పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ఆస్ట్రేలియతో మ్యాచ్ సందర్భంగా తీవ్రంగా గాయపడి టీమిండియాకి దూరమైన శ్రేయస్ అయ్యర్ ఇంకా కోలుకోకముందే మరో టీమిండియా టీమిండియా యంగ్ స్టార్ ప్లేయర్ సాయి సుదర్శన్ కూడా ఇప్పుడు విజయ్ హజారే ట్రోపీలో తీవ్రంగా గాయపడి హాస్పిటల్‌లో చేరాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌లో తమిళనాడు తరపున ఆడుతున్న సాయి సుదర్శన్ బ్యాటింగ్ చేస్తుండగా.. రన్ తీసే టైంలో డైవ్ చేశాడు. దీంతో అతడి ఛాతీ బలంగా నేలకు కొట్టుకోవడంతో పక్కటెముక విరిగింది.
మ్యాచ్ టైంలో గాయం పెద్దదిగా అనిపించకపోయినా.. స్కానింగ్‌ల్లో రిబ్ ఫ్రాక్చర్ ఉన్నట్లు డక్టర్లు గుర్తించడంతో ఈ ఇంజురీ లేట్‌గా బయటకొచ్చింది. గాయం నుంచి కోలుకోవాలంటే 6-8 వారాలు విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పడంతో.. సాయి విజయ్ హజారే టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరం కాబోతున్నాడు. ప్రస్తుతం సాయి బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే.. సాయి సుదర్శన్ ఐపీఎల్‌లో గుజరాత్ టీమ్‌లో స్టార్ ఓపెనర్‌గా ఉన్నాడు. దీంతో ఈ ఇంజురీ వార్త గుజరాత్ టీమ్‌కి పెద్ద షాక్ ఇచ్చినట్లే. అయితే ఐపీఎల్ స్టార్ట్ కావడానికి ఇంకా దాదాపు 3 నెలల టైం ఉంది కాబట్టి.. అప్పటికి సాయి కోలుకునే ఛాన్స్ ఉంది. దీంతో ఐపీఎల్ ఆడతాడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అయితే ఒకవేళ కోలుకోకపోతే మాత్రం గుజరాత్ టీమ్‌కి ఇది పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది.





















