Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
టెస్ట్ క్రికెట్, టీ20 లకు ఎవరు ఊహించని విధంగా స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీడుకోలు పలికారు. అప్పటి నుంచి వీళ్లిద్దరు కేవలం వన్డేలో మాత్రమే కనిపిస్తున్నారు. అయితే 2027 వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా ఈ ఇద్దరు ప్లేయర్స్ ముందుకు సాగుతున్నారు. 2026 లో రోహిత్, కోహ్లీలు ఎలా రాణిస్తారు అన్నదానిపైనే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు.
ఈ నేపథ్యంలో 2026లో టీమ్ ఇండియా ఆడే ఎన్ని వన్డేలో రో-కో జోడి కలిసి కనిపించనున్నారు అన్న ఆసక్తి ఫ్యాన్స్ లో మొదలయింది. 2026లో ఇండియా 18 వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఆడనుంది. ఏడాది ఆరంభంలోనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ న్యూజిలాండ్ సిరీస్ లో ఆడడం పక్కా. మళ్లీ జూన్ లో వన్డే మ్యాచ్ జరగనుంది. జూన్‌లో అఫ్గాన్ భారత్‌లో పర్యటించనుంది. జూలైలో టీమ్ఇండియా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది.
అక్టోబర్‌లో భారత్ పర్యటనకు వెస్టిండీస్ రానుంది. నవంబర్‌లో భారత జట్టు న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. 2026 చివరిలో శ్రీలకంతో ఇక్కడే మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. మొత్తంగా 6 సిరీసుల్లో 18 వన్డేలు ఆడనుంది టీమ్ ఇండియా. ఎలాంటి సమస్యలు లేకుంటే రోహిత్, విరాట్ అన్ని వన్డేలు ఆడే అవకాశం ఉంది.





















