అన్వేషించండి

FASTag Rules India :ఫాస్ట్‌ట్యాగ్ వినియోగంలో ఈ నియమాలు మీకు తెలుసా? ఈ పొరపాట్లు చేస్తే రెట్టింపు బాదుడే!

FASTag Rules India :జాతీయ రహదారులపై ప్రయాణించే వారు ఫాస్ట్‌ట్యాగ్ నిబంధనల పట్ల అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరం. ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారులు గమనించాల్సిన ఐదు ముఖ్యమైన విషయాలివే.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • విండ్‌స్క్రీన్‌కు ఫాస్ట్‌ట్యాగ్ అంటించకపోతే రెట్టింపు టోల్ వసూలు.
  • రోడ్డు పనులు జరుగుతున్నప్పుడు సగం టోల్ మాత్రమే చెల్లించాలి.
  • యూపీఐ చెల్లింపులకు ప్రోత్సాహకంగా కొంత రాయితీ ఇస్తారు.
  • సమస్యలు, ఫిర్యాదుల కోసం 1033 నంబర్‌కు కాల్ చేయండి.

FASTag Rules India :జాతీయ రహదారులపై ప్రయాణించే వారు ఫాస్ట్‌ట్యాగ్ నిబంధనల పట్ల అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరం. ట్యాగ్ అంటించకపోయినా, రోడ్డు పనులు జరుగుతున్నా టోల్ ధరల్లో మార్పులు ఉంటాయి.  ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారులు గమనించాల్సిన ఐదు ముఖ్యమైన విషయాలివే.

ఇండియాలోని జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనాలకు ఫాస్ట్‌ ట్యాగ్ ఇప్పుడు అనివార్యంగా మారింది. ఆర్‌ఎఫ్‌ఐడీ (RFID) సాంకేతికతతో పనిచేసే ఈ ట్యాగ్ ద్వారా టోల్ ప్లాజాల వద్ద నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నాయి. టోల్ ప్లాజా మీదుగా వాహనం వెళ్లేటప్పుడు ఆటోమేటిక్‌గా అమౌంట్ కట్ అవుతుంది. ప్రతి లావాదేవీకి సంబంధించి మొబైల్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది. అయితే చాలా మందికి తెలియని కొన్ని కీలక నిబంధనల గురించి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) క్లారిటీ ఇచ్చింది.

విండ్‌స్క్రీన్‌కు ట్యాగ్ అంటించకపోతే రెట్టింపు ఫీజు

చాలామంది ఫాస్ట్‌ట్యాగ్‌ను కారు ముందు అద్దానికి అంటించకుండా చేతితో చూపిస్తుంటారు. ఇలా చేయడం వల్ల టోల్ ప్లాజాల వద్ద స్కానింగ్ ఆలస్యమవుతుంది. దీనిని అరికట్టేందుకు NHAI కఠిన నిబంధన తెచ్చింది. వాహనం లోపలి వైపు నుంచి అద్దానికి ట్యాగ్‌ను సరిగ్గా అంటించకపోతే, ఆ వాహనం నుంచి రెట్టింపు టోల్ ఫీజు వసూలు చేస్తారు. ఈ నిబంధన వల్ల ఇతర వాహనదారులకు అనవసరమైన ఆలస్యం కలగకుండా ఉంటుంది.

నిర్మాణ సమయంలో సగం టోల్ మాత్రమే

జాతీయ రహదారులపై మరమ్మతులు లేదా రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నప్పుడు ప్రయాణీకులకు కలిగే అసౌకర్యాన్ని కేంద్ర రహదారి రవాణా శాఖ గుర్తించింది. రహదారిని నాలుగు లేదా ఆరు లేన్లుగా మార్చే పనులు సాగుతున్న సమయంలో, పాత టోల్ ధరలో కేవలం 50 శాతం మాత్రమే వసూలు చేయాలి. ఉదాహరణకు అక్కడ టోల్ ధర రూ.50 ఉంటే, నిర్మాణం పూర్తయ్యే వరకు వాహనదారులు రూ.25 చెల్లిస్తే సరిపోతుంది.

