Shashtipoorthi: ఆస్కార్ తర్వాత కీరవాణి రాసిన ఫస్ట్ పాట ఇదే... ఇళయరాజా సంగీతంలో 'షష్టిపూర్తి' కోసం రొమాంటిక్ సాంగ్
Shashtipoorthi : ఆస్కార్ అందుకున్న తర్వాత కీరవాణి లిరిక్ రైటర్ గా రాసిన ఫస్ట్ సాంగ్ 'ఏదో ఏ జన్మలోదో' తాజాగా రిలీజ్ అయ్యింది. ఈ సాంగ్ 'షష్టిపూర్తి' అనే సినిమాలోది. ఈ యూత్ ఫుల్ సాంగ్ ఎలా ఉందంటే?

'షష్టిపూర్తి' అనే సినిమా నుంచి తాజాగా రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇళయరాజా ఈ మూవీకి సంగీతం అందిస్తుండగా, ఆస్కార్ అవార్డు విన్ అయ్యాక కీరవాణి రాసిన ఫస్ట్ సాంగ్ ఇదే కావడం విశేషం.
'షష్టిపూర్తి' నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల
రూపేష్ హీరోగా రూపొందుతున్న మూవీ 'షష్టిపూర్తి'. ఇందులో ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీకి పవన్ ప్రభ దర్శకత్వం వహిస్తున్నారు. MAA AAI ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపేష్ చౌదరి ఈ మూవీని నిర్మిస్తున్నారు. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా ఈ మూవీకి సంగీతం అందిస్తుండగా, ఇండియాలోనే ఫస్ట్ ఆస్కార్ పురస్కార గ్రహీత అయిన ఎంఎం కీరవాణి ఈ మూవీ కోసం లిరికల్ రైటర్ గా మారారు. ఆయన 'షష్టిపూర్తి' నుంచి రిలీజ్ అయిన తాజా రొమాంటిక్ సాంగ్ ''ఏదో ఏ జన్మలోదో' కు లిరిక్స్ అందించడం విశేషం. ఆస్కార్ అందుకున్న తర్వాత కీరవాణి రాసిన ఫస్ట్ సాంగ్ ఇదే. ఇక ఈ ఇద్దరు దిగ్గజ సంగీత దర్శకుల కాంబోలో వచ్చిన ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది. 'ఏదో ఏ జన్మలోదో' అంటూ సాగుతున్న ఈ సాంగ్ యూత్ ను ఆకట్టుకునే విధంగా ఉంది. కీరవాణి స్టైల్ సాహిత్య విలువలతో, క్యాచీగా ఉంది. ప్రేమిస్తున్న వ్యక్తికి తాను ఎలా ఉండాలో, ఎలా ఉండబోతుందో ప్రియుడికి వివరించే ప్రియురాలి వెర్షన్ ఇది.
కీరవాణిని రైటర్ గా మార్చిన డైరెక్టర్
'ఏదో ఏ జన్మలోదో' పాటను రిలీజ్ చేసిన సందర్భంగా డైరెక్టర్ పవన్ మాట్లాడుతూ ''ఈ సినిమా కోసం అప్పటికే రెహమాన్, చైతన్య ప్రసాద్ రెండు పాటలు రాశారని, కానీ వాటిలో వాళ్ళ స్టైల్ కన్పించిందని అన్నారు. కొంచెం కొత్తగా ట్రై చేద్దామని అనుకుంటున్న టైంలో కీరవాణి గారిలోని చమత్కారమైన రైటర్ ని ఈ పాట కోసం బయటకు తీయాలని అనిపించిందని చెప్పుకొచ్చారు పవన్. ఇదే విషయాన్ని చైతన్య ప్రసాద్ చెవిలో వేయగా, ఆయన ఆసక్తి చూపించారట. ఆ తర్వాత నిర్మాత రూపేష్ కి విషయాన్నీ చెప్పగా, కీరవాణి రాయడమేంటి ? అని ప్రశ్నించారట.
అయితే అప్పటికే కీరవాణి రాసిన కొన్ని పాటలను వినిపించగా, మరో ఆలోచన లేకుండా సంప్రదించారట. వేరే సినిమాల రీరికార్డింగ్ కోసం ఆయన చెన్నైలో ఉండగా, వెంటనే కలిసి 'షష్టిపూర్తి'లో పాట రాయమని రిక్వెస్ట్ చేశారట. ముందు పల్లవి రాసి పంపిస్తానని, నచ్చితే పాట రాస్తానని చెప్పారట కీరవాణి. అలా స్టూడియో దగ్గరకు వెళ్లేసరికి పల్లవిని పంపించడం, చైతన్య ప్రసాద్ కు నచ్చడం వెంట వెంటనే జరిగిపోయాయి. ఇక ఈ పాటను అనన్య భట్ పాడగా, కీరవాణి సాహిత్యం అందించారు. ఈ మూవీలో 'లేడీస్ టైలర్' జంట రాజేంద్ర ప్రసాద్, అర్చన మరోసారి నటించారు. మూడు దశాబ్దాల తర్వాత వాళ్లిద్దరూ నటించిన సినిమా ఇదే కావడం విశేషం. 'కాంతారా' ఫేమ అచ్యుత్ కుమార్, తెనాలి శకుంతల, ఆనంద చక్రపాణి, మురళీధర్ గౌడ్, చలాకి చంటి, బలగం సంజయ్, మహిరెడ్డి తదితరులు కీలకపాత్రలు పోషించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

