Goenka Pant KL Rahul | IPL 2025 లోనూ కొనసాగుతున్న గోయెంకా తిట్ల పురాణం | ABP Desam
మీరు ఎప్పుడైనా మ్యాచ్ తర్వాత కావ్యా మారన్ గ్రౌండ్లోకి వచ్చి ప్లేయర్లతో పోట్లాడటం చూశారా. పోనీ షారూఖ్ ఖాన్ ఎప్పుడైనా తన జట్టుపై గ్రౌండ్ లో నిలబడి అసహనం వ్యక్తం చేశాడా. పోనీ ప్రీతిజింతా...అసలు ఏ టీమ్ అయినా ఆ టీమ్ ఓనర్ ఎవరైనా పబ్లిగ్గా ప్లేయర్లపై అసహనం వ్యక్తం చేయటం అరవటం లాంటివి చేయరు. అన్ని జట్లలో లోటు పాట్లు ఉంటాయి కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసే వ్యాపారవేత్తలుగా ఓనర్లకు ఉండే టెన్షన్లు ఉంటాయి కానీ ఆటగాళ్లను అందునా అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లను పదిమంది ముందు అరవకూడదు అనేది కామన్ సెన్స్. గోయెంకా లో ఏటా అది మిస్ అవుతోంది. లాస్ట్ ఇయర్ హైదరాబాద్ తో మ్యాచ్ ఓడిపోయిన తర్వాత LSG కెప్టెన్ గా ఉన్న KL రాహుల్ పై పబ్లిగ్గా ఫైర్ అయ్యారు ఓనర్ సంజీవ్ గోయెంకా. అప్పుడు బాగా మనస్తాపానికి గురైన రాహుల్ అసలు ఆ జట్టునే వదిలిపెట్టేశాడు. ఢిల్లీకి మారిపోయాడు ఈ ఏడాది. కానీ గతేడాది ఢిల్లీకి కెప్టెన్ గా పంత్ ఈసారి LSG కి కెప్టెన్ అయ్యాడు. పంత్ ను ఏకంగా 27కోట్లు పెట్టి కొన్నారు LSG జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకా. అందుకే ఫస్ట్ మ్యాచ్ లో ఫెయిల్ కాగానే పంత్ మీద కోచ్ తో కలిసి అసహనం వ్యక్తం చేశారు గోయెంకా. ఫేషియల్ ఎక్స్ ప్రెషన్స్ మీడియాకు కనపడకుండా అటు తిరిగి పంత్ తో ఏదో సీరియస్ గా మాట్లాడుతుంటే పంత్ కూడా సుదీర్ఘంగా సంజాయిషీ ఇచ్చినట్లు కనిపించింది. డబ్బులు పెట్టి కొంటున్నారు కదా అనుకుంటుంటే LSG లో ఆడాలంటేనే ప్లేయర్లు వణికిపోయేలా గోయెంకా చర్యలు అయితే కనిపిస్తున్నాయి.





