యూపీఐ చెల్లింపులపై డిస్కౌంట్

ఫాస్ట్‌ట్యాగ్ లేకుండా టోల్ లేన్‌లోకి ప్రవేశించే వాహనాలకు నగదు రూపంలో చెల్లిస్తే రెట్టింపు ధర వసూలు చేస్తారు. ఒకవేళ వాహనదారులు యూపీఐ (UPI) ద్వారా చెల్లించాలని భావిస్తే, అప్పుడు వర్తించే ఫీజులో 1.25 రెట్లు అధికంగా వసూలు చేస్తారు. నగదు లావాదేవీలను తగ్గించి డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఫిర్యాదుల కోసం ప్రత్యేక సదుపాయం

ప్రయాణంలో తలెత్తే సమస్యలు లేదా ఫిర్యాదుల కోసం వాహనదారులు 1033 హెల్ప్‌లైన్ నంబర్‌కు డయల్ చేయవచ్చు. అలాగే 'రాజ్‌మార్గ్‌యాత్ర' యాప్ ప్రయాణీకులకు డిజిటల్ తోడుగా నిలుస్తుంది. ఇందులో రహదారి వివరాలు, సమీపంలోని ఆసుపత్రులు, పెట్రోల్ బంకులు, ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు, వాతావరణ సమాచారం వంటి వివరాలు లభిస్తాయి. రహదారి భద్రత, పారదర్శకత కోసం ఈ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించడం అవసరం.

Frequently Asked Questions

ఫాస్ట్‌ట్యాగ్‌ను విండ్‌స్క్రీన్‌కు సరిగ్గా అంటించకపోతే ఏమి జరుగుతుంది?

వాహనం లోపలి వైపు నుంచి విండ్‌స్క్రీన్‌కు ట్యాగ్‌ను సరిగ్గా అంటించకపోతే, రెట్టింపు టోల్ ఫీజు వసూలు చేస్తారు.

రోడ్డు నిర్మాణం జరుగుతున్నప్పుడు ఎంత టోల్ చెల్లించాలి?

రోడ్డు విస్తరణ లేదా మరమ్మతులు జరుగుతున్నప్పుడు, పాత టోల్ ధరలో కేవలం 50 శాతం మాత్రమే వసూలు చేస్తారు.

యూపీఐ (UPI) ద్వారా చెల్లింపులపై ఏదైనా డిస్కౌంట్ ఉందా?

ఫాస్ట్‌ట్యాగ్‌ లేనివారు యూపీఐ ద్వారా చెల్లిస్తే, వర్తించే ఫీజులో 1.25 రెట్లు అధికంగా వసూలు చేస్తారు.

ఫాస్ట్‌ట్యాగ్‌కు సంబంధించిన ఫిర్యాదులను ఎక్కడ చేయాలి?

ఫాస్ట్‌ట్యాగ్‌కు సంబంధించిన సమస్యల కోసం 1033 హెల్ప్‌లైన్ నంబర్‌కు డయల్ చేయవచ్చు లేదా 'రాజ్‌మార్గ్‌యాత్ర' యాప్‌ను ఉపయోగించవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

ఖరీదైన కార్లలోనే ADAS ఉంటుందని అనుకుంటున్నారా? మీ బడ్జెట్‌లోనే అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు
ఖరీదైన కార్లకు దీటుగా ADAS ఉన్న 'బడ్జెట్‌ కార్లు'.. రూ.9.39 లక్షలకే సొంతం చేసుకోవచ్చు!
Best selling car: దేశవ్యాప్తంగా జనం ఈ కారు కోసం షోరూమ్‌ ముందు క్యూ కట్టారు, మీ బడ్జెట్‌లోనే వస్తుంది!September 2026 best selling cars in India Maruti Baleno price
సేల్స్‌లో దేశంలోనే నంబర్ 1 ఈ మారుతి కారు.. ధర రూ.6 లక్షల లోపే!
ఎలక్ట్రిక్ కార్లతో జర జాగ్రత్త.. చిన్న పొరపాటుతో భారీ ప్రమాదం! EV వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిన భద్రత సూచనలు!
విజయవాడలో నలుగురి ప్రాణాలు తీసిన EV ప్రమాదం! ఎలక్ట్రిక్ కార్లలో మంటలు రాకుండా ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
EV Tyres: ఎలక్ట్రిక్‌ కార్లకు సాధారణ కారు టైర్లు వాడుతున్నారా? ఈ తప్పులతో రేంజ్‌ తగ్గడమే కాదు.. ప్రమాదం కూడా!
సాధారణ కారు టైర్లు vs ఎలక్ట్రిక్‌ కార్‌ టైర్లు... రెండూ ఒకటి కాదా? తేడా ఏంటి?

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Viral News: స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Papikondalu Tour: పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
EV Tyres: ఎలక్ట్రిక్‌ కార్లకు సాధారణ కారు టైర్లు వాడుతున్నారా? ఈ తప్పులతో రేంజ్‌ తగ్గడమే కాదు.. ప్రమాదం కూడా!
సాధారణ కారు టైర్లు vs ఎలక్ట్రిక్‌ కార్‌ టైర్లు... రెండూ ఒకటి కాదా? తేడా ఏంటి?
Embed widget