LRS In Telangana: ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు లేదు, ఈ 31లోగా చెల్లించే వారికే రాయితీ వర్తింపు: మంత్రి పొంగులేటి
Layout Regularization Scheme Telangana | అనధికారిక లేఅవుట్ల క్రమబద్ధీకరణకు రాయితీ పొందాలంటే మార్చి 31 లోగా పూర్తి ఫీజు చెల్లించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

Ponguleti Srinivas Reddy | అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణ గడువు పొడిగింపు పై తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి క్లారిటీ ఇచ్చారు. మార్చి 31 లోపు మొత్తం ఫీజు చెల్లించిన వారికి మాత్రమే 25% రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం LRS గడువు పొడిగిస్తుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇల్లు నిర్మించే సమయంలో క్లియరెన్స్ తీసుకోవాలంటే ఎల్‌ఆర్ఎస్ మొత్తం ఫీజు చెల్లించాల్సి ఉంటుందని భూ యజమానులకు సూచించారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలోని తన చాంబర్లో మీడియాతో చిట్ చాట్ లో పాల్గొని పలు విషయాలపై మాట్లాడారు. గత ప్రభుత్వం కేవలం మాటలు చెప్పింది కానీ LRS ప్రక్రియ పూర్తి చేయలేదు. ప్రభుత్వ అనుమతుల కోసం నాలుగు ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారి కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పర్మిషన్ లేని లేఅవుట్లను క్రమబద్ధీకరణ చేసుకోవడం ద్వారా రిజిస్ట్రేషన్లకు గాని, భవన నిర్మాణాలకు గాని భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తవు. ప్రభుత్వం ప్రకటించిన 25% రాయితీ ప్రకటనకు మంచి స్పందన వస్తోంది. పురపాలక శాఖ అనధికారిక లేఔట్లను రెగ్యులరైజ్ చేయనుండగా, రిజిస్ట్రేషన్ శాఖకు నగదు చెల్లించాలి. గతంలో ఏదైనా లేఔట్లలో అది శాతం రిజిస్ట్రేషన్ పూర్తి అయితేనే వాటిని ఎల్ఆర్ఎస్ కింద క్రమబద్ధీకరణ చేయనున్నాను. ఆన్లైన్లో లేక జిల్లాలో కలెక్టర్ల నుంచి భూ యజమానులు ఎల్ఆర్ఎస్ సర్టిఫికెట్ పొందవచ్చు.
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత భూమి విలువ పెరగనుంది. ఆయా ప్రాంతాలను బట్టి భూముల మార్కెట్ విలువ, స్థలాల బహిరంగ ధర లో వత్యాసం ఉంటుంది. భూ అక్రమాలపై ప్రకటన చేస్తాం. ఎల్లారీస్ లో భాగంగా ఉగాది నుంచి పైలట్ ప్రాజెక్టుగా 15 సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకునేలా సేవలు అందించమన్నాం. రాష్ట్రంలో 6,000 మంది యువతకు లైసెన్సుడు సర్వేయర్లకు శిక్షణ ఇస్తాం. భూములు స్థలాల రిజిస్ట్రేషన్ లకు సర్వే మ్యాప్ తప్పనిసరి అని అన్నారు.
సాదా బైనామాలపై అప్పీలుకు అవకాశం
సాదా బైనామాల క్రమబద్ధీకరణకు గత బిఆర్ఎస్ ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరించి వదిలేసింది. 12 లక్షల దరఖాస్తులు రాగా, చాలావరకు రిజెక్ట్ అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కొత్త దరఖాస్తులు స్వీకరించడం లేదు. గతంలో దరఖాస్తు చేసుకొని తిరస్కరణకు గురైన వారికి అప్పిలేట్ అథారిటీ వద్ద దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తాను. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రాంతాలకు లక్ష 13వేల ఇళ్లను కేంద్రం మంజూరు చేసింది. కానీ గ్రామీణ ప్రాంతాలపై ఎలాంటి స్పష్టత రాలేదు. జీవో 59 ద్వారా భూక్రమబద్ధీకరణ పేరుతో కొందరు విలువైన భూముల్ని ఆక్రమించే ప్రయత్నం చేయగా ప్రభుత్వం గుర్తించి వాటిని నిలిపివేసిందని’ పొంగులేటి తెలిపారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

