అన్వేషించండి

New Renault Duster Launch: రేపే మార్కెట్లోకి రేనాల్ట్ డస్టర్ రీ-ఎంట్రీ: అదిరిపోయే ఫీచర్లు, హైబ్రిడ్ ఇంజిన్‌తో న‌యా లుక్

ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన మిడ్-సైజ్ ఎస్‌యూవీ 'రేనాల్ట్ డస్టర్ మంగ‌ళ‌వారం అధికారికంగా విడుదల కానుంది. సరికొత్త డిజైన్, అత్యాధునిక టెక్నాలజీ, పవర్‌ఫుల్ హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్లతో వస్తోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రేనాల్ట్ డస్టర్ కొత్త అవతార్లో మళ్ళీ మార్కెట్లోకి అడుగుపెట్టింది.
  • ఆధునిక డిజైన్, ప్రీమియం ఇంటీరియర్, అధునాతన టెక్నాలజీతో ఆకట్టుకుంటోంది.
  • మూడు ఇంజిన్ ఆప్షన్లు, అత్యున్నత భద్రతా ఫీచర్లతో వస్తోంది.
  • ₹21,000 టోకెన్ అమౌంట్తో ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

New Renault Duster Launch: ఇండియన్ ఆటోమొబైల్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఒకప్పుడు దేశీయ రోడ్లపై సంచలనం సృష్టించిన రేనాల్ట్ డస్టర్, మంగ‌ళ‌వారం సరికొత్త హంగులతో మళ్ళీ మార్కెట్లోకి అడుగుపెడుతోంది. మూడవ తరం గ్లోబల్ మోడల్ ఆధారంగా రూపొందిన ఈ ఎస్‌యూవీని భారతీయ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా అనేక మార్పులతో తీర్చిదిద్దారు.

సూప‌ర్బ్ లుక్..

కొత్త డస్టర్ పాత మోడల్ కంటే మరింత ధృడంగా కనిపిస్తుంది. ముందు భాగంలో ఐబ్రో-స్టైల్ ఎల్‌ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు ఉన్నాయి. ఇవి టర్న్ ఇండికేటర్లుగా కూడా పనిచేస్తాయి. రీడిజైన్ చేసిన గ్రిల్ పై 'డస్టర్' అక్షరాలను స్పష్టంగా ప్రింట్ చేశారు. సిల్వర్ యాక్సెంట్లతో కూడిన బంపర్, పిక్సెల్-స్టైల్ ఫాగ్ లాంప్స్ దీనికి మోడ‌ర్న్ లుక్  ఇస్తాయి. వెనుక వైపు డిజైన్ కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.

లగ్జరీ ఇంటీరియర్

కారు లోపలి భాగంలో డ్యూయల్-స్క్రీన్ డాష్‌బోర్డ్ లేఅవుట్, పియానో బ్లాక్ ఫినిషింగ్ ఉన్న త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్ క్యాబిన్‌కు ప్రీమియం లుక్ ఇస్తాయి. సాఫ్ట్ టచ్ మెటీరియల్స్, యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్ ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా మారుస్తాయి. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, టైప్-సి ఛార్జింగ్ పోర్ట్స్ వంటి ఫీచ‌ర్లు టాప్ నాచ్ గా ఉన్నాయని కంపెనీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. 

టెక్నాలజీ, సెక్యూరిటీ

టెక్నాలజీ పరంగా ఇందులో 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేను సపోర్ట్ చేస్తుంది. గూగుల్ ఓఎస్ ఆధారిత 7 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ డ్రైవర్‌కు కావాల్సిన సమాచారాన్ని అందిస్తుంది. సెక్యూరిటీ కోసం ఆరు ఎయిర్ బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, లెవల్-2 అడాస్ (ADAS) వంటి అత్యున్నత ప్రమాణాలను చేర్చారు. 6-వే పవర్డ్ వెంటిలేటెడ్ సీట్లు సౌకర్యాన్ని పెంచుతాయి. రేనాల్ట్ ఈసారి మూడు రకాల ఇంజిన్లను పరిచయం చేస్తోంది. 

టాప్ వేరియంట్లలో 1.8 లీటర్ ఈ-టెక్ హైబ్రిడ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 160 బీహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అలాగే 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 160 బీహెచ్‌పి పవర్, 280 ఎన్ఎమ్ టార్క్‌ను ఇస్తుంది. బేస్ మోడల్ కోసం 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను కేటాయించారు. ఇది 100 బీహెచ్‌పి శక్తిని ఇస్తూ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పనిచేస్తుంది. కొత్త డస్టర్ కావాలనుకునే వారు రూ. 21,000 టోకెన్ అమౌంట్‌తో బుక్ చేసుకోవచ్చు. టర్బో పెట్రోల్ వేరియంట్లు ముందుగా అందుబాటులోకి రానున్నాయి. హైబ్రిడ్ వెర్షన్లు దీపావళి పండుగ నాటికి రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది.

Frequently Asked Questions

కొత్త రేనాల్ట్ డస్టర్ ఎప్పుడు మార్కెట్లోకి వస్తుంది?

కొత్త రేనాల్ట్ డస్టర్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. టర్బో పెట్రోల్ వేరియంట్లు ముందుగా అందుబాటులోకి రానున్నాయి. హైబ్రిడ్ వెర్షన్లు దీపావళి నాటికి వచ్చే అవకాశం ఉంది.

కొత్త డస్టర్ లో ఎలాంటి ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి?

కొత్త డస్టర్ లో మూడు రకాల ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. 1.8 లీటర్ ఈ-టెక్ హైబ్రిడ్, 1.3 లీటర్ టర్బో పెట్రోల్, మరియు 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్లు అందుబాటులో ఉన్నాయి.

కొత్త డస్టర్ లో ఏయే టెక్నాలజీ ఫీచర్లు ఉన్నాయి?

కొత్త డస్టర్ లో 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, 7 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

కొత్త డస్టర్ బుకింగ్ ఎలా చేసుకోవాలి?

కొత్త డస్టర్ ను రూ. 21,000 టోకెన్ అమౌంట్‌తో బుక్ చేసుకోవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

Toyota Fortuner Legender కొనాలంటే నెల జీతం ఎంత ఉండాలి? EMI ఎంత చెల్లించాలి
Toyota Fortuner Legender కొనాలంటే నెల జీతం ఎంత ఉండాలి? EMI ఎంత చెల్లించాలి
రూ.1.5 లక్షలు చెల్లించి 6 సీటర్ Mahindra XEV 9S తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1.5 లక్షలు చెల్లించి 6 సీటర్ Mahindra XEV 9S తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి
8 స్పీడ్‌ AT నుంచి సీట్‌ మసాజర్‌ వరకు.. కొత్త స్కోడా స్లావియాలో వచ్చిన ఇంప్రూవ్‌మెంట్స్‌ ఇవే
పాత స్లావియాకు గుడ్‌బై చెప్పొచ్చు! కొత్త స్లావియా ఫేస్‌లిఫ్ట్‌లో అదిరిపోయే అప్‌డేట్స్‌
మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్‌ వచ్చేస్తోంది.. ధర పెరిగినా ఫీచర్లలో మాత్రం అదిరిపోయే అప్‌డేట్స్!
సెప్టెంబర్ 5న కొత్త మారుతి బలెనో.. భారీ స్క్రీన్‌ నుంచి న్యూ లుక్‌ వరకు కీలక మార్పులు!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Arpitha Mohithe: తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Embed widget