అన్వేషించండి

Maoist Latest News: ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!

Maoist Latest News: మావోయిస్టుపార్టీ కీలకనేత బరిసెదేవా లొంగుబాటు పెను సంచలనంగా మారింది. హిడ్మా తరువాత అత్యంత సమర్ధుడైన కీలకనేత మావోయస్టుపార్టీకి ఊహించని దెబ్బకొట్టారు.

Maoist Latest News: తెలంగాణ డీజీపీ సమక్షంలో మావోయిస్టు పార్టీ కీలక నేత బరిసెదేవా లొంగుబాటు, ఇప్పటికే కొన ఊపిరితో పోరాడుతున్న మావోయిస్టు ఉద్యమానికి బిగ్ షాక్‌గా చెప్పవచ్చు. బరిసెదేవాతోపాటు 19మంది మావోయిస్టులు దశాబ్దాల పోరటానికి గుడ్ బై చెప్పి, కారడవులు దాటి,ఆయుధాలు వదలి జనజీవన శ్రవంతిలోకి రావడంతోపాటు భారీ స్టాయిలో ఆయుధాలను అప్పగించడం సంచలనంగా మారింది. మావోయిస్టుల అంతమే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ చేపట్టిన కేంద్రం ,వ్యూహాత్మకంగా ముందుకు దూసుకుపోతోంది. చర్చలు, కాల్పుల విరమణ ప్రకటనలు ఏ మాత్రం లెక్క చేయకుండా మావోయిస్టుల ఏరివేత ధ్యేయంగా అడవులను జల్లెడ పడుతూ ,లక్ష్యానికి అత్యంత చేరువలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో తాజాగా మావోయిస్టు పార్టీ కీలక నేత బరిసెదేవా దళం లొంగుబాటు మాత్రమేకాదు, ఆపరేషన్ కగార్ తరువాత ఇంత భారీ మొత్తంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్న దాఖలాలులేవు. 

మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ ఛీఫ్‌గా బరిసెదేవా కొనసాగుతున్నారు. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో మావోయిస్టులు కీలక నేతలు లొంగిపోవడంతోపాటు 48 మౌంటెడ్ LMG వెపన్స్ అప్పగించనున్నారు. బరిసెదేవా వద్ద ఉన్న 20లక్షల రూపాయల నగదు సైతం SIBకి అప్పగించడంతో, కేంద్ర హోమ్ శాఖ సైతం SIBపై ప్రశంసల జల్లు కురిపించింది. ఒక్కమాటలో చెప్పాలంటే డీజీపీ వద్ద ఇంత మొత్తంగా ఆయుధాలతో లొంగిపోవడం ఇటీవల కాలంలో ఇదే ప్రథమంగా చెప్పవచ్చు.

హిడ్మా ఎన్ కౌంటర్ తరువాత గెరిల్లా లిబరేషన్ ఆర్మీ బాధ్యతలు ఇటీవల బరెసెదేవాకు అప్పగించింది మావోయిస్టు పార్టీ. గెరిల్లా దాడులు, వ్యూహాలు రచించడంలో హిడ్మాకు ధీటుగా బరిసెదేవా పనిచేశారు. ఇద్దరూ ఒకే గ్రామం నుంచి రావడంతోపాటు హిడ్మాను దగ్గర చూస్తూ, వ్యూహాలను అందిపుచ్చుకున్న దేవా, దశాబ్దాల పాటు మావోయిస్టు పార్టీలో పలు కీలక ఆపరేషన్లలో పాల్గొన్నాడు. ఎన్నో గెరిల్లా దాడులు విజయవంతంగా నిర్వహించాడు. సాయుధ బలగాల వ్యవహారాలు చూసుకోవడంతోపాటు, మావోయిస్టులకు అవసరమైన ఆయుధ సంపత్తిని అందించడంలో కీలకపాత్ర పోషించాడు దేవా. హిడ్మా మరణం తరువాత నైరాశ్యంలో ఉన్న మావోయిస్టు పార్టీకి టార్చ్‌బేరర్ లా కనిపించిన బరిసెదేవా, బాధ్యతలు తీసుకున్న కొద్ది రోజుల్లోనే డీజీపీ ఎదుట లొంగిపోవడం ఆసక్తిగా మారింది. 

కేంద్రం విధించిన డెడ్ లైన్ దగ్గర పడుతున్న వేళ మావోయిస్టు పార్టీ కీలక నేతలు ఒక్కొక్కరిగా లొంగిపోవడం, మిగతా వారు ఎన్ కౌంటర్లలో మరణించడంతో అడవిలో మిగిలిన అన్నల పరిస్ధితి అత్యంత క్లిష్టతరంగా మారింది. ఈ ఏడాది మార్చి నాటికి అంటే మరో మూడు నెలల్లో మావోయిస్టు రహిత దేశంగా భారత్ మారుస్తామంటూ అమిత్ షా చేసిన ప్రకటన కార్యరూపం దాల్చేందుకు అత్యంత చేరువలో జరుగుతున్న వరుస పరిణామాలు కనిపిస్తున్నాయి.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటిలో శిశువు మృతదేహం మాయం
హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటిలో శిశువు మృతదేహం మాయం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
Embed widget