టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
టీ20 వరల్డ్ కప్ 2026 ఎవ్వరూ చూడరంటూ టీమిండియా మాజీ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఒకప్పుడు ఐసీసీ టోర్నమెంట్ అంటే నాలుగేళ్లకు ఒకసారి మాత్రమే జరిగేదని, అందుకే అప్పట్లో బాగా ఎగ్జైట్‌మెంట్ ఉండేదని, కానీ ఇప్పుడు ప్రతి ఏడాది మూడు, నాలుగు టోర్నీలో జరుగుతుంటే ఆ ఎగ్జైట్‌మెంట్ లేకుండా పోతోందని అన్నాడు అశ్విన్. అంతేకాకుండా.. ‘ఒకప్పుడు ఐసీసీ టోర్నీల్లో బారత టీమ్ ఇంగ్లండ్, శ్రీలంక లాంటి టఫ్ టీమ్ప్‌తో టోర్నీ స్టార్ట్ చేసేది. కానీ ఈ సారి టీ20 వరల్డ్ కప్‌లో యూఎస్‌ఏ, నమీబియా లాంటి పిల్ల టీమ్‌లతో టోర్నమెంట్ మొదలు కాబోతోంది.
ఇది ఫ్యాన్స్‌లో ఆ ఎగ్జైట్‌మెంట్‌ని చంపేస్తుంది. అందుకే ఈ సారి టీ20 వరల్డ్ కప్ ఎవరైనా ఇంట్రస్ట్‌గా చూస్తారని నేనైతే అనుకోవడం లేదు. ఇంకా మాట్లాడితే 2027 వన్డే వరల్డ్ కప్‌పై కూడా నాకు నమ్మకం లేదు. విరాట్, రోహిత్ ఉన్నారు కాబట్టి ఆ టోర్నీ చూస్తారేమో. కానీ ప్లేయర్ల కోసం టోర్నీ చూడడం క్రికెట్‌కి చాలా నష్టం కలిగిస్తుంది. వాళ్లిద్దరూ లేకపోతే క్రికెట్ చూడడం జనాలు మానేసే డేంజర్ ఉంది’ అంటూ అశ్విన్ అనడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే.. టీ20 వరల్డ్ కప్ ఫిబ్రవరి 9న మొదలై మార్చి 8 వరకు జరగబోతోంది. మరి అశ్విన్ కామెంట్స్‌పై మీ ఒపీనియన్ ఏంటి? టీ20 వరల్డ్ కప్ మీరు చూస్తారా?





















