అన్వేషించండి

IPS Sunil Nayak: ఐపీఎస్ సునీల్ నాయక్ అరెస్టులో చట్టపరమైన చిక్కుముడి - నాన్ బెయిలబుల్ వారెంట్‌తో చెక్ పెట్టవచ్చా?

Sunil Naik: బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ అరెస్టు వ్యవహారం న్యాయపరంగా క్లిష్టంగా మారుతోంది. పట్నా కోర్టు ట్రాన్సిట్ వారెంట్‌ను తిరస్కరించినా ఏపీలో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.

Bihar cadre IPS officer Sunil Naik:  ప్రస్తుత ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్‌ను అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు పట్నాలో చేసిన ప్రయత్నం తొలి విడతలో విఫలమైంది. నిబంధనల ప్రకారం స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం, సరైన అరెస్టు వారెంట్, అప్‌డేటెడ్ కేస్ డైరీని సమర్పించకపోవడంతో పట్నా సివిల్ కోర్టు ట్రాన్సిట్ వారెంట్ దరఖాస్తును తిరస్కరించింది. అంతేకాకుండా, తదుపరి 30 రోజుల పాటు ఆయనపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించడం పోలీసులకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. వెంటనే  సునీల్ నాయక్ అజ్ఞాతంలోకి వెళ్లడం, ఆయన కోసం ఎస్పీ దామోదర్ బృందం పట్నాలోనే వేచి ఉండటం ఉత్కంఠను రేపుతోంది.  

అరెస్టు చేయడానికి అవకాశాలు           

చట్టపరంగా చూస్తే  ఒకసారి ట్రాన్సిట్ వారెంట్‌ను కోర్టు తిరస్కరించినంత మాత్రాన అరెస్టు చేసే అవకాశం పూర్తిగా పోయిందని భావించలేమని న్యాయవర్గాలు చెబుతున్నాయి. అయితే, పట్నా కోర్టు ఎత్తిచూపిన ప్రొసీజరల్ ల్యాప్సెస్‌ను సవరించుకోవడం పోలీసులకు అత్యవసరం. ఇప్పుడు ఏపీలో కొత్తగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. దీనిని అమలు చేయడానికి పోలీసులు పట్నా మళ్ళీ కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది. అయితే, పట్నా కోర్టు ఇప్పటికే ఇచ్చిన  30 రోజుల రక్షణ ఉత్తర్వు అమల్లో ఉన్నంత వరకు, ఆ గడువు ముగియకముందే అరెస్టు చేయడం చట్టపరంగా సవాలుతో కూడుకున్న పని అని భావిస్తున్నారు.        

అక్కడి కోర్టు అనుమతి తప్పనిసరి        

సునీల్ నాయక్ ప్రస్తుతం ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. పట్నా కోర్టు ఇచ్చిన రక్షణ కేవలం తాత్కాలికమే కాబట్టి, హైకోర్టులో ఆయనకు ఊరట లభించకపోతే అరెస్టు చేసే మార్గం సుగమం అవుతుంది. ఒకవేళ ఆయన ఆజ్ఞాతంలో ఉండి విచారణకు సహకరించకపోతే, పోలీసులు ఆయనను  పరారీలో ఉన్న నిందితుడి గా   ప్రకటించి, సెక్షన్ 82 కింద  ఠిన చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది. ఈ లోపు పట్నా కోర్టు తీర్పుపై ఏపీ పోలీసులు పైకోర్టులో అప్పీల్ చేసే అవకాశం కూడా ఉంది.         

పట్నాలోనే ఎస్పీ దామోదర్ బృందం           

ప్రస్తుతానికి ఎస్పీ దామోదర్ బృందం పట్నాలో సునీల్ నాయక్ కదలికలపై నిఘా ఉంచింది. లీగల్ గా ట్రాన్సిట్ వారెంట్ తిరస్కరణకు గురైనందున, కేవలం కొత్త వారెంట్ ఉన్నంత మాత్రాన నేరుగా అరెస్టు చేసి తీసుకురావడం సాధ్యం కాదు. నిందితుడిని స్థానిక మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి, అక్కడి నుండి మరో రాష్ట్రానికి తీసుకెళ్లేందుకు అనుమతి తీసుకోవడం భారత శిక్షాస్మృతి  ప్రకారం తప్పనిసరి. కాబట్టి, ఏపీ పోలీసులు హైకోర్టు ఆదేశాల కోసం లేదా పట్నా కోర్టు ఇచ్చిన గడువు ముగిసే వరకు వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.          

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan meets Chandrababu : గ్రామ వికాసమే లక్ష్యం - చంద్రబాబు-పవన్ భేటీలో కీలక నిర్ణయాలు
గ్రామ వికాసమే లక్ష్యం - చంద్రబాబు-పవన్ భేటీలో కీలక నిర్ణయాలు
Pawan Kalyan Meets CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
Karumuri Nageswara Rao: కారుమూరి నాగేశ్వరరావుపై మరో కేసు నమోదు, సిట్ అధికారికే లంచం ఇచ్చే ప్రయత్నం!
కారుమూరి నాగేశ్వరరావుపై మరో కేసు నమోదు, సిట్ అధికారికే లంచం ఇచ్చే ప్రయత్నం!
Kesineni Chinni vs MLA Kolikapudi: కళ్యాణోత్సవంలో టీడీపీ ఎంపీకి షాక్.. ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావు అనుచిత ప్ర‌వ‌ర్త‌న
కళ్యాణోత్సవంలో టీడీపీ ఎంపీకి షాక్.. ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావు అనుచిత ప్ర‌వ‌ర్త‌న
Advertisement

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy : 99 రోజుల పాటు అలుపెరుగని పరుగే - కలెక్టర్లకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
99 రోజుల పాటు అలుపెరుగని పరుగే - కలెక్టర్లకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
Iran Israel War 2026:వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
CPM leader impeached: జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
ABP Desam Smart Ed Conclave 2026: AI యుగంలో డిగ్రీలు ఉంటే సరిపోవు! స్కిల్ ఉన్నోడికే గుర్తింపు! ABP Desam Smart Ed Conclave 2026లో నిపుణుల సూచన!
AI యుగంలో డిగ్రీలు ఉంటే సరిపోవు! స్కిల్ ఉన్నోడికే గుర్తింపు! ABP Desam Smart Ed Conclave 2026లో నిపుణుల సూచన!
Manchu Manoj Wedding Anniversary: మౌనికతో మనోజ్ వివాహ బంధానికి మూడేళ్లు... ఒక్కటిగా ముందడుగు, వరుస విజయాలు
మౌనికతో మనోజ్ వివాహ బంధానికి మూడేళ్లు... ఒక్కటిగా ముందడుగు, వరుస విజయాలు
Pawan Kalyan Meets CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
Renu Desai: సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!
సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!
Tatkal Booking New Rules: రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌లో మార్పులు! సామాన్యులకు గుడ్ న్యూస్; ఏజెంట్ల ఆగడాలకు చెక్!
రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌లో మార్పులు! సామాన్యులకు గుడ్ న్యూస్; ఏజెంట్ల ఆగడాలకు చెక్!
Embed widget