అన్వేషించండి

Man Period Symptoms: ఎవరయ్య మగవారికి పీరియడ్స్ రావని చెప్పింది? బ్లీడింగ్ మాత్రమే ఉండదు, మిగతాది సేమ్‌ టు సేమ్‌!

IMS In Men : ఆడవారికి పీరియడ్స్ వస్తాయని అందరికీ తెలుసు. కానీ మగవారికి కూడా పీరియడ్స్ ఉంటాయని తెలుసా? ఏంటి? ఏమి చెప్తున్నారని అనుకుంటున్నారా? అయితే మీరు ఇది చదవాల్సిందే. 

Premenstrual Syndrome in Men : పీరియడ్స్ అనేవి కేవలం ఆడవారికే ఉంటాయి.. మగవారికి ఎందుకు ఉండవని ఫ్రస్టరేషన్​లో చాలామంది అమ్మాయిలు అనుకునే ఉంటారు. అలాగే ఆ సమయంలో ఆడవారికి వచ్చే మూడ్ స్వింగ్స్​ని మగవారు కూడా అర్థం చేసుకోలేరు. వాళ్లకొస్తే అర్థమయ్యేది మా బాధేంటో అని అమ్మాయిలు అనుకుంటారు. అయితే మీకు తెలుసా? నెలవారి పీరియడ్స్ మగవారికి కూడా ఉంటాయట తెలుసా? కానీ ఈ విషయమే వారికి తెలియదు పాపం. ఆడవారికి PMS ఉన్నట్లు.. మగవారికి IMS ఉంటుందట. 

మగవారికి ఆడవారికి వచ్చినట్లు నెల నెల పీరియడ్ రాదు కానీ.. దానికి చాలా దగ్గరగా ఉండే ఓ ఫేజ్ ఉంటుందట. దానినే Irritable Male Syndrome అంటారు. ఇది కూడా సహజమైన జీవ ప్రక్రియే. ఇరిటబుల్ మేల్ సిండ్రోమ్ వల్ల బ్లీడింగ్ ఉండదు కానీ.. మూడ్​స్వింగ్స్ ఉంటాయి. ఆ సమయంలో చిరాకు, ఆందోళన, నిరాశతో ఉంటారట. దీనివల్ల అలసటగా ఉండడం, నిద్రలేమితో ఇబ్బంది పడడం లిబిడో తగ్గి సెక్స్​పై కూడా ఆసక్తి రాదట. ఈ ఫేజ్​ కొందరిలో ఉంటుందని.. కొందరిలో బయటపడదని చెప్తున్నారు నిపుణులు. 

ఆ వయసు వారిలో.. 

IMS అనేది కామన్​ కాకపోయినా.. 30 అయిపోతున్న వారిలో.. 40 వస్తోన్న వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. వివిధ కారణాల వల్ల ముందే కూడా ఇది స్టార్ట్ అవుతుంది. ఆ సమయంలో వారు ఎవరితో మాట్లాడకుండా సైలెంట్​గా ఉంటారు. రీజన్​ లేకుండా కోపం తెచ్చుకోవడం, దేనిపైనా ఫోకస్ చేయలేరు, ఇంట్రెస్ట్ చూపించలేరు.. శారీరకంగా కూడా యాక్టివ్​గా ఉండలేరు. యాంగ్జైటీ, డిప్రెషన్ ఉంటుంది. ఇవే ఈ IMS లక్షణాలు. నెలలో ఓ రెండు, మూడు రోజులు ఈ లక్షణాలు ఉంటాయి.

IMS కారణాలు ఇవే.. 

మగవారికైనా.. ఆడవారికైనా హార్మోన్లలో అసమతుల్యతలు ఉంటాయి. మగవారిలో టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గడం, మానసికంగా డిస్టర్బ్​గా ఉండడం, చిరాకు పడేలా చేస్తుంది. దీనివల్ల IMS రావొచ్చు. అలాగే దీర్ఘకాలిక ఒత్తిడి కూడా ఈ సమస్యను పెంచుతుంది. హార్మోన్ల సమతుల్యత ఒత్తిడి వల్ల దెబ్బతిని.. ఆందోళనను, డిప్రెషన్​ను పెంచుతుంది. సరైన వ్యాయామం లేకపోవడం, తగినంత నిద్రలేకపోవడం కూడా లక్షణాలను తీవ్రతరం చేస్తాయి. వివాహ బంధంలో విభేదాలు, ఒంటరితనం కూడా IMSకి దోహదం చేస్తాయి. హైపోథైరాయిడిజం, దీర్ఘకాలిక నొప్పులు, స్లీప్ ఆప్నియా కూడా దీనిని అభివృద్ధి చేస్తుంది. 

చికిత్సలివే.. 

కొందరు ఇరిటబుల్ మేల్ సిండ్రోమ్​ని యాక్సెప్ట్ చేయరు. మరికొందరు దానిని గుర్తిస్తారు. అయితే ట్రీట్​మెంట్ తీసుకోవడం వల్ల ఇది కంట్రోల్​లో ఉంటుంది. హార్మోన్ రిప్లేస్​మెంట్ థెరపీ, కౌన్సిలింగ్, జీవనశైలిలో మార్పులు చేయడం, వైద్యులు సూచించే మెడిసన్స్ వాడడం  వల్ల ఇది అదుపులోకి వస్తుంది. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

ఫిజికల్​గా యాక్టివ్​గా ఉండేందుకు ట్రై చేయండి. ఇది ఒత్తిడిని తగ్గించి మూడ్​ని రిఫ్రెష్ చేస్తుంది. రిలాక్సేషన్ టెక్నిక్స్​ని ఫాలో అవ్వొచ్చు. మెడిటేషన్, డీప్ బ్రీతింగ్ కూడా ఒత్తిడిని తగ్గిస్తాయి. సరైన నిద్ర ఉండేలా బెడ్​ రొటీన్​ని సెట్​ చేసుకోండి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకుంటే మంచిది. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
Advertisement

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Venezuelan people happy: దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
Embed widget