాన్ని బట్టి ప్రతి SUVకి ప్రత్యేక బలం ఉంది.

ఇంజిన్‌ ఆప్షన్లు, పవర్‌
పవర్‌ట్రెయిన్‌ విషయంలో కొత్త Seltos చాలా బ్యాలెన్స్‌డ్‌గా కనిపిస్తుంది. నేచురల్‌ ఆస్పిరేటెడ్‌ పెట్రోల్‌, టర్బో పెట్రోల్‌, డీజిల్‌ అనే మూడు ఇంజిన్‌ ఆప్షన్లు అందిస్తోంది.
1.5 లీటర్‌ టర్బో పెట్రోల్‌ విభాగంలో Seltos, Creta, Sierra మూడు కూడా సమాన శక్తిని ఇస్తున్నాయి. అయితే టార్క్‌ విషయంలో Tata Sierra కొంచెం ముందుంది.
డీజిల్‌ ఆప్షన్‌ ఉన్న SUVలు Seltos, Creta, Sierra మాత్రమే. ఇందులో పవర్‌, టార్క్‌ పరంగా Sierra డీజిల్‌ ఇంజిన్‌ బలంగా ఉంది.

హైబ్రిడ్‌, CNGలో ప్రత్యర్థుల ఆధిక్యం
Maruti Grand Vitara, Victoris, Toyota Hyryder మోడళ్లు స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌ టెక్నాలజీతో పాటు ఫ్యాక్టరీ CNG ఆప్షన్‌ను అందిస్తున్నాయి. ఇంధన సామర్థ్యాన్ని చూసేవారికి ఇది పెద్ద ప్లస్‌. అయితే, Seltos మూడు ఇంజిన్‌లకూ రెండు గేర్‌బాక్స్‌ ఆప్షన్లు ఇవ్వడం ద్వారా ప్రత్యర్థులకు తగిన సమాధానం చెబుతోంది.

మొత్తం మీద, కొత్త Kia Seltos ధరలు, సైజు, ఇంజిన్‌ ఎంపికల విషయంలో చాలా సమతుల్యంగా ఉంది. హైబ్రిడ్‌ లేకపోయినా, ఫీచర్లు, డిజైన్‌, పనితీరు కలిపి చూసుకుంటే మిడ్‌ సైజ్‌ SUV విభాగంలో Seltos మళ్లీ ఒక బలమైన ప్లేయర్‌గా నిలుస్తోంది. Creta, Sierra లాంటి బలమైన ప్రత్యర్థుల మధ్య కూడా Seltos తన ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంటోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

349cc ఇంజిన్‌తో Triumph Bonneville T40 నిజమైన మైలేజ్ ఇదే.. 195 కిలోల బరువు ప్రభావం ఎంత?
ట్రయంఫ్ బోన్నెవిల్ T40 రియల్‌ మైలేజ్ టెస్ట్.. సిటీలో, హైవేపై లీటర్‌కు ఎంత ఇస్తుందో తెలుసా?
కొత్త Mini Cooper SE ఎలక్ట్రిక్‌ కారు.. స్టీరింగ్‌ పట్టుకుంటే 402km రేంజ్, యాక్సిలేటర్‌ తొక్కితే 218hp పవర్!
కారు చిన్నదైనా ధర మాత్రం రూ.53.9 లక్షలు! మినీ కూపర్ SEలో అంత స్పెషల్ ఏముంది?
ఒక కారంత పవర్‌తో Royal Enfield Himalayan 750 బైక్‌ లాంచ్‌, బుకింగ్స్ డిసెంబర్ 1 నుంచి ఓపెన్‌
రాయల్ ఎన్‌ఫీల్డ్ 'బిగ్‌ బైక్‌' హిమాలయన్ 750 లాంచ్.. ధర రూ.4.89 లక్షల నుంచి ప్రారంభం
Flex Fuel Cars Bikes: ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల రిజిస్ట్రేషన్లలో బైకుల సంఖ్య 14,928, కార్లు కేవలం 23.. ఇదేందయ్యా ఇదీ!
ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల్లో బైకులదే రాజ్యం.. కార్లను పట్టించుకున్నవాళ్లే లేకపాయ!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thiruparankundram Deepam: తిరుప్పరంకుండ్రం రాతిస్తంభంపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం.. కన్నీళ్లు పెట్టుకున్న భక్తులు
తిరుప్పరంకుండ్రం రాతిస్తంభంపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం.. కన్నీళ్లు పెట్టుకున్న భక్తులు
PM Modi: మా సంకల్పం అచంచలమైనది, ధైర్యంగా అడుగేద్దాం: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై ప్రధాని మోదీ
మా సంకల్పం అచంచలమైనది, ధైర్యంగా అడుగేద్దాం: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై PM Modi
విశాఖ కైలాసగిరిపై స్కూల్ బస్సు బోల్తా, విద్యార్థులకు గాయాలు - ఘటనపై పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఆరా
విశాఖ కైలాసగిరిపై స్కూల్ బస్సు బోల్తా, విద్యార్థులకు గాయాలు - ఘటనపై పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఆరా
MP Seats In AP and Telangana: గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
పుప్పాలగూడలో అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ సంస్థ దౌర్జన్యం.. కబ్జా చేసి రోడ్డు నిర్మాణంపై బాధితుల ఆగ్రహం
పుప్పాలగూడలో అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ సంస్థ దౌర్జన్యం.. కబ్జా చేసి రోడ్డు నిర్మాణంపై బాధితుల ఆగ్రహం
Adilabad News: జాబ్ మానేసి బ్రోకలీ సాగు, ఆదిలాబాద్ యువ రైతుకు అధిక లాభాలు.. ఆదర్శంగా నిలుస్తున్న శివశంకర్
జాబ్ మానేసి బ్రోకలీ సాగు, ఆదిలాబాద్ యువ రైతుకు అధిక లాభాలు.. ఆదర్శంగా నిలుస్తున్న శివశంకర్
Rohit Sharma - Pollard Combo: కొత్త కోచ్‌ పొలార్డ్ పై MI కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. సరైన వ్యక్తి అతడేనంటూ ప్రశంసలు
కొత్త కోచ్‌ పొలార్డ్ పై MI కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. సరైన వ్యక్తి అతడేనంటూ ప్రశంసలు
Delimitation Bill 2026: డీలిమిటేషన్ బిల్లు 2026.. ఇండియా కూటమికి స్టాలిన్, పవార్ షాక్ ? కేంద్రం పంతం నెగ్గుతుందా
డీలిమిటేషన్ బిల్లు 2026.. ఇండియా కూటమికి స్టాలిన్, పవార్ షాక్ ? కేంద్రం పంతం నెగ్గుతుందా
Embed widget