ముస్తాఫిజుర్ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
ఐపీఎల్ 2026 సీజన్ ఆడకుండా బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ అహ్మద్‌పై నిషేధం విధించాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులు, హత్యల కారణంగా భారత్‌లోని చాలామంది.. ముఖ్యంగా హిందూ సంఘాలు బంగ్లాదేశ్ ప్లేయర్లని కూడా ఐపీఎల్‌లో నిషేధించాలని డిమాండ్ మొదలుపెట్టాయి. దీంతో దీని ఎఫెక్ట్ ఇప్పుడు ఐపీఎల్ ఆడుతున్న ఏకైక ప్లేయర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌పై పడుతోంది. ఐపీఎల్ 2026 మినీ వేలంలో కేకేఆర్ రూ.9.20 కోట్ల భారీ ధరకు ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను కొనుక్కుది.
దాంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన బంగ్లాదేశ్ ఆటగాడిగా ముస్తాఫిజుర్ నిలిచాడు. అయితే బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడులు, హత్యల నేపథ్యంలో ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్ ఆడించడానికి వీల్లేదని, ముస్తాఫిజుర్‌ను వెంటనే జట్టులో నుంచి తొలగించాలని హిందూ సంఘాలు, కొంతమంది శివసేన, ఉద్ధవ్ శివసేన నాయకులు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. కేకేఆర్ ఓనర్ షారుఖ్ ఖాన్‌కు వార్నింగ్ కూడా ఇచ్చారు. ముస్తాఫిజుర్ టీమ్‌లో ఉంటే ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనివ్వమని కూడా హిందూ సంఘాలు వార్నింగ్ ఇచ్చాయి. కానీ బీసీసీఐ మాత్రం.. గవర్నమెంట్ నుంచి అఫీషియల్ బ్యాన్ లేకపోతే మేం ఆటగాళ్లను అడ్డుకోలేమని చేతులెత్తేసింది. ఇలాంటి టైంలో ఏం జరుగుతుందనేది సస్పెన్స్‌గా మారింది. అయితే మీరు చెప్పండి. ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్ ఆడించాలా? బ్యాన్ చేయాలా?





















